Luckey Entertainments - Telugu Short Stories - Movie Reviews - Short Films - Beauty Tips - Health Tips - Cooking Tips in Telugu. Totally You find here complete Entertainment.

Tuesday, June 1, 2021

Holi Festival || హోలీ పండుగ || Full Review || Luckey Reviews

Holi Festival 


Full Review

Holi Festival ( హోలీ పండుగ ) పండు ఆకులు రాలుతూ , కొత్త ఆకులు వస్తూ, చిగురు పూతలు పుస్తూ ఉంటె అదే వసంత రుతువు వస్తుందనడానికి సంకేతం. ప్రకృతిలో ఉండే వివిధ రంగులను మనం మనపైన చల్లుకుంటూ జరుపుకునే పండగే Holi Festival. 

    మనిషి జీవితం రంగులమైయంగా, రాగరంజితంగా, సప్తవర్ణ  శోభితంగా ఉండాలన్నదే ఈ పండుగ సందేశం.  హోలీ పండుగ గూర్చి ఎన్నో పురాన కథలు ఉన్నాయి. అందులోంచి కొన్ని మనం Full Review చుస్దాము.


పరమేశ్వరుడు ఎప్పుడు తపస్సు చేస్తూ ఉంటాడని మనకు తెలుసు. అయన తపస్సు వల్ల లోకం స్థంబించి పోయిందట. అపుడు దేవాన దేవతల కోరిక మేరకు, మన్మదుడు  తన స్నేహితుడైన వసంతుడిని వెంటబెట్టుకుని అ పరమ శివుని తపోదీక్షని బంగం చేయడానికి ప్రయత్నించాడట. అపుడు అ పరమ శివుడు కోపోద్రిక్తుడయి తన మూడోకన్ను తెరిచి మన్మథుణ్ణి భస్మం చేసాడు.

    మన్మథుడి భార్య రతీదేవి ప్రార్దన మేరకు  మన్మథుణ్ణి తిరిగి బతికిస్తాడు పరమేశ్వరుడు. అయితే అతను రతీదేవికి తప్ప మరెవరికీ తన రూపంలో కనిపించడు. రూపం కోల్పోయిన మన్మథుడు ఆనాటి నుంచి ఇనాటి వరకు మనుషుల మనస్సులలో దాగి ఉండి, తన బాణాలద్వారా వారి అసలు పని నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. 

    ఇక్కడ మన్మథుడు అంటే మనస్సును మథించేవాడని అర్థం. మనిషిలో దాగి ఉన్న కోరికలను  కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరు అంతః శత్రువులు మన మనస్సును మథిస్తాయి. వాటినే అరిషడ్వర్గాలు అంటారు. 

    మనిషిని పతనం చేసే ఈ ఆరు రకాల గుణాలనూ మనిషి ఎపుడు అదుపులో ఉంచుకోవాలని చెప్పేందుకే పరమేశ్వరుడు కామదేవుడిని భస్మం చేశాడు. ఈశ్వరుడు కాముణ్ణి భస్మం చేసిన రోజైన ఫాల్గుణ శుద్ధపూర్ణిమకు ముందురోజు, మనం కామదేవుని ప్రతిమను తయారు చేసి, కామదహనం చేసి ఈ పండుగను  జరుపుకుంటాము.


ఇకపోతే ఫాల్గుణ పౌర్ణిమనాడు ఒకరి పైన ఒకరు రంగులు చల్లు కోనే ఆనవాయతి ఎలా వచ్చిందంటే ...  

శ్రీ కృష్ణుడు నల్లని వాడు.  రాధ పాల మిగడలా తెల్లని తెలుపుతో ఉంటుంది. ఓ రోజున శ్రీ కృష్ణుడు రాధ పక్కన కుర్ఉచుని ఉన్న సమయాన తనని తాను చూసుకుని తాను ఎందుకు నల్లగా సున్నానా అని దిగులు పడ్డాడట. 

అప్పుడు యశోదమ్మ ఒక ఉపాయం చెప్పిందట. ‘రాధ అసలు రంగు తెలియకుండా ఉండడానికి ఆమె పైన అన్ని రంగులు కలిపిన నీళ్లు పోయ మని చెప్పిందట. దాంతో నల్లనయ్య రాధమీద రంగునీళ్లు పోశాడట.



 ఈహఠాత్పరిణామానికి విస్తుపోయిన రాధ తను కూడా కృష్ణుని మీద రంగులు కలిపిన నీరు చిలకరించిందట. ఇలా రాధాకృష్ణులిద్దరూ ఒకరి మీద ఒకరు రంగునీళ్లు పోసుకోవడం చూసిన ద్వారక జనులు తాము కూడా ఆనందోత్సాహాలతో ఒకరిపైన ఒకరు రంగులు పోసుకోవడం చేసారట. 

అదే మనకి రంగుల పండుగ అయింది. ఆ నాటినుంచి ప్రతి ఫాల్గుణ పున్నమినాడు ప్రజలందరూ ఒకరినొకరు రంగులతో ముంచెత్తుకోవడం, పెద్ద ఎత్తున పండుగలా జరుపుకోవడం ఆనవాయితీగా మారిపోయింది.

 
     ఇకపోతే ఇపుడు ఒక్కో ప్రాంతాలల్లో ఒక్కో విదంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. హోలీ అని పేరు రావడానికి కారణం హిరణ్య కశిపునికి హోలిక అనే సోదరి ఉండేదట. హోలిక తన మేనల్లుడైన ప్రహ్లాదుణ్ణి చంపాలని అతన్ని తన ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిలో దూకిందట. అయితే, హోలిక మంటల్లో మాడిపోగా, ప్రహ్లాదుడు నారాయణ ప్మంత్రాన్ని జపిస్తూ సురక్షితంగా బయట పడ్డాడు.  ఆ దుష్ట రాక్షసి పీడ వదిలిందన్న సంతోషంతో మధుర లోని  ప్రజలంతా ఆనందంతో ఒకరిపై ఒకరు రంగు నీళ్లు చల్లు కుంటూ  హోలీ అనే ఉత్సవం చేసుకున్నారట. హోలిక అనే రాక్షసి అంతం అవ్వడం తో ఆమె పేరు మీదుగా కూడా  ‘హోలీ’ అనే పేరు వచ్చిందట, ఇవే కాకుండా హోలీ పండుగను వసంత రుతువు వస్తోందనడానికి సంకేతంగా భావిస్తారు. ఈ వేళ లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తే సకల సంపదలూ చేకూరతాయని పురాణమ్ లో చెప్పబడింది.

ఈ రోజున బాల కృష్ణుని ఊయలలో వేసి ఊపుతారు.  అందుకే పండుగను కొన్ని ప్రాంతాల లో డోలోత్సవంగా జరుపుకుంటారు.

        అయ్యప్ప పంబల రాజుకు కనపడింది కూడా ఈ రోజునే, అంటే ఫాల్గుణ శుద్ధ పూర్ణిమనాడే అని అయ్యప్పకు పూజలు చేస్తారు.

అలాగే ఈ వేళ పెళ్లి కాని యువతీ యువకులు తమకి తొందరగా పెళ్లి కావాలని రతీమన్మథులను పూజిస్తారు.

 అదేవిధంగా పిల్లలకు ప్రాణహాని తలపెట్టే ఢుంఢి అనే రాక్షసి పీడ విరగడ అయింది కూడా ఈ రోజునే, అందుకే ఈ రోజున తమ పిల్లలని చల్లగా చూడాలని పరమేశ్వరుని పుజిస్తారు.


ఈ రోజున ఆచరించాల్సిన వేరే విధి విధానాలూ ఉన్నాయి, ఉదయాన్నే కట్టెలు, పిడకలు రాశిగా పోసి నిప్పును రాజేసి దానిపైకి హోళికా అనే శక్తిని అవహింపజేసి ‘శ్రీ హోళికాయైనమః’ అని పూజించి మూడు సార్లు అగ్నికి ప్రదక్షిణం చేస్తూ ...

 ‘వందితాసి సురేంద్రేణ బ్రాహ్మణా శంకరేణచ , అతస్త్వాం పాహినో దేవి భూతే భూతి ప్రదో భవ’ 

అనే శ్లోకం చదవాలని పెద్దలు చెబుతారు. 

ఆ తర్వాతే రంగులను చల్లడం, రంగునీటితో ఉత్సవం జరుపుకోవడం చేయాలని శాస్త్త్ర వచనం. హోలీ పండుగ రోజున చెట్లేలకు పూసే లేత మావిచిగుళ్లు తింటే ఆ సంవత్సరమంతా మనం సంతోషంగా ఉంటామని  శాస్త్రోక్తం.

 హోలీ పండగకు సంబంధించి పలు కథలు ఇలా ప్రచారంలో ఉన్నాయి. సో ఫ్రెండ్స్... మీకు ఈ స్టొరీ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి. మీకందరికీ హోలీ శుభాకాంక్షలు. 


No comments: