Luckey Entertainments - Telugu Short Stories - Movie Reviews - Short Films - Beauty Tips - Health Tips - Cooking Tips in Telugu. Totally You find here complete Entertainment.

Sunday, June 6, 2021

Naked Sleeping is Not Good || పడుకోడానికి 16 సూత్రాలు || శ్మశానంలో పడుక...

పడుకోదానికి కూడా పాటించాలి16 సూత్రాలు

టైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా...? పాడుకోడానికి కూడా రూల్స్ ఉంటాయని అనికున్తున్నారా. ఉంటాయి. తప్పకుండా ఉంటాయి.  ఈ పదహారు నియమాలను అనుసరించి మీరు ప్రతి రోజు పడుకుంటే మీకు పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి. ధీర్గకాలిక రోగాలు మీ దరిచేరవు. మరియు దీర్ఘాయుష్మంతులు అవుతారు అని పురాణాలు చెబుతున్నాయి. ఆ విషయాలు ఎలా  ఏమిటో మనం రివ్యూ చేసి తెలుసుకుందాము.

1. మనుస్మృతి శాస్త్రం లో చెప్పిన సూత్రం [ప్రకారం, మనుషులు ఎవరు లేని చోట, ఎవరు లేని ఇంట్లో ఒంటరిగా పడుకోవద్దట. పద్మ పురాణము ప్రకారం పూర్తి చీకటిగా ఉన్న గదిలో మరియి స్మశానవాటికలో అసలు పడుకోకూడదు.

2. విష్ణు స్మృతి శాస్త్రం ప్రకారం చెప్పబడిన విషయం ఏమిటంటే, పడుకోని ఉన్న వారిని ఒక్క సారిగా నిద్ర లేపకూడదు. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో ఆ మనిషిని నిద్ర లేపాల్సి వస్తే ఏదైనా ఒక దైవ కార్యము గూర్చి చెబుతూ నిద్ర లేపాలట. ఉదాహరణకి పూజకి చేయడానికి లేదా గుడికి వెళ్ళడానికి టైం అవుతోందని, నిద్ర లేపాలి.

3. చాణక్య నీతిలో చెప్పబడిన విషయం ఏమిటంటే...? విద్యార్థి, పనివాడు, లేదా వాచ్మెన్ తమ కర్తవ్యాన్ని విస్తుమరించి పడుకుంటే, అలాంటి వాళ్ళని డిస్టర్బ్ చేసి  నిద్ర నుంచి లేప వచ్చును. 

4. నిద్ర గూర్చి దేవీ భాగవతములో చెప్పిన నియమం ఏమిటంటే ఆరోగ్యవంతులు బ్రహ్మా ముహూర్తం లో నిద్ర లేవాలాట అంటే తెల్లవారు ఝామున 4గ లకి ముందు నిద్ర లేస్తే అలాంటి వాళ్ళు  సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారట.  

5. మహాభారతం ప్రకారం తడి పాదాలతో నిద్రిపోవద్దు, విరిగిన మంచం పైన పడుకోవద్దు. అన్నం తిని మూతి కడుక్కోకుండా పడుకో వద్దు. ఇలా చేయడం వల్ల లక్ష్మి దేవి మనల్ని అసహ హించు కుంటుందట.

6. గౌతమ ధర్మ సూత్రం ప్రకారం నగ్నంగాపడుకో వద్దట.

7.  ఆచార మయూఖ్ శాస్త్రం ఇలా చెప్పబడింది. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రిస్తే  విద్య, పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన ప్రబల చింత, ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన హాని, మృత్యువు, ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించినచో ధనము, ఆయువు ప్రాప్తిస్తుందట.

8. పగటిపూట ఎపుడు కూడా నిద్రించవద్దు. కానీ జ్యేష్ఠ మాసం లో  1 ముహూర్తం (48నిమిషాలు) నిద్రిస్తారు. (పగటిపూట నిద్ర రోగహేతువు, మరియు ఆయుక్షీణత  కలుగచేస్తుందట.

9. బ్రహ్మా వైవర్త పురాణం ప్రకారం మిట్ట మద్యాహ్నం, సూర్యోదయము మరియు సూర్యాస్తమయం టైం లో అసలు పడుకొద్దు. అలా పడుకోవడం వల్ల వారు రోగి మరియు దరిద్రులు గా  అవుతారట.

10. సూర్యుడు అస్తమించిన తరువాత సుమారు మూడు 2-3 గంటల తరువాతనే పడుకోవాలి.

11. ఎడమవైపు పడుకోవడం వలనఆరోగ్య స్వస్థత లభిస్తుంది.

12. దక్షిణ దిశలో పాదములు పెట్టి ఎపుడు నిద్రించకూడదు. యముడు మరియు దుష్ట గ్రహముల  నివాసము వుంటారు. దక్షిణ దిశ వైపు కాళ్ళు చాపి  పడుకోవడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. మెదడుకు రక్త సరఫరా మందగిస్తుంది. మతిమరుపు మృత్యువు లేదా అసంఖ్యాకమైన రోగాలు చుట్టుముడుతాయి.

13. పడుకున్నపుడు చాతి పైన రెండు చేతులు వేసుకుని, ఒక కాలుపై ఇంకో  కాలు వేసుకుని నిద్రపోరాదు.

14. మంచం పైన కుర్చుని త్రాగడం- తినడం చేయకూడదు.

15. పడుకొని పుస్తకాలు చదువ కూడదు. అలా చేస్తే కళ్ళకి సంబందించిన రోగాలు త్వరగా రావచ్చునట.

16. ఈ సూత్రం ఆడవాళ్ళకి వర్తించదు. మగవాళ్ళు నుదుటన బొట్టు లేదా తిలకం పెట్టుకుని నిద్ర పోరాదట. అలా పడుకుంటే అశుభం జరుగుతుందట కావున పడుకొనే ముందు బొట్టు ఉంటె తీసివేసి పడుకోవాలి.

        ఈ నియమాలను మీరు పాటిస్తారని ఆశిస్తాను. 

    మీకు ఈ STORY నచ్చితే మా బ్లాగ్ FOLLOW చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీరు మన YouTube ఛానల్ కి మొదటి సారి వస్తే SUBSCRIBE చేయండి.

    మీ సహకారమే మాకు కొండంత ఎంకరేజ్మెంట్. 

    మరొక్క స్టొరీ మరోసారి మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.


No comments: