Six Pack Lady || Hyderabadi Women Champion
Kiran Dembla Review
మహిళ అంటే సుకుమారమైన శరీరంతో, ముట్టుకుంటే కందిపోతుందనే భావన కలుగుతుంది. ఆకు చాటు పిందేలా, వంటింటి కుందేలులా, భర్త, పిల్లలు, ఇళ్ళు, సంసారం, బరువు భాధ్యతలు ... మన దేశం లో ఈవే గుర్తుకువస్తాయి
ఎస్ ... కాని మన దేశం లో, మన రాష్రం లో, మన హైదరాబాద్ లో ఉన్న ఒక మహిళ తను ఇవేమే కాదు అని నిరూపించుకుంది. దృడమైన శరీరం తో మగవాళ్ళకి ఎ మాత్రం తగ్గకుండా సిక్స్ పాక్ బాడీ తో ఇంటర్నేషనల్ బాడీ బిల్డర్
ఛాంపియన్ గా ఎదిగి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆమె ఎవరో కాదు. కిరణ్ డెబ్ల
ఆగ్రకి చెందిన కిరణ్ దేమ్బలా పెళ్ళికి ముందు అందరు స్త్రీల లాగే ముద్దుగా బొద్దుగా ఉండేది. అందరు ఆడపిల్లలానే చక్కగా పెళ్లి చేసుకుంది. భర్త తో పాటు ముందు ముంబాయి, అ తరువాత హైదరాబాద్ వచ్చి కాపురం పెట్టింది. ఆమె భర్త ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. కిరణ్ కి ఇద్దరు
పిల్లలు. ఒక పాపా ఒక బాబు. వాళ్ళ అలనపలనలో ఆమె వయసు 35 దాటిపోయింది.
2006 లో అనుకోకుండా ఆమెకి మెదడులో రక్తం గడ్డ కట్టింది. ఆపరేషన్ జరిగింది. దాదాపు రెండు సం.రాలు బెడ్ రెస్ట్ లో ఉంది. రెండో కాన్పు తరువాత, బెడ్ రెస్ట్ మందులు రేగులర్గా తీసుకోవడం వళ్ళ కిరణ్ బరువు దాదాపు 74 కిలోలు పెరిగిపోయింది. ఓవర్ వెయిట్ సమస్య ఆమెని కలచి వేయసాగింది.
స్త్రీ జీవితం అంటే ఇంతేనా...? రోజు నిద్ర లేవడం, భోజనం వండడం, తినడం, భర్తా పిల్లలను చూసుకోవడం. మళ్ళి పడుకోవడం. జీవితం అంటే ఇది కాదు. ఏదోకటి చేయాలి. తనకు తాను ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. అంటూ తరచు ఆలోచించేది కిరణ్ దేమ్బ్ల .
ముందుగ ఆమె సంగీతం నేర్చుకోవడం మొదలు పెట్టింది. అ తరువాత తన ఇంటి ముందు ఉన్న ఒక స్విమింగ్ పూల్ లో స్విమ్మింగ్ నేర్చుకుంది. తరువాత యోగ కూడా నేర్చుకుంది. ఇవన్ని సాదన చేస్తూనే ఇంటి పనులు, పిల్లల పాలనా చూసుకునేది. అయినా ఆమెకి త్రుప్తి కలుగలేదు.
ఒక రోజు జిమ్ కి వెళ్ళింది కిరణ్ దేమ్బ్ ల. తన లైఫ్ లో జిమ్ చూడడం అదే మొదటి సారి. ఆమెని జిమ్ లోని పరికరాలు ఎంతగానో ఆకర్చించాయి. తను కూడా జిమ్ చేయాలనీ, జిమ్ ట్రైనర్ అవ్వాలని నిర్ణయించుకుంది.
ఆమె దృడ నిశ్చయం ఆమెని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్ళింది. కిరణ్ డెబ్ల మన hyderabad లో మొట్టమొదటి మహిళా బాడీ
బిల్డర్ గా మారిపోయింది. ఆమె కృషి ఆమెని ఇంటర్నేషనల్ ఛాంపియన్ గా నిల్చోపెట్టింది.
ఇపుడు ఆమె మన హైదరాబాద్ కే కాదు మన దేశానికే
ఒక ఐకాన్.
కిరణ్ డెబ్ల 2013 లో వరల్డ్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్నాక ఒక చిన్న జిమ్ స్టార్ట్ చేసింది. తన బాడీ ని సిక్స్ ప్యాక్ చేసుకోవడం తోపాటు ఇతరులకు కూడా ఫిట్నెస్ టెక్ నిక్స్ చెప్పడం ప్రారంబించింది.
ముందుగా రామ్ చరణ్ భార్య ఉపసనకి కిరణ్ ఫిట్నెస్
ట్రైనింగ్ ఇచ్చింది. అ తరువాత వరుసగా తమన్నా తాప్సి ప్రకాష్ రాజ్ రాజ మౌళి
ప్రభాస్ అనుష్క తమిళ హీరోలు సూర్య అజీత్ ఇలా ఎంతో మంది సెలిబ్రితటిలకి ఫిజికల్ ఫిట్నెస్
ట్రైనింగ్ ఇచ్చింది కిరణ్ దేమ్ల.
అపుడు ఆమె వయసు 42. బాడీ బిల్డర్ ఛాంపియన్షిప్ వాచ్చక ఇంకా ఎదో చేయాలనీ తపన. ఆ తపన ఆమెలో అనగరిపోయిన మ్యూజిక్ కి ప్రాణం పోసింది. వోకల్ మూజిక్, క్లాసికల్ మూజిక్ అంతకు ముందే నేర్చుకున్న కిరణ్ ఇప్పటి వాతావరణానికి అనుగుణంగా DJ నేర్చుకోవాలి అనుకుంది. అందుకు కూడా ఆమెకి ఎన్నో అబ్యంతరాలు వచ్చాయి. ఒక స్త్రీ, ఇల్లాలు, తల్లి అయి ఉండి DJ నేర్చుకుని క్లబ్లలలో మూజిక్ ప్లే చేస్తావా అంటూ....
అవేమి పట్టించుకో కుండా దాదాపు 4 సం.లో కష్టపడి DJ ప్లేయర్ గా మారిపోయింది కిరణ్. కృషి ఉంటె మనుషులు ఋషులు అవుతారు అనే మాటని మరోసారి నిజం చేసింది కిరణ్.
ఒక సాదారణ మహిళా ప్రతి రంగంలో
అడుగుపెట్టి తన నైపున్యతని దేశానికే కాదు ప్రపంచానికి ఎలా చాటుకుంది
తెలుసుకున్నరుగా. ఆమె చెప్పిన ఒక మాట మన జీవితానికి స్పూర్తిగా మలుచుకుందాము.
అదేమిటంటే..... నేను ఎప్పుడు జీవితంలో ఒక
లక్ష్యాన్ని నిర్దేశిన్చుకుంటాను. ఆ దేవుడి కృప తో సాదిస్తాను.
కిరణ్ దేమ్బ్ల జీవిత చరిత్ర మీకు నచితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విడియోలకోసం మన ఛానల్ మీ సబ్స్క్రయిబ్ చేసుకోండి.

No comments:
Post a Comment