Luckey Entertainments - Telugu Short Stories - Movie Reviews - Short Films - Beauty Tips - Health Tips - Cooking Tips in Telugu. Totally You find here complete Entertainment.

Saturday, August 14, 2021

PAAGAL || పాగల్ || Telugu Movie || Film Explained || Luckey Reviews

పాగల్ సినిమా సమీక్ష

PAAGAL Telugu Movie Explained

Banner: Lucky Media and Sri Venkateswara Creations

Presents: Dil Raju
Movie: PAAGAL
Cast: Vishwak Sen,Nivetha Pethuraj,Simran Choudhary,

Megha Lekha,Rahul Ramakrishna,Murali Sharma
Producer: Bekkem Venu Gopal
D.O.P: S. Manikandan
Music Director: Radhan
Editor: Garry Bh
Duration : 2hr. 18Mints
Story, Screen Play & Direction: Naressh Kuppili


    హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కి ముదిరాజ్. కరోనా తగ్గుమొఖం పట్టక  సినిమా హాల్స్ ఓపెన్ ఐయాయి. మళ్ళి మన టాలీవుడ్ సినిమాల జోరు కూడా మొదలైంది. ఈ వారం మన  హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “పాగల్” రిలీజ్ అయింది. యూత్ ని ఈ చిత్రం ఎంత మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూ లో తెలుసుకుందాం.



.





కథలోకి వచ్చి నట్టయితే మన హీరో విశ్వక్ కి తన తల్లి అంటే ఎంతో ఇష్టం. తల్లి సెంటిమెంట్ ఇక్కడ ఎంతో బాగా పండిందని చెప్పాలి. అతనికి  ఏడేళ్ల వయసు ఉన్నపుడు తల్లి (భూమిక చావ్లా)  కాన్సర్ తో చనిపోతుంది. చివరి క్షణాల్లో తన తల్లి చెప్పిన మాట మాత్రం అతను వయసుకి వచ్చినా మనసులోనే గాడంగా ఉంటుంది. 

"ఎవరినైనా మనం మనస్పూర్తిగా ప్రేమిస్తే వాళ్ళు మనల్ని తిరిగి ప్రేమిస్తారు" అని తన తల్లి చెబుతుంది. తన అమ్మలా ప్రేమించే తోడు కోసం వెతుకుతుంటాడు విశ్వక్. తన తల్లి తనని ఎలా  ప్రేమింస్తుందో అలంటి  అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. 

మన హీరో విశ్వక్ తన స్నేహితుల సలహాతో పదహారు వందల మంది అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తాడు. అందరు అతని ప్రపోజ్ ని తిరస్కరిస్తారు. విసుగు చెందిన విశ్వక్ ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. అప్పటికే నిశ్చితార్థం చేసుకున్న మన హీరొయిన్ నివేత మన హీరో ప్రేమని అక్చప్ట్ చేస్తుంది.  మరి వీరి ప్రమాయణం ఎంత వరకు వెళ్తుంది...? విశ్వక్ కి మళ్ళీ తన తల్లి ప్రేమ నివేత ద్వారా దొరుకుతుందా...>? లేదా...? ఈ విషయాలు అన్ని తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

పాగల్ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే... 

విష్వక నటించిన గత చిత్రాలతో ఈ సినిమా ని పోలిస్తే ఈ చిత్రంలో విశ్వక్ మరింత మెరుగైన నటనతో కనిపించాడు. సినిమా అంతా చాలా ఫ్రెష్ లుక్ లో మంచి ఎనర్జిటిక్ గా సినిమా అంతా విశ్వక్  సేన్ ఒక్కడై నడిపిస్తాడు. ఎమోషన్స్ విషయానికి వస్తే చాలా చక్కగా పండాయి అని చెప్పవచ్చు.  మన హీరోయిన్ నివేతాని  ప్రపోజ్ చేసే సన్నివేశంలో మంచి కెమిస్ట్రీ పండింది అనే చెప్పొచ్చు. ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పడం కోసం విశ్వక్ వైజాగ్ సిటీకి వెళ్లిన సీన్స్ సూపర్బ్. 'గూగుల్ గూగుల్' మరియు 'ఈ సింపుల్ చిన్నోడ' అనే పాటలు సినిమాకే హై లైట్. ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి కూడా. హీరోయిన్ నివేత పేతురాజ్ తీర పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. తెర మిద  చాలా తక్కువ సమయం కనిపించిన మంచి పెర్ఫార్మెన్స్ చేసిందనే చెప్పాలి.


    


ఇక పోతే మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే.... సెకండాఫ్ లో సినిమా లో చాలా సీన్స్ లాజిక్స్ లేకపోవడం తో బోర్ గా అనిపిస్తాయి. వాటి మూలాన సినిమా కాస్త డల్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ తో పోల్చి చూస్తే సెకండాఫ్ అంత బాగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదనే అనిపించింది. అక్కడక్కడ బోర్ కొడుతుంది.





సో ఫ్రెండ్స్ మన ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయం  కామెంట్ బాక్స్ లో తెలుప గలరు. ఈ వీడియో మీకు నచితే మీ ఫ్రెండ్స్ కి, రేలతివ్స్ కి  షేర్ చేయండి. మరొక రివ్యూ  తో మరో సారి మీ ముందుకు వస్తాను. అంత వరకు సెలవ్... 


No comments: