Luckey Entertainments - Telugu Short Stories - Movie Reviews - Short Films - Beauty Tips - Health Tips - Cooking Tips in Telugu. Totally You find here complete Entertainment.

Wednesday, March 3, 2021

AMAZING Benefits of Banana | Health Benefits of Eating Banana PEEL | Re...

AMAZING Benefits of Banana

Health Benefits of Eating Banana PEEL

 అరటి పండులో ఎన్ని విటమిన్స్ విలువలు ఉన్నయో అరటి తొక్కలో కూడా అంతే పోషకాలు వున్నాయంటే మీరు నమ్ముతారా...?  తప్పకుండా నవ్వుకుంటారు. హాయిగా నవ్వుకుని ఈ ఆర్టికల్ ని పూర్తిగా చుస్తే మీకే తెలుస్తుంది.

 అరటిపండును మనం ఎంత ఇష్టంగా తింటామో, అంతే అయిష్టంగా  అరటి పండు తొక్కని  పారేస్తాము. Banana మాత్రమే కాదుBanana Peel కూడా మనకు మేలు చేస్తుంది. అవును నిజమేమీరు విన్నది అక్షరాలా హండ్రెడ్ పెర్సెంట్ నిజమే. అరటి పండు లో ఎన్ని పోషక విలువలు ఉంటాయో దాని తొక్కలో  కూడా అంతే పోషక విలువలు ఉంటాయని   సైంటిస్టులు చేసిన ప్రయోగాలు వల్ల తెలిసింది. ఆ వివరాలు ఏమిటోమనం రివ్యూ చేసి తెలుసుకుందాము. 

కాలుష్యంసూర్యకాంతిదుమ్ము ధూళితీసుకునే ఆహారం.. ఇవన్నీ మన చర్మంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. దాంతో చర్మం నల్లగా మారుతుంది. మనం వెస్ట్ గా పడేసే అరటి పండు తొక్క ఈ సమస్యలను తగ్గించి స్కిన్ ని మెరిపిస్తుంది. జిడ్డు చర్మం వున్న వారు చెంచా తేనెనిమ్మరసంఒక అరటి తొక్కను తీసుకుని పేస్ట్ గా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసి కాసేపాగి గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా ప్రతి రోజు చేస్తే చర్మంలో అధికంగా ఉన్న జిడ్డు వదిలి పోతుంది.


  • అరటి పండు తొక్క పులిపిర్లను తొలగించడంలో ఉపయోగ పడుతుంది. మరియు కోత్తవి రాకుండా కాపాడుతుంది. ఇందు కోసం, పులిపిర్లు ఉన్న ప్రాంతాన్ని అరటి తొక్కతో గట్టిగా  రుద్దండి. ఆ ప్రాంతం మీద రాత్రంతా అరటితొక్కను ఉంచి టేప్ తో అతికించండి. దీని వల్ల వారంలో అ పులిపిరి కరిగి పోతుంది.
  • మొటిమలతో మీ ముఖం అంద వికారంగా కనిపిస్తుంటే అరటి తొక్కతో ముఖాన్ని మంచిగా మర్థన చేస్తే పలితం కనిపిస్తుంది. ఇలా రోజూ ఇలా చేయడం వల్ల ఒక వారంలోపలే మంచి ఫలితం కనపడుతుంది.
  • సోరియాసిస్ తో బాధపడుతున్న వారు  ప్రతి రోజు అరటి తొక్క తో మాయిశ్చరైజేషన్ చేస్తుంటే మంచి ఫలితం కలుగుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.  ఇలా చేయడం వల్గ సోరియాసిస్ ను అతి తొందరలోనే నయం చేస్తుంది మరియు మీరు తక్కువ సమయంలోనే మంచి ఫలితాలు చూడవొచ్చు.
  • అప్పుడప్పుడు  శరీరం పైన దురద పుడుతుంది, అలాంటపుడు  అరటితొక్క తో మసాజ్ చేయండి వల్ల  తక్షణం ఉపశమనం కలుగుతుంది.
  • దోమలకాటు లేదా తేనె తీగల కాటుకి కూడా అరటి తొక్క ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. తేనె తీగలు మనల్ని కరిచినపుడు వాటి ముళ్ళు మన శరీరంలో దిగుతుంది. ఆ ముల్లుని తీయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా రాదు. అలాంటపుడు  అరటి తొక్క ఎంతో ఉపయోగ పడుతుంది. ఆ ముళ్ళు ఉన్న చోట అరటి తొక్కని కాసేపు పెట్టి, ఒక్కసారిగా  లాగితే తొక్క తో పాటు ముళ్ళు కూడా బయటికి వస్తుంది.
  • అరటి తొక్క హాని కారమైన యూవీ కిరణాలు నుండి మన కళ్ళను రక్షించడంలో సహాయపడుతుంది. మీరు మీ కళ్ళను అరటి తొక్కతో రుద్దే ముందు, అరటితొక్కను సూర్యుని ముందు ఉంచండి. ఇలా చేయటం వలన మీ కళ్ళకు శుక్లాలు ప్రమాదం కూడా తగ్గుతుందని నిరూపించబడింది.
  • అరటి పండు తొక్కలో  పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటుంది . కాబట్టి, దీనిని తినడం వల్ల మలవిసర్జన సాఫీగా జరుగుతంది. ఒకవేళ తొక్కని పూర్తిగా తినకపోయినా. అందులోని తెల్లని పదార్థాన్ని స్పూన్‌తో గీసుకుని తీసుకోవచ్చు.
  • అరటి పండు తొక్కలో ట్రిప్టోఫాన్ అనే రసాయనం ఉంటుంది.  నిద్రలేమి సమస్యతో బాధపడేవారు అరటి పండు తొక్కలను తింటుంటే నిద్ర బాగా పడుతుంది.
  • అరటి పండులో కన్నా దాని తొక్కలోనే ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. మన  శరీరంలో ఉన్న LDL అంటే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గగించి HDL అంటే మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. దీని వల్ల గుండె సంబంధ సమస్యలు రావు. ఓ పరిశోధన  బృందం దీన్ని నిరూపించింది కూడా. వరుసగా కొన్ని రోజుల పాటు కొంత మంది రోజూ అరటి పండు తొక్కలను తిన్నారు. దీంతో వారి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గినట్టు,  మంచి కొలెస్ట్రాల్ పెరిగినట్లు గుర్తించారు.
  • అరటి పండు తొక్క మంచి ప్రొబయోటిక్‌గా పనిచేస్తుంది. ఇది తినడం వల్ల పేగుల్లో ఉన్న చెడు బాక్తిరియ తీసేసి, మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
  • అరటి పండు తొక్కను రెగ్యులర్‌గా తినడం వల్ల జీర్ణ సమస్యలు పోతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండదు. శరీరంలో ఉన్న విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి.
  • అరటి పండు తొక్కను తినడం వల్ల రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. ఈ తొక్కలో లుటీన్ అనే పదార్థం ఉంటుంది. ఇది దృష్టి సమస్యలను పోగొడుతుంది. రేచీకటి, శుక్లాలు రావు. దెబ్బలు, గాయాలు, పుండ్లు, దురదలు, పురుగులు, కీటకాలు కుట్టిన చోట అరటి పండు తొక్కను రుద్దితే ఉపశమనం లభిస్తుంది.
  • అరటి పండు తొక్కతో మన పళ్ళను తోముకుంటే దంతాలు దృఢంగా, తెల్లగా మారుతాయి. చిగుళ్ల సమస్యలు ఏమైనా ఉంటె పోతాయి.
  • చాల మంది మనలో కాళ్ల పగుల్లతో బాధ పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు తమ కళ్ళను దుమ్ము దూలి లేకుండా కడుక్కుని  అరటి తొక్క తో రోజు పగుల్ల పైన రుద్దడం వల్ల వారం పది రోజుల్లో సమస్య నుంచి రిలీఫ్ కలుగుతుంది. 

  

ఇన్ని ప్రయోజనాలు చెప్పక కూడా అరటి పండు తొక్కని నేరుగా తినలేమని అనుకునేవారి వారికోసం ఒక లక్కి టిప్ – అదేమిటంటే అరటి తొక్క ని  జ్యూస్‌లా చేసుకుని తాగవచ్చు. అరటి పండు తొక్కను వాటర్ లో బాగా మరిగించి ఆ నీటిని తాగవచ్చు. దీంతో పైన చెప్పిన అన్ని లాభాలు కలుగుతాయి.


సో ప్రెండ్స్ ఈ లక్కి టిప్స్ మీకు నచితే మీ ఫ్రెండ్స్ కి , మీ బందువులకి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ ప్రయోజనాలు తెలుసుకుని పాటిస్తారని ఆశిస్తాను. 

మా ఛానల్ కి మీరు మొదటి సరిగా వచ్చినట్లు అయితే Subscribe చేయడం మరిచిపోవద్దు. దాంతో పాటు పక్కనే ఉన్న ఘంట సింబల్ ని కూడా నోక్కండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయి.


బాయ్ ఫ్రెండ్స్... మరో వీడియో తో మోక్కసారి మీ ముందుకు వస్తాను. అంత వరకు సెలవ్.... 

మీ లక్కి ముదిరాజ్.

 


No comments: