భర్తలో లవేరియా లక్షణాలు
Husband falling in Love
ఎస్ మీరు విన్నది నిజమే. పెళ్లి ఐయాక, పిల్లలు పుట్టక, సగం జీవితం చవి చూశాక కూడా మొగవాళ్ళు ప్రేమ లో పడుతుంటారు. అది పక్కింటి ఆవిడతో అయి ఉండవచ్చు, లేదా ఆఫీసు లో కొలీగ్ కావచ్చు. లేదా ఈ మద్య సోషల్ మీడియా లో కూడా చాలానే ప్రేమ వ్యవహారాలు జరుగుతున్నాయి. ఇది అందరి విషయం లో కాదు సుమా. కొందరి విషయం లో ఇలా జరుగుతు ఊ౦టుంది. ఈ మద్య మనం వార్త పత్రికల్లో కూడా ఇలాంటివి వార్తలు చాలా చదువు తున్నాము .
ప్రియురాలి మోజులో
పడి భార్యని పట్టించుకోవడం మానేసిన భర్త.
భర్త ప్రియురాలిని పట్టుకుని ఉతికేసిన భార్య.
భార్యకి తెలియకుండా సెకండ్ సెటప్ పెట్టుకున్న భర్త.
న్యూస్ పేపర్స్ కాకుండా కొన్ని tv ఛానెల్స్ లో కూడా ఈ టాపిక్ పైన programs నిర్వహిస్తున్నారు. బతుకు జట్కా బండి, సంసారం ఒక చదరంగం వగెరా వగెరా..
ఇపుడు మీకు ఒక డౌట్
రావచ్చు.
మీ భర్తలో కూడా లవేరియా
లక్షణాలు ఉన్నాయా లేవా అని.
అవును కదా..? తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది కాదు. నో ప్రాబ్లం .. . మీ డౌట్స్ నీ మా డౌట్స్ గా భావించి కొందరి పైన సర్వే చేశాము. కొన్ని జరనల్స్ కూడా సెర్చ్ చేశాము. వాటి సారాంశం లోనీ కొన్ని ముక్య విషయాలు మీకు చెబుతాను వినండి.
1. ముందుగా ఒక విషయం గమనించండి. మీ భర్త
ఇంతకు ముందు ఎలా రెడీ అయ్యేవాడు, ఇపుడు ఎలా రెడీ అవుతున్నాడో చూడండి.
2. కొత్త కొత్త
డ్రెస్ లు వేసుకుంటూ, పౌడరు క్రీమ్ లు రాసుకుంటూ, టిప్ టాప్ గా రెడీ అయి
బయటికి వెళుతున్నాడు అంటే తప్పకుండా మీ ఆయనలో
లవేరియా లక్షణాలు వచ్చినట్లే .
3. బయటి నుంచి వచ్చిన మీ భర్త మీతో, పిలలతో చక్కగా మాట్లాడేది ముందు కానీ, ఇపుడు ఇంటికి
రాగానే పిల్లలపై చిరాకు పడుతూ, మీ పై కస్సుబుస్సు అంటున్నాడు అంటే డౌట్ లేదు మీ
వారు తప్పకుండా లవేరికి ఎఫెక్ట్ ఐనట్లే.
4. సాయంత్రం లేట్ గా ఇంటికి రావడం, ఒక్కోసారి అసలు ఇంటికే
రాకపోవడం ఇది ఇంకో స్త్రీ వలలో పడిన లక్షణమే.
5. క్యాంప్ ఉందని, లేదా ఫ్రెండ్స్ తో పిక్నిక్ వెల్లుతున్న
అని 3 - 4 రోజులు బయటికి మీ వారు వెల్లుతున్నాడు అంటే నో ప్రోబ్లం , కానీ అక్కడి
ఉంచి ఎలాంటి పిక్స్ మీకు పంపలేదు అంటే తప్పకుండా అదే అని అర్దం.
6. పిక్నిక్ నుంచి వచ్చాక టూత్ బ్రష్ కానీ బట్టలు కానీ మారిపోతే మీ భర్త క్యాంప్ కి వెల్ల లేదని
ఇంకో స్త్రీ తో వెళ్లాడాని తెలుసుకోండి.
7. ఆఫీసు నుంచి లేదా బిజినెస్ నుంచి ఇంటికి వచ్చాక మీ ఆయన
షర్ట్ ముందు వెనకాల చెక్ చేయండి. షర్ట్ కి ముందు బట్టన్స్ పైన పొడువైన వెంట్రుకలు,
షర్ట్ వెనకాల వీపు మీద కుంకుమ బొట్టు లేదా లిప్స్టిక్ మరకలు ఉన్నాయంటే తపకుండా మీ
హస్బండ్ లవ్ లో పడ్డట్లే.
8. మీవారు ఏలాంటి తప్పు చేయకున్నా, మీకు ప్రతి సారి SORRY చెబుతున్నాడు అంటే దాని అర్దం అయన చేస్తున్న తప్పులనీ కప్పి పుచ్చుకోడానికే అని అర్దం
చేసుకోండి.
9. మీ వారు కొత్తగా తన మొబైలు కి లాక్ వేసుకున్నాడు అంటే
ఆయన గారి చాట్ హిస్టరీ మీరు చూడొద్దు అని, అందులో మీరు చూడకూడానిది ఏదో ఉందని అర్దం.
10. ఇంతకు ముందు హుషారుగా ఉండి, ఇపుడు తరుచూ మూడ్ లేదు అని
మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నాడు అంటే మీరు ఆయనకి బోర్ కొడుతున్నారు అని అర్దం, ఏదో
కొత్తకి అలవాటు పడినట్లు అని అర్దం చేసుకోండి.
చివరిగా నేను చెప్పేది ఏమిటంటే..? ఈ లక్షణాలు మీ వారి లో ఉండవచ్చు ఉండకపోవచ్చు..
. కానీ నాకు మాత్రం ఎలాంటి సంబందం లేదు. ఈ వీడియొ కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం
మాత్రమే చేయడం జరిగిందని తెలుసుకోండి.
ఇలాంటి లక్షణాలు ఏ భర్తలో ఉండొద్దు అని మనస్పూర్తిగా
కోరుకుంటూ ...






No comments:
Post a Comment