Luckey Entertainments - Telugu Short Stories - Movie Reviews - Short Films - Beauty Tips - Health Tips - Cooking Tips in Telugu. Totally You find here complete Entertainment.

Sunday, November 21, 2021

ప్రేమించానని చెప్పకపోవడం నా తప్పా || నా సమస్యకి పరిష్కారం చెప్పండి || Lu...

ప్రేమించానని చెప్పకపోవడం నా తప్పా

    నా పేరు శంకర్. వయసు 30. నా సమస్య ఏమిటంటే...? ప్రేమ. నా ప్రేమని తనకి చెప్పకపోవడం. అసలు విష్యం ఏమిటంటే  చిన్నపటినుంచి జ్యోతి తో కలసి చదువుకున్నాను నేను. ఎలా మొదలయ్యిందో తెలియదు  కాని తన పట్ల నాకు ఆకర్షణ, తను నా మనిషి అనే ఒక భావన రోజు రోజుకి నాలో ఎక్కువ ఐపోయింది. ఫ్రెండ్ గా ఉన్నప్పటి చనువు, ప్ఈరేమ గా మారాక భయంగా రూపాంతరం చెందింది, చనువుగా ఆమెని తాకితే ఏమైనా అనుకుంటుందేమో, గట్టిగా పేరు పెట్టి పిలిస్తే నన్కోను అపార్దం చేసుకుంటుందేమో, తనకి నచ్చని పని చేస్తే నాతో  స్నేహం మానేస్తుందేమో ఇలా ఎన్నెన్నో భయాలతో  పిచ్చేక్కి పోయేది నాకు.


    టెన్త్ అయిపోయింది. ఇంటర్ చదవడానికి సిటికి వచ్చాను. ఊరు మారినా తన ఊహలే నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేవి. అలా అలా ఇంటర్ అయిపోయింది. డిగ్రి కూడా కంప్లీట్ చేశాను. ఆ తరువాత మా ఉరికి వెళ్లాను. ఈ అయిదు సం. లలో ఒక్కసారి కూడా ఉరికి వేల్ల లేదు నేను.  ఇప్పుడు కూడా తప్పని సరి పరిస్థితిలో వెళుతున్న. మంచి ఉద్యోగం సంపదించుకున్నాక జ్యోతి  వాళ్ళ ఇంటికి వెళ్లి నా లవ్ విషయాన్ని తనకి చెబుదాము అని అనుకున్న. మా కుటుంబాల మద్య మంచి అవగాహన ఉంది, కాబట్టి ఎవరు ఏమి అబ్యంతరం చెప్పారు అని కూడా  అనుకున్న.

   మరుసటి రోజు  చక్కగా తాయారై జ్యోతి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నా ప్రేమ విషయం తనతో చెబుదామని. నన్ను చూడగానే జ్యోతి ఎంతో సంతోషించింది. పరుగెత్తుకు వచ్చి నన్ను  వాటేసుకుంది. కాని నేను మాత్రం అచేతనంగా ఉండిపోయాను. కాసేపు అలాగే హత్తుకుని వదిలి సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది. జ్యోతి నన్ను సంతోషంగా తో కౌగిలించు కుందని సంతోష పడాలా, తనకు పెళ్లి అయిపోయిందని బాధ పడాలా అర్ధం కాని స్థితిలోకి వెళ్లి పోయాను, అలాగే  ఇంటికి వచ్చేసాను.

ఫ్రెండ్స్ నా ప్రేమని ముందుగా చెప్పకపోవడం నేను చేసిన తప్పా...? అపుడే  చెబితే నీకు చదువు లేదు, జాబు లేదు, లైఫ్ లో సెటిల్ కాలేదు అంటారు. అపుడే పెళ్లి ఏంటి అంటారని భయం. ఇపుడు ఎం చేయాలో అర్ధం కావడం లేదు. తను లేకుండా నేను ఉండలేను.

నా సమస్యకి మీ పరిష్కారం చెప్పండి.

మీ లక్కి ముదిరాజ్.


No comments: