Luckey Entertainments - Telugu Short Stories - Movie Reviews - Short Films - Beauty Tips - Health Tips - Cooking Tips in Telugu. Totally You find here complete Entertainment.

Monday, March 8, 2021

Wheatgrass Juice | ఈ రసం సర్వరోగ నివారిణి | Benefits - Side Effects - t...

Wheatgrass Juice


Benefits - Side Effects - Tips

గోధుమ గడ్డి అనేక రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం. ఆయుర్వేదం ప్రకారం గోధుమ గడ్డి రసం (జ్యూస్) రోజూ ఉదయం పరగడుపునే 30 ఎం.ఎల్ మోతాదులో అంటే ఒక టి కప్పు అంత తీసుకుంటే ఎన్నో లాభాలున్నాయి. పౌడర్ గా, టాబ్లెట్ల రూపంలో మనకు ఆయుర్వేద షాపుల్లో లభిస్తుంది. కానీ మనంఏ  గోధుమలను తీసుకుని గడ్డిగా పెంచి కట్ చేసుకుని మిక్సీలో రసం చేసుకొని తాగితే ఎంతో మంచిది.  

                                                     

 ఒక గ్లాసు Wheatgrass Juice రసంలో 'A' విటమిన్‌, B కాంప్లెక్స, C, E, K విటమిన్లుకాల్షియంసోడియం, ఐరన్ఫాస్పరస్, మెగ్నీషియం పొటాషియం, సెలీనియమ్‌,  సల్ఫర్‌క్లోరోఫిల్‌ కోబాల్ట్‌, జింక,  ఉంటాయి. దీనిలో కొలెస్ట్రాల్‌ ఉండదు. ఒకగ్లాసు లోనే 17 ఎమినో యాసిడ్స్‌ ఫైబర్‌ ఎంజైమ్స్‌ ఉంటాయంటే ఇది ఎంత ఆరోగ్యానికి మంచిదో మనకే తెలుస్తుంది.  దీనిని కేవలం గడ్డి రసం అని తీసిపారేయ లేము. గోధుమ మొలకలను న్యూట్రిషనల్‌ రిజర్వాయర్‌గా పౌష్టికాహార నిపుణులు గుర్తించారు. గోధుమ గడ్డి రసం ప్రతి రోజు తాగడం వాళ్ళ ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇపుడు మనం తెలుసుకుందాము.

ఈ రసం సర్వరోగ నివారిణి

·         గోధుమ గడ్డి జ్యూస్ తాగితే ఎర్ర రక్త కణాలు అభివృద్ధి చెందుతాయి. దీనిలో బి12, ఐరన్‌, ఫోలి క్ఆసిడ్‌,  ఎక్కువగా ఉండడం వల్ల ఎర్ర రక్తకణాల పెరుగుదలకు దోహ దం చేస్తాయి.

·      గోధుమ గడ్డి జ్యూస్ క్రమం తప్పకుండా తీసుకుంటే హై బీపీ రాదు. జీర్ణకోశం లోని కొలెస్ట్రాల్‌ను ఇది తగ్గిస్తుంది.

·         ఈ మధ్య జరిగిన శాస్త్ర పరిశోధనలో 'తాల్‌ సేమియా' రోగులు క్రమం తప్పక గోధుమ గడ్డి రసాన్ని తీసుకుంటే వారి రోగ నివారణకు ఎంతో ఉపకరిస్తుంది. ఈ జ్యూస్ రోజు తీసుకోకపోతే వాళ్ళు ప్రతి ఏడు రోజులకు రక్తం మార్పిడి చేసుకోవలసి వస్తుంది. చంఢఘీడ్‌ లోని పెడియాట్రిక డిపార్ట్‌మెంట్‌, ఈ విషయాన్ని పరిశోదించి వెల్లడించింది వైద్య నిపుణులు చెబుతున్నారు.

·         ముఖ్యంగా క్యాన్సర్‌ రోగులకు గోధుమ గడ్డి రసం తాగడం వలన వారిలో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం కుదుట పడుతుంది.

·         గోధుమ గడ్డి రసంలో ప్రొటీన్లు, ఎంజైమ్స్‌, విటమిన్లు, మినరల్స్‌ ఉన్న కారణాన ఈ జ్యూస్ సేవించిన వారికి రోగ నిరోదక శక్తి పెరుగుతుంది.

·         గోధుమ గడ్డిలో క్లోరోఫిల్‌ ఉండటం వలన బ్యాక్టీరియాను నివారించి శరీరానికి నూతనోత్తేజం కలిగిస్తుంది.

·         గోధుమ గడ్డి పెంపకం ఖర్చుతో కూడిన పని కాదు. బక్క పలుచనీ  వారికి ఇది శరీరంలోని మెటబాలిజాన్ని సరిచేస్తుంది, బరువును పెంచుతుంది .

·         గోధుమ గడ్డి రసంలో యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫైటో న్యూట్రియంట్స్‌, బీటా కెరోటిన్‌, బయో ఫ్లావో నాయిడ్‌, బి, సి, ఇ విటమిన్ల కారణాన క్యాన్సర్‌ కణాలను నశింపచేస్తుంది. రోగ నివారణా శక్తిని పెంచి ఎర్ర రక్త కణాల అభివృద్ధికి పాటుపడుతుంది.

·         ప్రతి రోజు ఒక గ్లాసు జ్యూస్ తాగితే చర్మం పై ముడుతలు రావు. ముడుతలు మటుమాయ అవ్వడమే కాక చర్మం కాంతివంతంగా, ప్రకాశ వంతంగా ఉంటుంది. కన్నుల కింద నల్లటి వలయాలూ, మచ్చలూ రాకుండా నిరోధిస్తుంది. నేడు కాస్మటిక పరిశ్రమ గోధుమగడ్డి రసాన్ని వారి ఉత్పత్తులలో అధికంగా ఉపయోగిస్తున్నారు. ఇది చర్మానికి టానికగా పనిచేస్తుంది. రోజూ ఆహారంలో వీట్ గ్రాస్ జ్యూస్  ఒక పోషక పదార్థంగా ఉపయోగించవచ్చు. ఈ జ్యూస్ని ఆరెంజ్‌, యాపిల్‌, ఫైనాఫిల్‌, నిమ్మ రసం  తదితర జ్యూస్‌లతో కలిపి తాగవచ్చు. గోధుమ గడ్డి పొడిని కూడా పోషక పదార్థంగా వాడవచ్చును. నేడు గోధుమ గడ్డి టాబ్‌లెట్లు ఆహారానికి ప్రత్యామ్నాయాంగా మార్కెట్‌లో దొరుకుతున్నాయి.



 

    ఇకపోతే రేగులర్గా ఈ జ్యూస్ తీసుకోవాలని అనుకుననే వారు కొన్ని జాగ్రత్తలు కూడా  తీసుకోవలసి ఉంటుంది. అవి ఏమిటో తెలుసుకుందాము.

     గోధుమ గడ్డి రసం నిర్ణీత పరిణామంలోనే తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే సైడ్‌ ఎఫెక్ట్స కూడా ఉంటాయి. జీర్ణకోశ వ్యాధులు, తల నొప్పి,  పళ్లరంగు మారడం, మగతగా ఉండడం జరుగుతుందట. గోధుమ జ్యూస్ తాజాగానే వాడాలి. నిలువ వుంచి తీసు కోరాదు. ఈ జ్యూస్ ఆహారానికి ప్రత్యామ్నాయం కాదు. అయితే, ఆహారంలో భాగంగా దీనిని తీసుకోవచ్చు.

    ఎవరికైతే గోధుమ జ్యూస్ పడదో, వారు మానివేయడం మంచిది. డాక్టర్‌ లేదా న్యూట్రిషియన్‌ ఎక్సపర్ట్‌ లేదా పౌష్టికాహార నిపు ణుని సలహా మేరకు ఈ రసాన్ని తాగాలి. గోధుమ గడ్డిని మనం ఇంట్లోనే పెంచు కుని దాని నుండి రసం తీసుకోవచ్చును.

     గోధుమలను ఓ గిన్నెలో 10 నుండి 12 గం. వరకు నానబెట్టాలి. ప్రతి నాలుగు గంటలకూ నీరు మార్చాలి. రెండు అంగుళాల రంధ్రాలు గలిగిన ఓ ట్రే ను తీసుకోవాలి. దానిలో మూడింతలు మట్టిని వేయాలి. ఆ మట్టిపై నీటిని పోయాలి. గోధుమలను సమానంగా ఆ మట్టిలో వేయాలి. కిటీకీ సమీపాన గాలి తగిలేటట్లు మొక్కలకు పేపర్‌ టవల్‌ను ఉంచాలి.డైరెక్ట్ గా సూర్య రశ్మి పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

     రోజూ ఉదయాన్నే నీరు పోయాలి. సాయంకాలం కొంచెం నీరు చిమ్మితే సరి పోతుంది. ఐదో రోజుకి మొక్కలు ఒక అంగుళం ఎదుగుతాయి. కొంచెం కొంచెం నీరు పెడితే సరిపోతుంది. ఎనిమిదో  రోజుకి గోధుమ గడ్డి  7 - 8 అంగుళాల ఎత్తుకి పెరుగుతుది. 

        ఈ సమయంలో గడ్డిని కోసి జ్యూస్ చేసుకుని  తీసుకోవచ్చు.  జ్యూస్ టెస్ట్  కోసం కొంచెం బెల్లం లేదా తేనె కలుపుకోవచ్చు. ఈ జ్యూస్ నీ  వెంటనే తాగండి. కాస్త ఆలస్యమైతే ఇందులోని శక్తి తగ్గిపోతుంది. రోజు 30 ml  మించకుండా ఈ రసాన్ని సేవిస్తుంటే ఎలాంటి క్రోనీక వ్యాధిలు మన దగ్గరికి రావు. వచ్చినా  మెల్ల మెల్లగా తగ్గిపోతాయి.  


No comments: