Luckey Entertainments - Telugu Short Stories - Movie Reviews - Short Films - Beauty Tips - Health Tips - Cooking Tips in Telugu. Totally You find here complete Entertainment.

Saturday, March 27, 2021

Tea Review || India`s most Famous Tea || Costly Street Tea in West Benga...

India`s most Famous Tea

Costly Street Tea in West Bengal

ఈ రోజు మనం చాయ్ గురించి రివ్యూ చేసి చుస్దాము. చాయ్ గురించి రివ్యూ ఏమిటి అని ఆశ్చర్య పోతున్నారా...?  చాయ్ అని తేలికగా తిసిపరేయకండి.  ఒక్క కప్పు చాయ్ రేట్ ఏంటో తెలుసా...? వెయ్యి రూపాయలు.




    










        ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే. కోల్‌కత్తలో నివసిస్తున్న పార్థా ప్రతిం గంగూలీ 2014 లో ముకుందపూర్‌లో ఒక టి కప్పు స్టాల్ పెట్టాడు. ఒక పెద్ద గొడుగు, దాని కింద ఒక పెద్ద టేబుల్, పక్కన 4 చిన్న స్తూల్స్ అంతే . ఆ స్టాల్ కి ఒక పేరు కూడా ఉంది.
 అది ఏమిటంటే నిర్జాష్‌.    నిర్జాష్ టి కొట్టులో దాదాపు 100 రకాల టిలను అందిస్తున్నాడు గంగూలి. ఒక్కో కప్పు టి  రూ .12 నుంచి రూ .1000 వరకు వివిధ రకాల చాయ్‌లను విక్రయిస్తున్నాడు.

        15 రూపాయలు 25 రూపాయలు చాయ్ లని మనం చూసే ఉంటాము. కానీ ఈ వెయ్యి రూపాయల టి ఏమిటి అని ఆలోచిస్తున్నారా...>?


    ఎస్ నిర్జష్ టి కొట్టు స్పెసియలిటియే ఇది. ఇక్కడ దొరికే బో-లే టీ ధర వెయ్యి రూపాయలు.  ఈ టి పౌడర్ kg కి  దాదాపు 3 లక్షలు రూపాయలు ఉంటుందట. ఈ టీ ప్రపంచంలోనే అత్యంత శుద్ధమైన టీగా గుర్తింపుపొందింది. ఈ చాయ్ ని తయారు చేసేందుకు దాదాపు 3 గ.ల సమయం పడుతుంది. 

అన్ని వ్కయాపారాల కన్నా చాయ్ అమ్ముకోవడం చాలా తేలిక అని అనుకుంటారు అందరు. నిజమే పాలు నిల్లు టీ పొడి ఉంటె చాలు. చాయ్ చేసి చక్కగా అమ్ముకోవచ్చు. ఇలా మీరు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే చాయ్ చేయడం తేలికే కాని చాయ్ ప్రియులను మన హోటల్ వరకు రప్పించుకోవడం చాలా కష్టం. దాని కోసం మనం చేసే టీ లో చిక్క దానం, రుచి, మరియు  వెరైటి ఉండాలి.


    ఇక్కడ ఉన్న ఇతర చాయ్ రకాలు ఏమిటో ఒక సారి తెలుసుకుందాము. ఫస్ట్ రకం ఏమిటంటే  సిల్వర్ నీడిల్ వైట్ టీ, రెండవది లావెండర్ టీ, మూడవది  మందార టీ, వైన్ టీ, తులసి అల్లం టీ, బ్లూ టిసాన్ టీ, టీస్టా వ్యాలీ టీ, మకైబారి టీ, రూబియోస్ టీ, మరియు ఓకేటి టీ. ఇలా ఎన్నో రకాల  చాయ్ లు ఇక్కడ అమ్మబడుతున్నాయి.

 

        పార్థా ప్రతిం గంగూలీ నిర్జాష్ టి కొట్టు పెట్టె ముందు ఒక చిన్న ఉద్యోగం చేసేవాడట. ఆ ఉద్యోగంలో తన   బ్రతుకుదెరువు సరిపోక ఈ చాయ్ షాప్  పెట్టాడు. అయితే అందరిలా కాకుండా మంచి మంచి రకరాల చాయ్ లు అమ్మాలనే దుద్దేశంతో టిలలో వెరైటీలు చేయడం ప్రరంభిచాడు. ఇదే ఆతని వ్యాపారాన్ని సక్సెస్ చేసింది. అతను అందించే ప్రత్యేకమైన రుచుల కారణంగా అతని వ్యాపార అబివృద్ది కాకుండా అతను పుట్టి పెరిగిన ఉరుకి కూడా ఒక విశిష్టత తిసుకోచ్చాడనే చెప్పాలి. కోల్‌కత్త కి వచ్చే టురిస్తులు తప్పకుండ ముకుందపూర్‌కి వచ్చి గంగూలి అందించే వెరైటి టిలను ఆస్వాదిస్తున్నారు. ఒకవేళ మీరు కూడా కోల్‌కతాకి వెళ్తే   నిర్జాష్ టి కొట్టులో ఒక మంచి టి తగుతారనే ఆశిస్తున్న.


సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మన ఛానల్ సుబ్స్క్రిబ్ చేయడం మాత్రం మరువకండి.


No comments: