Luckey Entertainments - Telugu Short Stories - Movie Reviews - Short Films - Beauty Tips - Health Tips - Cooking Tips in Telugu. Totally You find here complete Entertainment.

Sunday, June 6, 2021

Kala Movie Review || కాలా సినిమా సమీక్ష || Aha Movies || Telugu Movie Re...

Kala Movie Review

  కాలా సినిమా సమీక్ష || Aha Movies

     మలయాళం లో సంచలనం సృష్టించి తెలుగులో అనువదించబడిన KALA  మూవీని రివ్యూ చేసి చుస్దాము.



         దిఫ్రెంట్  మూవీస్ కి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా అడ్డాగా మారిపోయింది. ఓక  వైపు  తెలుగు సినిమాలు ప్రోత్సహిస్తూనే, మరోవైపు అనువాద చిత్రాలకు సైతం పచ్చ తివాచీ పరుస్తోంది. అందులో భాగంగా తాజాగా మలయాళ హిట్‌ మూవీ అయిన కాలా మోవిని తెలుగులో అనువదించి  ఆహా ఒటిటి లో  రిలీజ్ చేయడం జరిగింది. 

    చిత్ర కధ ముఖ్య అంశం ఏమిటంటే జంతువు కోసం జంతువులా మారిన మనుషులు క్రూరంగా కొట్టుకోవడం, సౌండ్‌ ఎఫెక్ట్స్‌ దీనికి తగ్గట్లు ఉండటంతో యాక్షన్‌ ప్రియులను ఈ చిత్రం విపరీతంగా ఆకట్టుకుంటోంది.

         

టొవినో థామస్‌తో పాటు దివ్యా పిళ్ళైసుమేష్ మూర్, లాల్ పాల్, ప్రమోద్ కీలక పాత్రల్లో నటించిన ఈ క్రైమ్‌ త్రిల్లర్‌కు విఎస్‌ రోహిత్‌ డైరేక్టన్ వహించాడు. 
టొవినో థామస్‌, విఎస్‌ రోహిత్‌, అఖిల్‌ జార్జ్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా జూన్‌ 4న ఆహా లో రిలీజ్‌ అయింది. మరి ఈ మోవీ తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో సమీక్షించి  చుస్దాము.       

            ప్రతి మనిషిలో మంచి, చెడు గుణాలు కలబోసి ఉంటాయి. ఒక్కో సమయంలో ఒక్కో గుణం అధికంగా కనిపిస్తుంటుంది. అలా ఆ గుణాన్ని బట్టి మనం అతను మంచివాడనో, చెడ్డవాడనో బేరీజు తెలుసుకుంటాం. కానీ ఒక్కోసారి పైకి మంచిగా కనిపించే మనుషులు అంతా మంచి వాళ్ళు కాదు, చెడ్డగా కనిపించే వాళ్ళంతా పూర్తిగా చెడ్డవాళ్ళూ కాదు అని నిరూపిస్తుంది ఈ చిత్రం. మనిషిలోని పశు ప్రవృత్తి బయటకు వచ్చినప్పుడు ఆ మంచి, చెడు అనే బేధాన్ని మరిచిపోయి  ప్రవర్తిస్తుంటాడు. అలాంటి ఇద్దరి కథే కాలా చిత్రం.

        


  kaalaa మోవీ 
క‌థ‌లోకి వెళ్తే  ఊరికి దూరంగా ఉన్న అట‌వీ ప్రాంతంలో ఓ ఇల్లు, చిన్న పొలం, ఆ ఇంట్లో తండ్రీ కొడుకులలు. వాళ్ళిద్దరికీ అస్సలు ప‌డ‌దు. కొడుకు షాజీ వ్యవ‌సాయం చెస్తూన్దాడు. అయితే, అందులో అప్పుల పాల‌వుతాడు. ఈ విష‌యంలో తండ్రి కొడుకులకి ఎప్పుడూ గొడ‌వ‌లు జరుగుతుంటాయి. 


    తోట‌లో ప‌ని చేయ‌డానికి వేరే ఊరు నుంచి కొందరు ప‌ని మ‌నుషులు వ‌స్తారు. వాళ్ల‌లో ఒక‌డు సైకోగా ప్రవరిస్తాడు. అతని ప్ర‌వ‌ర్త‌న చాలా విచిత్రంగా ఉంటుంది. త‌ను…ఆ ఇంటికి వ‌చ్చింది ప‌ని చేయ‌డానికి కాదు. ప్ర‌తీకారం తీర్చుకోవ‌డానికి అని తెలుస్తుంది. అసలు షాజీకి, ఆ వ్యక్తికి మధ్య వైరం ఏమిటీ? అంత దొంగ చాటుగా షాజీ ని దెబ్బకొట్టాలని అతను ఎందుకు ఉహిస్తాడు...? హీరోకి విలన్ కి మధ్య జరిగే క్రూరమైన పోరులో  ఎవరిది పైచేయి అయ్యిందన్నదే ఈ చిత్ర కధాంశం.

          సినిమా ప్రారంభంలో టైటిల్స్ లోనే కొత్తదనాన్నిడైరెక్టర్ చూపించారు. అక్కడ నుండే మనం చూడబోతోంది రొటీన్ మూవీ కాదు, ఇది సమ్ థింగ్ డిఫరెంట్ అనే భావన మనకి కలుగుతుంది. కథానాయకుడు షాజీ, అతని కొడుకు మధ్య జరిగే సంభాషణతో చిత్రం మొదలోతుంది. ఈ సినిమాలో హీరో మెంటాలిటీ ఏమిటనేది దర్శకుడు మొదటి సీన్ లోనే  చేప్పెస్తాడు. అక్కడ నుండి ఒక్కో పాత్ర ప్రవేశిస్తాయి. కానీ అన్నీ అనుమానాస్పద పాత్రలే. ఎవరికి ఎవరితో విరోధం? ఎందుకు విరోధం? అనేది విక్శకులకు అర్థం కాకుండా చాలా మంచి సస్పెన్స్ ను దర్శకుడు మెయిన్ టైన్ చేశాడు. ధనవంతులు పేదల  ప్రవర్తనలోని భేదాన్ని అవకాశం ఉన్న చోటల్లా దర్శకుడు చూపించదానికి ప్రయత్నం చేశాడు. 

    మనిషి ప్రాణం విలువైనదే, అలానే ప్రతి జీవి ప్రాణం కూడా విలువైనదే అని చెప్పే కథ ఇది. నిర్లక్ష్యంతో ఓ మూగ జీవి ప్రాణాన్ని అకారణంగా హరిస్తే, దాని ప్రాణం కంటే ఎక్గాకువ గా భావించే వ్యక్తి ఏ స్థాయి వాడైనా, ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడనేదే ఈ చిత్రం. విశేషం ఏమంటే... ఒక వర్గపు మనిషిలోనూ ఏదో మూల మానవత్వం, క్షమాగుణం ఉంటుందని దర్శకుడు గట్టిగా నమ్మినట్లు చూపించి, సినిమాను మరో మెట్టు పైకి తీసుకెళ్ళాడు. క్లయిమాక్స్ లో జరిగే ఒక సంఘటనే సినిమాకు అసలు సిసలు బలం.

            టొవినో థామస్ దృడమైన శరీరం షాజీ పాత్రకు చాలా బాగా ఉపయోగపడింది. అతనొక  మొనగాడిని, ఆ మొనగాడిని ఎదిరించే మనిషి ఎవరూ ఉండడు అనే భావన వీక్షకులకు కలుగుతుంది. అయితే విచిత్రంగా షాజీ తన ప్రత్యర్థి చేతిలో చావుదెబ్బలు తింటుంటే, మనిషిలోని పశు ప్రవృత్తి ఎలాంటి వాడినైనా చిత్తు చేస్తుందనే సత్యం బోధపడుతుంది మనకు.

    ఓక మనిషిని ఇంకో మనిషి వేటాడి, వెంటాడి చావు దెబ్బతీయడాన్ని ఎంత విలక్షణంగా సినిమా  తీయొచ్చో అంతలా తీశాడు దర్శకుడు. అందుకు అఖిల్ జార్జ్ కెమెరా పనితనం ఎంతో ఉపయోగపడింది. అలానే డాన్ విన్సెంట్ నేపథ్యం సంగీతం కూడా. నిజం చెప్పాలంటే. సెకండ్ హాఫ్ మొత్తం సాగే ద్వంద్వ పోరాటం కొంతసేపటికి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షకు గురిచేస్తుంటుంది. అక్కడే దర్శకుడు తన బుర్రకుపదను పెట్టాడు. ఇంటి నుండి బయటకు వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్కరుగా మల్లీ తిరిగి రావడంతో కథలో ఉత్సుకత మొదలవుతుంది. వీళ్ళ సమక్షంలో ఈ పోరాటం ఎలాంటి మలుపులు తిరుగుతుందా? అనిపిస్తుంది.  మొత్తానికి సినిమా చూసి థియేటర్ బయటికి వీక్షకులు తామే ఓ పెద్ద పోరాటంలో పాల్గొన్నామనే భావన కలిగి రిలాక్స్ అవుతారు అనడం లో ఏ మాత్రం సందేహం లేదనే చెప్పాలి.

       
  
ఈ మధ్య కాలంలో విలన్ ఇగోని హైలైట్ చేస్తూ చాలా మూవీస్ వచ్చాయి. అయితే దానిని యాక్షన్ కు మిళితం చేసి రోహిత్ కాలా చిత్రాన్ని  తెరకెక్చించాడు. మన హీరోకి చక్కలు చూపించే విలన్ గా సుమేశ్ మూర్ అద్భుతంగా నటించాడు. లాల్, దివ్య సైతం ఆ యా పాత్రల్లో ఒదిగిపోయారు. భార్యాభర్తల నడమ శృంగారాన్ని కొంత మోతాదుకు మించే చూపించారు. పైగా ఎడతెగని భీకరపోరాట సన్నివేశాలతో సెకండ్ ఆఫ్  సాగడంతో దీనికి ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. యాక్షన్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులే కాకుండా, షార్ట్ ఫిలిం మేకర్స్ కూడా ఈ చిత్రాన్ని స్టడీ కోసం చూడాలన్నదే నా అభిప్రాయం.

          క‌థ‌ని క్లుప్తంగా చెప్పుకోవాలంటే. ఓ కుక్క మరణానికి  ప్ర‌తీకారం తీర్చుకునే సైకో క‌థ ఇది. విన‌డానికి ఇది నిజంగా విచిత్రంగానే ఉంటుంది. కానీ వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమా లోని సంఘటనలను తెర‌కెక్కించామ‌ని ద‌ర్శ‌కుడు చెప్పాడు.  స‌మాజంలో ఇలా కూడా జ‌రుగుతుందా? అని ఆశ్చ‌ర్య‌పోతాం. 

    న‌టీన‌టుల న‌ట‌న‌లో దేనికీ వంక పెట్ట‌లేం. సైకో ఇలాఉంటాడా? అనే రీతిలో… ఆ పాత్ర‌లో న‌టించేశాడు థామ‌స్‌. మూర్ కూడా ఓ ర‌కంగా సైకోలానే ఉంటాడు. ముఖ్యమైన స‌న్నివేశాలు, అక్క‌డ వినిపించే ఓ వెస్ట్ర‌న్ మ్యూజిక్  చూస్తే ద‌ర్శ‌కుడి అభివ్య‌క్తి, అభిరుచులు అర్థం అవుతాయి. కాక‌పోతే… కొన్ని విష‌యాల్లో చాలా చాద‌స్తంగా అనిపించింది. 


    అస‌లు క‌థ‌లోకి వెళ్ల‌డానికి చాలా స‌మ‌యం సమయం పట్తీటడం వల్ల  ప్రేక్ష‌కుల్ని కొద్దిగా  ఇబ్బంది పెట్టాడు దర్శకుడు. ద్వితీయార్థం ఉత్కంఠ‌త‌గా సాగినా… అదీ కొన్ని వ‌ర్గాల‌కే న‌చ్చుతుంది. రియ‌లిస్టిక్ యాక్ష‌న్ సినిమాని ఇష్ట‌ప‌డేవాళ్ల‌కు ఓకే. హాస్యాన్ని, పాటలను ఇష్టపడే  వాళ్లు ఈ సినిమా కి దూరంగా ఉండ‌డ‌మే మంచిది. ఒకే లొకేష‌న్ లో సినిమా ఎలా తీయాలి? అనేది తెలుసుకోవాలంటే.. కాలా చూడొచ్చు. రియ‌లిస్టిక్ యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఈ సినిమాలోని ప్ర‌త్యేక‌త‌. అంత‌కు మించి ఏమీ ఉండ‌దు.

          ఈ సినిమా చూసాక మీకు ఎలా అనిపించిందో, మీ ఫీలింగ్ ఏమిటో మీ అభిప్రాయాన్ని మా కామెంట్ బాక్స్ లో తెలుపడం మరిచిపోవద్దు.

   


No comments: