Luckey Entertainments - Telugu Short Stories - Movie Reviews - Short Films - Beauty Tips - Health Tips - Cooking Tips in Telugu. Totally You find here complete Entertainment.

Thursday, September 16, 2021

29 Loves 49 | నా సమస్యకి పరిష్కారం చెప్పండి || Luckey Short Stories

 నాకు 29 - అతనికి  49

29 Loves 49

నా సమస్యకి పరిష్కారం చెప్పండి

     29 loves 49. ఎస్ మా ఇద్దరి వయసులకి తేడా 20 సం. అతనంటే నాకు పిచ్చి ప్రేమ. అతను లేకుండా నేను ఉండలేని స్థితికి వెళ్ళాను. నా సమస్యకి పరిష్కారం చెప్పండి.

నాది సమస్యనా లేక నా మానసిక స్థితి ప్రాబ్లమా ఏమి  అర్థం కాని స్థితిలో నేనున్నాను. నా పేరు మాధవి. వయస్సు 29 సం. ఇంకా పెళ్లి అవ్వలేదు. ఒకసారి లవ్ లో బ్రేకప్ అయ్యింది. ఒక ఆఫీస్ లో ఉద్యోగం చేస్తున్నాను. నాకు తల్లి తండ్రి అక్క ఉన్నారు. అక్కకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. మాది  చాలా లోక్లాస్ ఫ్యామిలీ. నేను అక్క ఉద్యోగం చేస్తేగానీ గడవని కుటుంబ  పరిస్థితి మాది.

మా నాన్న ఒక చిన్న వ్యాపారం చేసేవాడు. అమ్మ ఇంట్లోనే ఉండేది.  మా నాన్న ఒక్కడి  జీతంతో మా ఇద్దరు అక్కాచెల్లెళ్ల చదువులు పోషణ సరిపోయింది. ఇంత వరకు వెనకేసుకున్నది ఏమీ లేదు. ప్రస్తుతం నాన్న ఖాలిగా ఉన్నారు.

ఇకపోతే మా పెళ్లి విషయాలకి వస్తే. మాకు నచ్చిన వాళ్ళు కట్నాలు ఎక్కువ అదిగే వాళ్ళు. నచ్చని వాళ్ళు నచ్చకుండా నే పోయేవాళ్ళు. మా ప్రాబ్లం ఏందో మాకే అర్థం కావడం లేదు. ఈ విషయం పక్కన పెడితే, రీసెంట్ గా మా ఆఫీస్ లో చేరిన ఒక  అతను నన్ను ఎంతగానో ఆకర్చించాడు. అతని పేరు నారాయణ మూర్తి, ఏజ్ 49 సం.  అంటే అతను  నా కన్నా 20 ఏళ్లు పెద్ద అతను.

అతను చాలా చక్కగా ఈజీగా సాల్వ్ చేస్తాడు. అలాగే ఏ పని విషయంలో అయినా  ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అతను ఆదరకుండా బెదరకుండా సొల్యూషన్ ని వివరించి చెబుతాడు. ఎవరు ఎ పని చేయకపోయినా తను ఉన్నానంటూ ముందుకు వచ్చి  ఆ పనిని టైం ప్రకారం ఫినిష్ చేస్తాడు.

    
    అతను చాలా అంటే చాలా మంచోడు. ఏ ప్రాబ్లం ఎవరికి వచ్చినా నేనున్నాను అంటూ చక్ఆకగా సాల్వ్ చేస్తాడు ఆ  ప్రాబ్లంని.  అది డబ్బు పరంగా అయినా  లేదా కుటుంబ కలహాలు అయినా  లేదా ఆఫీస్ లో ఒకరికి ఒకరికి మధ్యన వచ్చే ప్రాబ్లమ్స్, అది ఏ ప్రాబ్లం అయినా పర్వాలేదు. 




    అతని క్యారెక్టర్ కి నేను పడిపోయాను. నా పర్సనల్ విషయాలని కూడా అతనితో పంచుకునే దాన్ని.  నాకు తెలియని విషయాలు తెలిసిన విషయాలు తెలుసుకోవాల్సిన  విషయాలు ఏది అడిగినా చాలా చక్కగా వివరించి చెబుతాడు.  నాకు టైం దొరికినప్పుడల్లా అతనితో కూర్చోవడం, అతనితో కబుర్లు చెప్పడం,  ఆఫీస్ అయిపోయాక అతనితో కలువదం, ఫోన్ చేసి కూడా మాట్లాడడం మొదలు పెట్టాను.

     ప్రాబ్లమ్స్ అంటే పర్సనల్, ఆఫీసు, ప్యామిలీ, ఇలా అన్ని  ప్రాబ్లమ్స్ కూడా అతనితో డిస్కస్ చేయడం మొదలుపెట్టాను. ఏ విషయం అయినా  అతను చాలా చక్కగా వివరించి చెప్పేవాడు. అతను మా  ఆఫీసులో సహా ఉద్యోగి  అనే విషయం కూడా మర్చిపోయాను. అతను వేరే నేను వేరే అనే భావన కూడా  లేకుండా పోయింది నా మనసులో.  అతను నేను ఒకటే అన్నంత భావన నాలో నరనరాన  నాటుకుపోయింది. నా మనసులో అతన్నే భర్తగా పూజించడం  మొదలుపెట్టాను.

   

  అతనికి పెళ్లి అయింది ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయినా సరే అతనికి రెండో భార్యగా  కూడా వెళ్లడానికి రెడీ అయిపోయాను. ఈ విషయమే అతనితో చెప్పాను కూడా. కానీ అతను చాలా సుతిమెత్తగా మందలించాడు. అలా ఊహించుకోవడం తప్పు అన్నాడు. తనే  నేను నచ్చిన అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను అని కూడా చెప్పాడు.


     నీ పెళ్లి అయ్యేంత వరకు మనం ఇలాగే ఒక మంచి  ఫ్రెండ్ గా ఉందామని కూడా చెప్పాడు.  అలా ఫ్రెండ్ గా ఉండడం నాకు ఇష్టం లేదు. అదే విషయాన్ని  అతనికి చెప్పేసాను. ఇలా మానసికంగా అతనితో కలిసి పోవడం నా మనసుకి  తెలియకుండానే జరిగిపోయింది. శారీరకంగా అతనితో కలిసి పోవాలనే నా కోరిక రోజు రోజుకి పెరుగుతూ పోతోంది, ఈ విషయంలో నేను ఏం చేయాలో, ఎం చేయకుడదో  అర్ధం కాని పరిస్థితిలో కి వెళ్ళిపోయాను,

    నా ఈ సమస్యకి మీరు మీకు తోచిన ఒక  మార్గాన్ని తెలుపండి. నాలాంటి ఎందరో అబాగ్యులకు మీరు మార్గదర్శకులు అవుతారు అని నా అభిప్రాయం.

ఇలాంటి ఏదైనా పర్సనల్ ప్రాబ్లం మీకు ఉంటె, మీ వాయిస్ తో మీ సమస్యని  రికార్డ్ చేసి లేదా మెయిల్ లో రాసి మాకు పంపించండి. మీ సమస్యని మా సమస్యగా భావించి ప్రేక్షకుల తెలుపుదాము. ఎవరో ఒకరు మీ సమస్యకి మంచి సలహా చెప్పకపోరు. ఆ సలహా పాటించి మీ జీవితాన్ని సుఖమయంగా  కొనసాగిస్తారని ఆశిస్తున్నా.

మరొక్క సమస్యతో మరోసారి మీ ముందుకు వస్తాను అంతవరకు సేలవ్.

No comments: