Luckey Entertainments - Telugu Short Stories - Movie Reviews - Short Films - Beauty Tips - Health Tips - Cooking Tips in Telugu. Totally You find here complete Entertainment.

Friday, February 12, 2021

Uppena Review | ఉప్పెన | Telugu Movie | Vaisshnav Tej | Explained by Luc...

Uppena Review

ఉప్పెన | Telugu Movie

Mythri Movie Makers
Movie Name  :  Uppena
Starring  :  Panja Vaisshnav Tej,  Krithi Shetty,     Vijay Sethupathi.
Music  :   Devi Sri Prasad
Cinematography  :  Shamdat
Edited :   Naveen Nooli
Written & Directed by      Bucchi Babu Sana.
Produced :  Naveen Yerenini, Y. Ravi Shankar, Sukumar.
Release date  :  12 February 2021
Running time :        147 minutes
Budget           ₹22
crore.


ఈ రోజు మనం ఉప్పెన మూవీ ని రివ్యూ చేసి చుస్దము.

ఈ చిత్రం మొదట ఏప్రిల్ 2 2020 న విడుదల కావాల్సి ఉండే కాని COVID-19 మహమ్మారి కారణంగా వాయిదా పడి  ఇపుడు  ఫిబ్రవరి 12, 2021 న థియేటర్లలో విడుదల అయింది.

మెగా స్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి మరొక్క మెగా హీరో మన తెలుగు సినిమా ఇండస్ట్రి కి  పరిచయం అవుతున్నాడు. చిరంజీవి మేనల్లుడు అయిన సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అతని సరసన కృతి శెట్టి, మరియు ముక్య పాత్రలో విజయ సేతుపతి నటించారు. ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు అయిన బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు.

హీరో, హీరోయిన్, డైరెక్టర్ ముగ్గురు కొత్తవాళ్లను పరిచయం చేస్తున్న ఈ సినిమాకు విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. హీరో మెగా ఫ్యామిలీ నుంచి రావడం ఒక ఎత్తు అయితే ,,, ని కన్ను నీలి సముద్రం అనే పాట ఇంకో ఎత్తు అని చేపవచ్చు.

ఇక స్టొరీ విషయానికి వస్తే.... ఉప్పాడ గ్రామంలోని మత్య్సకార కుటుంబానికి చెందిన ఓ పేదింటి యువకుడు మన హీరో వైష్ణవ్‌ తేజ్‌. తండ్రి చేసే చేపల వ్యాపారానికి చేదోడు వాదోడుగా ఉంటాడు. చిన్నప్పటి నుంచి తన ఆసామి అయిన విజయ్ సేతుపతి కూతురు బెబమ్మ అంటే మన హీరోయిన్ కృతిక శెట్టి అంటే ఎంతో ఇష్టం. ప్రాణం పోయిన పరువ లేదు పరువు మాత్రం పోవద్దు అనే క్యారెక్టర్ సేతుపతి. తన కూతురు కాలేజికి వెళ్ళడానికి ఉరి నుంచి ఒక స్పెషల్ బస్ వేయిస్తాడు. అదే బస్ లో రోజు కాలేజికి వెళ్ళే కృతిక మన హీరో ప్రేమ లో పడుతుంది. ఈ విషయం తెలిసి సేతుపతి కోపం తో ఉగి పోతాడు. తమని సేతుపతి ఎక్కడ చంపెస్తాడో అని ఉరి నుంచి పారిపోతారు మన ప్రేమ జంట. 

సేతుపతి  కంట పడకుండా వివిధ ప్రాంతాల్లో తిరుగుతు ఉంటారు. కానీ ఓక రోజు బేబమ్మను సేతుపతికి అప్పగిస్తాడు మన హీరో. అల ఎందుకు చేసాడు...? అపుడు కృతిక ఎలా స్పందించింది. క్రుతికను తన ఇంటికి తిసుకేల్లిన సేతుపతి ఆమెని ఎం చేసాడు...? ప్రేమను సేతుపతి  వ్యతిరేకించడానికి కారణం ఏమిటి...? అనే ప్రశ్నలకు సమాధానమే ఉప్పెన చిత్రం కథ. ఈ కథను కంప్లీట్ గా  తెలుసుకోవాలంటే థియేటర్ కి వెళ్లి ఈ సినిమా చూడాల్సిందే.


        ఉప్పెన సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే... వైష్ణవ తేజ్ నటన సూపర్బ్ అనే చెప్పాలి. అతని హావభావాల లో,  నటనా చాతుర్యం లో అసలు ఎ లోటు కనబడలేదు. కృతిక శెట్టి విషయంలోను  అంతే అనాలి. చక్కగా కుందనపు బొమ్మల కనిపించింది. హీరో హెరాయిన్ కెమిస్ట్రీ చక్కగా పండింది అనే చెప్పాలి. విజయ సేతుపతి నటన సినిమా మొత్తంలో హై లైట్. నెగిటివ్ రోల్ లో అయనకి ఆయనే సాటి అనొచ్చు. మ్యూజిక్ సూపర్బ్. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తుంది అనడంలో ఎ మాత్రం సందేహం లేదు. పాటలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతం అనే చెప్పాలి.


అయితే ఈ సినిమా మనం చూస్తున్నంత సేపు వేరే సినిమాల్లోని కొన్ని సన్నివేశాలు గుర్తుకు వస్తాయి. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్‌ సీన్లు కూడా రొటీన్‌గా నే  ఉన్నాయి అని చెప్పవచ్చు.

 ఫస్టాఫ్‌ చూస్తే ఇంత లెంత్  ఎక్కువైందనే భావన కలుగుతుంది. సెకాండాఫ్‌లో కూడా చాలా సీన్లు పాత సినిమాలను గుర్తుకు తెస్తాయి. క్లైమాక్స్‌లో రీవీల్‌ అయ్యే ఓ సీక్రెట్‌ మాత్రం ఈ మూవీకి హైలెట్‌ అని చెప్పొచ్చు. సినిమా మొత్తంలో క్లైమాక్స్ అదుర్స్.

సో ఫ్రెండ్స్ ఈ సినిమా చూసి మీ అభిప్రాయాలను మన కామెంట్ సెక్షన్స్ లో తెలుపడం మరిచిపోకండి.  మీ కామెంట్స్ లైక్స్ మాకు ఎంతో ఎంకరేజ్ ఇస్తాయి. మరొక్క రివ్యూ తో మాతో సారి మీ ముందుకు వస్తాను. అంత వరకు సెలవ్...

 మీ లక్కి ముదిరాజ్.

No comments: