Luckey Entertainments - Telugu Short Stories - Movie Reviews - Short Films - Beauty Tips - Health Tips - Cooking Tips in Telugu. Totally You find here complete Entertainment.

Sunday, June 6, 2021

కన్నీళ్ళవల్ల ఆరోగ్యం || Benifits of Crying || Advantages of Tears || Luc...

Benifits of Crying and Advantages of Tears

కన్నీళ్ళవల్ల ఆరోగ్యం

            మనసు లోని  భావోద్వేగాలు బయటకు వచ్చినప్పుడు, మన కళ్ళలోంచి  వచ్చే నీళ్ళ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. బాధలో ఉన్నప్పుడు కన్నీళ్లు రావడం సహజం. కాని ఒక్కోసారి  ఎక్కువ సంతోషంగా ఉన్నప్పుడు కూడా కన్నీళ్లు వస్తుంటాయి. వీటిని ఆనంద భాష్పాలు అంటారు. 



   ప్రతి మనిషి ఆరోగ్యానికి నవ్వు ఎంత ముఖ్యమో - ఏడుపు కూడా అంతే ముఖ్యం అని అంటారు. మనసు బాధ పడినపుడు మనం ఏడిస్తే మెదడులో ఆక్సిటోసిన్‌, ఎండార్ఫిన్‌ అనే ఫీల్‌గుడ్‌ రసాయనాలు విడుదలవుతాయి. కన్నీళ్ల వల్ల మనసులో భాధ తగ్గి, మానసిక ప్రశాంతత కలిగి పాజిటివ్‌ ఆలోచనల వైపు దృష్టి మళ్లుతుంది. కన్నీళ్లలో ఉండే ఐసోజైమ్‌లు, క్రిములు, బ్యాక్టీరియాల నుంచి కన్నుకు మంచి రక్షణ కలుగుతుంది. కన్నీళ్ల వల్ల కళ్లలో ఉండే దుమ్ము, మలినాలు, ఇన్ఫెక్షన్స్  బయటకు వెళ్లిపోతాయి. అలాగే అపుడపుడు ఏడవడం వల్ల మెదుడు, శరీర ఉష్ణోగ్రతలు క్రమపద్దతిలో ఉంటాయి.

        కొన్ని పరిశోధనల తేలిన విషయాలు ఏమిటంటే కన్నీలు కార్చితే మన కళ్ళలో ఉన్న కొన్ని విషపూరిత బ్యాక్తేరియ బయటకు వస్తాయట. ఇది శరీరంలోని ఒత్తిడి హర్మోన్ల ఉత్పత్తి తగ్గిస్తుంది. ఇది శరీరంలోని విషాన్ని తొలగిస్తుంది. భావోద్వేగ కన్నీళ్లలో లైసోజైమ్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. దీని వల్ల  యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలతో  సహాజ ప్రక్షాళనగా పని చేస్తాయి. అలాగే ఏడుపు వల్ల కలిగే ఇంకొక  ఆరోగ్య ప్రయోజనం ఏంటంటే  కంటికి తేమను ఇస్తుంది. కళ్ల పొడిదనం, ఎరుపు మరియు దురదను నివారిస్తుంది.  డిప్రెషన్‌ నుంచి ఉపశమనం కూడా కలిగిస్తుంది. ఏడ్వడం వల్ల మనిషిలో  ప్రతికూల భావోద్వేగాల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

    మనసులోని భావోద్వేగాలను కంట్రోల్ చేయలేక పోయినప్పుడు అది కన్నీళ్ల రూపంలో బయటకు వస్తాయి. అపుడపుడు ఎడ్వడం  వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. మనసు వివిధ రకాల భావాలకు గురైనపుడు, కన్నీటి గ్రంథి నుంచి కళ్ల ద్వారా బయటకు వచ్చే నీటిని కన్నీళ్లు అంటారు. అయితే కన్నీళ్ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏంటో మనము ఇపుడు తెలుసుకుందాము.

ఆక్సిటోసిన్‌, ఎండార్ఫిన్‌ వల్ల శారీరక, మానసిక భావోద్వేగాల్లో మార్పులు కలుగుతాయి. శరీరానికి నొప్పిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఉల్లిపాయలు తరిగినపుడు, కళ్లల్లో ఏదైనా చెత్త పడ్డప్పుడు కళ్ల మంట తగ్గించడానికి రెప్లెక్స్‌ టియర్స్‌ ఉపయోగపడుతుంది. ఎక్కువగా భావోద్వేగాలకు గురైనప్పుడు కన్నీళ్లు వస్తుంటాయి. దీని వల్ల మానసిక ఒత్తిడి దూరమవుతుంది. 

డెలివరి టైంలో గర్భం నుంచి శిశువు బయటికి వచ్చినపుడు ఫస్ట్ క్రయ్ చాలా ముఖ్యం. శిశువులు తల్లి కడుపులో ఉన్నపుడు బొడ్డు తాడు ద్వారా ఆక్సిజన్‌ను ఆందుకుంటారు. బిడ్డ ప్రసవించిన తర్వాత, బొద్దు తాడు కట్ చేశాక  వారు స్వయంగ శ్వాసించడం ప్రారంభించాలి. బిడ్డ మొదటి ఏడుపు ఎందుకు అంత ముక్యం అంటే, గర్భం నుంచి బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టిన శిశువు శ్వాస తీసుకుంటూ తన జీవితానికి అనుగుణంగా సహాయపడతాయి. ఏడుపు వల్ల చిన్న పిల్లల ఊపిరితిత్తులు, ముక్కు మరియు నోటి లో ఏదైనా అదనపు ద్రవాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. ఒకవేళ పిల్లాడు పుట్టగానే ఏడ్వలేక పోతే శిశువు  విపు మిద చిన్నగా లేదా గట్టిగా కోట్టి ఎడ్పిస్తారు డాక్టర్లు.

ఏడుపు వల్ల పిల్లలు రాత్రిపుట బాగా నిద్రపోవడానికి సహాయ పడుతుందని చెబుతున్నారు  పిల్లల వైద్య నిపుణులు. శిశు నిద్రపై ఒక చిన్న అధ్యయనంలో,  తమ పిల్లలను పడుకోబెట్టడానికి నియంత్రిత ఏడుపు అని కూడా పిలుస్తారు. నియంత్రిత ఏడుపుతో, పిల్లలు పడుకోబోయే కొన్ని నిమిషాల ముందు బాగా ఏడుస్తారు ఎంత సేపు ఏడ్చి పడుకుంటే అంత సేపు  ఎక్కువగా పోతారట.

సో ఫ్రెండ్స్ ఈ స్టొరీ మీకు నచితే లైక్ చేయండ్, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మన YouTube Channel Subscribe చేయడం మాత్రం మర్చి పోవద్దు.

No comments: