Sleep Experiment
Explained by Luckey Mudiraj
ఫ్రెండ్స్ ఏదైనా ఒక కొత్త విషయం పై పరిశోధన చేసినపుడు దాని రిజల్ట్ పాజిటివ్ గానూ, నేగేటివ్ గానూ వస్తుంది. పోజిటివ్ గా వస్తే నో ప్రోబ్లం. కానీ వేగేటివ్ గ వస్తే మాత్రం దాని పర్యవసానాన్నిఎదుర్కోవడం మహా కష్టం. ఒక్కో సారి ప్రాణాలను కూడా పణంగా పెట్టాల్సి వస్తుంది. మాములుమనుషులు కూడా రాక్షసులుగా మారిపోతూ ఉంటారు. వారి మాంసాన్ని వారె తినే రాక్షసులుగామారిపోయారు. ఈ భయంకరమైన సంఘటన రషియలో 1940 లో జరిగింది.
అప్పటి మిలటరీ ఆర్మీ అక్కడి సైంటిస్ట్ లను ఒక కోరిక కోరింది. అదేమిటంటే ... శత్రు దేశాలు చాలా మట్టుకు రాత్రి పుటనే అట్టాక్ చేస్తుంటారు. అందుకని ఆర్మీ జవాన్లకు రాత్రి పుట నిద్ర రాకుండా ఉండడానికి ఏదైనా మెడిసిన్ ని కనుగోనుమన్నారు . సైంటిస్ట్లు అ పనిలో నిమగ్నమై పోయారు.
కాని వాళ్ళకు అపుడు తెలియదు వాళ్ళు చేయబోయే అ పరిశోధన వాళ్ళ ప్రాణాలకే కాదు మిగితా మనుషులను సైతం రాక్షసులుగా మార్చివేస్తుందని.
పరిశోధన
మొదలైంది. దాని పేరు Sleep Experiment. అతికొద్ది రోజుల్లోనే పరిశోధన పూర్తి
అయింది. ఆక్సిజన్ వాయువు బదులు ఒక గ్యాస్ ని తయారు చేసారు సైంటిస్ట్లు. ఆ గ్యాస్
మనుషులు పీల్చుతున్నన్ని రోజులు వారికి
నిద్ర రాదు. ఆక్టివ్ గాను ఉంటారు. అయితే ఈ గ్యాస్ ని డైరెక్ట్ గా ఆర్మీ
జవాన్ల మీద ఉపయోగించే ముందు మాములు మనుషులకి ఇచ్చి చూడాలని నిర్ణయించారు. అయితే
మాములు మనుషులు ఎవరు ఈ పరిశోధనకి ఒప్పుకోక పోవడంతో రషియ జైలు లో ఉన్న జీవిత
ఖైదీలను సంప్రదించారు సైంటిస్ట్ లు. నెలరోజులు తాము చెప్పినట్లు ఒక చాంబర్ లో ఉండి
తమ పరిశోధనకి సహకరిస్తే వాళ్ళని జైలు లోంచి విడుదల చేస్తామన్నారు. అందుకు ఐదుగురు జీవిత
ఖైదీలు ఒప్పుకున్నారు. ఇంకేమిటి ఆ
భయంకరమైన Sleep Experiment స్టార్ట్
అయింది.
గాలి దూరని ఒక
చాంబర్ లో అ ఐదుగురు ఖైదీలను ఉంచారు. వాళ్ళకి కావాల్సిన భోజనం, నీళ్ళు, ఎంటర్టైన్మెంట్ కోసం కొన్ని
పత్రికలు అ చాంబర్ లో పెట్టారు. అ తరువాత సైంటిస్ట్ లు తాయారు చేసిన గ్యాస్ ని
అందులోకి వదిలారు. వన్ వే సి త్రు గ్లాస్ లోంచి వాళ్ళని గమనించ సాగారు సైంటిస్ట్
లు.
ఒకటి రెండు
మూడు .... వారం రోజులు గడిచిపోయాయి. అంతవరకు ఒకరితో ఒకరు మంచిగా మాట్లాడుకుంటూ,
ఆడుతూ, పడుతూ ఉన్న
ఖైదీల ప్రవర్తనలో మార్పు రాసాగింది. ఒకరితో ఒకరు మాట్లాడటం మానేశారు. వారిలో వారే
మాట్లడుకోసాగరు.
11 రోజులు గడిచాయి. ఒక ఖైది అరవడం మొదలు
పెట్టాడు. అరుస్తూనే ఉన్నాడు. దాదాపు 3 గంటలపాటు nonstop గా అరుస్తూనే ఉన్నాడు. అతని అరుపులకు
మిగితా నలుగురు ఖైదీలు తమకేమి సంబంధం లేనట్లు ఉండిపోయారు. కాసేపటి తరువాత అ
అరుస్తున్న ఖైది స్వరపేటిక పగిలిపోయింది.
అంతవరకు తమ ఎక్స్పరిమెంట్ సక్సస్ దిశలో
ఉందని సంబురపడుతున్న సైంటిస్ట్ లు నివ్వేరబోయారు.
అక్కడ ఎం జరుగుతుందో అర్ధం కాక జుట్టుపిక్కో సాగారు.
దాదాపు
15రోజుల తరువాత ఆ చాంబర్ లోకి గ్యాస్ పంపించడం ఆపేసి లోపలికి వెళ్లి చూసారు సైంటిస్ట్ లు. అక్కడి దృశ్యం చూసి భయం తో వణికిపోయారు వాళ్ళు.
ఖైదీలు తమ శరీరాన్ని తామే కొరుక్కు తింటూ కనిపించరు. అ చాంబర్ లో ఎక్కడ పడితే
అక్కడ రక్తం, మాంసం
ముద్దలు పడి ఉన్నాయి. అందరు ఎముకల గుడులా తాయారు ఐయారు. వాళ్ళు మనుషుల్ల కాదు
రాక్షసుల్లా మారి పోయారు.
హుటాహుటిన
వాళ్ళని హాస్పిటల్ కి తరలించారు సైంటిస్ట్ లు . కాని హాస్పిటల్ కి రాము ఇక్కడే ఉంటాము అంటూ మొండికేసారు ఆ ఖైదీలు.
ఎం చేయాలో ఆ సైంటిస్ట్ లకు పాలుపోలేదు. బలవంతంగా వాళ్ళని హాస్పిటల్ కి
తీసుకెళ్ళారు. డాక్టర్స్ ఆ ఖైదీలకు మత్తు ఇంజక్షన్ లు ఇచ్చారు. మాములు మనిషికి
ఒక్క ఇంజక్షన్ ఇస్తేనే దాదాపు 10 ఘంటల పాటు నిద్రపోతాడు. కాని వీళ్ళకి మాత్రం 7 – 8 ఇంజక్షన్ లు ఇచ్చిన మత్తు ఎక్కడం
లేదు, స్పృహ కోల్పోవడం లేదు. వాళ్ళు అలాగే స్పృహ లో ఉండగానే వాళ్ళ కి అయిన గాయాలకి
ఆపరేషన్ చేయడం ప్రారంభించారు డాక్టర్స్. ఆ ఖైదీల ప్రవర్తనలకి డాక్టర్స్ కూడా
ఆశ్చర్యపోయారు. ఖైదీల శరీరాలకి చికిత్స్ చేసారు కాని వాళ్ళ మానసిక స్థితికి చికిత్స
చేయలేక పోయారు డాక్టర్స్.
Sleep Experiment ఇంతటితో
ఆపేస్తున్నట్లు ప్రకటించారు సైంటిస్ట్. అందుకు రషియన్ ఆర్మీ ససేమిరా ఒప్పుకో
లేదు. ఖైదీలు ఈ ఎక్స్పరిమెంట్ కి పనికి
రాకపోతే మిరే ఆ చాంబర్ లోకి వెళ్లి ఎక్స్పరిమెంట్ ని సక్సెస్ చేయమని ఆదేశించారు.
అందుకు ఆ సైంటిస్ట్
భయపడిపోయాడు. చేసెది ఏమిలేక తన గన్ తో ఆ
ఆర్మీ చీఫ్ ని షూట్ చేసేసాడు. ఆ తరువాత రాక్షసులు గా మారిపోయిన ఖైదీలను కూడా చంపేసి
తనను తాను షూట్ చేసుకున్నాడు. అంతటితో ఈ భయంకరమైన Sleep Experiment కథ
ముగిసిపోయింది. ప్రకృతికి విరుద్దంగా ఏది చేసిన సక్సెస్ కాదు అని మరోసారి
రుజువైంది.
కాని ఇంతవరకు
అంతు చిక్కని విషయం ఏమిటంటే...? ఈ ఎక్స్పరిమెంట్ కి సంబందించిన వారు అందరు
చనిపోయారు. మరి ఈ కథ బయటికి ఎలా వచ్చింది.
మీ
అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలుపండి. మీరు మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లు
అయితే సబ్స్క్రయిబ్ చేసి గంట సింబల్ నొక్కడం మర్చిపోవద్దు.
ఈ విడియో మీకు చనినట్లు అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బందువులకు షేర్ చేయండి. Thank you
Urs Luckey Mudiraj.






No comments:
Post a Comment