Luckey Entertainments - Telugu Short Stories - Movie Reviews - Short Films - Beauty Tips - Health Tips - Cooking Tips in Telugu. Totally You find here complete Entertainment.

Sunday, March 21, 2021

ధర తగ్గిందని బంగారం కొంటున్నారా | Are You going to purchase Gold

Are You going to purchase Gold 

 ధర తగ్గుతుందని బంగారం కొంటున్నారా...?

ఇన్కం టాక్స్ తో జాగ్రత్త....! 

     ధర తగ్గుతుందని బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా...? మీ ఆలోచన చాల మంచిది.  కొనండి మీ దగ్గర ఉన్న డబ్బుతో కొనండి. చక్కగా నగలు చేయించుకుని ధరించండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం లేదా పెళ్ళిల కోసం ఇలా ధర తక్కువ ఉన్నపుడే  బంగారాన్ని కొని దాచుకోండి.ఆర్దికంగా అవసరానికి పనికి వస్తుంది. ఇది చాలా మంచి సమయం.


బంగారం ధర గత ఏడాది ఆగష్టు నుంచి పడిపోతూనే ఉంది. ధర దిగడం ప్రారంబించిన రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 13వేల రూపాయలు తగ్గింది. ఈ సం. మొదలు నుంచి కూడా ధర తగ్గుతూనే ఉంది. ఈ ఏడాది జనవరిలో  బంగారం ధర రూ.50 వేల పైనే ఉండేది, ఇప్పుడు 44వేలకి పడిపోయింది.  ఇంకా కూడా తగ్గుద్ది అని నిపుణుల ఆలోచన.





       బంగారం ధర తగ్గడం అనే  అంశాలు చాలానే ఉన్నాయి. అమెరికా డాలర్ బలపడటం, బాండ్ ఈల్డ్ పైకి కదలడం, కోవిడ్ 19 వ్యా్క్సిన్ రావడం. ఇలాంటి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మెరుగు పడ్డాయి. అందుకే గోల్డ్  పైన పెట్టుబడులును ఉపసంహరిచుకుని ఈక్విట్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ  కారణంగా గోల్డ్ రేట్ పాడి పోతోంది.



బంగారంపై మక్కువతో. చేతిలో డబ్బులు ఉన్నాయని, పిల్లల పెళ్లిలకు బంగారం అవసరం అని,  ప్రత్యేక కార్యక్రమాలు వంటివి ఉన్నాయని లేదంటే ధరలు బాగా తగ్గియని, చాలా మంది బంగారం కొంటు ఉంటారు. కాని లిమిట్‌కు మించి ఎక్కువ బంగారం ఉంటే ఇన్కం టాక్స్ అధికారులు పట్టుకు పోతారనే విషయం మీకు తెలుసా....? అఫ్ కోర్స్ అన్ని ప్రూవ్ లు  కరెక్ట్‌గా ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. కాని ఆ అన్ని ప్రూఫ్ లు  ఏమిటో ఇపుడు మనం సమీక్ష  చేసి తెలుసుకుందాము.


ఒక వ్యక్తి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు? ఎక్కువ బంగారం ఉంటే ఏమౌతుంది? వంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 132 ప్రకారం ప్రూఫ్ లు చూపని బంగారాన్ని సీజ్ చేసే అధికారం ఇన్కం ట్యాక్స్ అధికారులకు ఉంటుంది. అయితే  మీ వద్ద ఉన్న బంగారానికి సమాధానం చెప్పగలిగితే, అంటే సరైన  డాక్యుమెంట్ ప్రూఫ్స్ కలిగి ఉంటే ఎంత బంగారం అయినా కలిగి ఉండొచ్చు. సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ( CBDT ) ఈ విషయాన్ని వ్యక్త పరిచింది. ఒకవేళ మన వద్ద ఉన్న గోల్డ కి ప్రూఫ్  చూపకపోతే ఏమౌతుంది. ఏమౌతుంది.. మన వద్ద ఉన్న బంగారాన్ని ఇన్కం ట్యాక్స్ అధికారులు చక్కగా పట్టుకుపోతారు.

 


అంత బంగారాన్ని పట్టుకుపోరు, కొంత లిమిట్ వరకు వదిలేస్తారు. ఆ కొంత లిమిట్ ఏమిటి  అంటే - పెళ్లి అయిన అమ్మాయి  500 గ్రాముల బంగారం కలిగి ఉండొచ్చు. అంటే దాదాపు 50 తులాల బంగారం అన్నమాట. అదే పెళ్లి కాని అమ్మాయిలు అయితే 250 గ్రాముల గ్జోల్ద్ కలిగి ఉండొచ్చు. అంటే దాదాపు 25 తులాల బంగారం అన్నమాట. అదే జెంట్స్  అయితే 100 గ్రాముల బంగారం తమ వద్ద ఉంచుకోవచ్చు. అంటే దాదాపు 10 తులాల బంగారం అన్నమాట. ఈ లిమిట్‌ లోపు గోల్డకి  ఎలాంటి  ప్రూఫ్ లు అవసరం లేదు.  ఇంతకు మించిన బంగారం కాని, విలువైన నగలు కాని ఉంటె ప్రూవ్ చుపేట్టాల్సి వస్తుంది. 


సో ఫ్రెండ్స్... ఇక్కడ నేను మీకు చెప్పేది ఏమిటంటే బంగారం కొనండి. బిల్ల్స్ మీ వద్ద పెట్టుకోండి. GST టాక్స్ కట్టాల్సి వస్తుందని బిల్ లేకుండా ఎ విలువైన వస్తువులు కొనకండి. అలా కొంటె మీరు కష్టం చేసి కొనుక్కున బంగారం రెక్కలు వచ్చిన పక్షి లా ఎగిరిపోతుంది.


ఇలాంటి ఇంట్రస్టింగ్ టాపిక్స్ కోసం మా Luckey Entertainments బ్లాగ్ ని Subscribe చేసుకోండి. 

No comments: