Luckey Entertainments - Telugu Short Stories - Movie Reviews - Short Films - Beauty Tips - Health Tips - Cooking Tips in Telugu. Totally You find here complete Entertainment.

Wednesday, August 18, 2021

అతనంటే ఏ ఫీలింగ్ లేదు || I have No Feelings || నా సమస్యకి పరిష్కారం చెప్...

I have No Feelings about Him

అతనంటే ఏ ఫీలింగ్ లేదు

లక్కి షార్ట్ స్టోరీస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం.

 ఈ రోజు మనము విజయవాడ నివాసి అయిన పద్మావతి సమస్యని ఆమె మాటల్లోనే  తెలుసుకుందాం. వీలైనంత వరకు తన సమస్యకి  పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్దాము. ఆమె పపించిన మెయిల్ చదువుతాను.



నా పేరు పద్మావతి. వయసు 25సం. ఉండేది విజయవాడ. డిగ్రి అయిపోయాక జాబులో  చేరాను. మా ఆఫీస్ లోనే ఒక అబ్బాయితో పరిచయం  అయింది. 

ఆ అబ్బాయి ఎవరో కాదు. నా ఇంటర్ క్లాసుమేట్. కాలేజ్ లో అంతగా మాట్లాడింది లేదు. అసలు నేను ఏ అబ్బాయితోను ఎప్పుడు చనువుగా మాట్లాడలేదు. కాని ఆ అబ్బాయి క్లాస్మేట్  కావడం వల్ల ప్లస్ నా కొలీగ్ అవ్వడం వల్ల అతనితో సన్నిహితంగా ఉండడం మెదలేట్టాను


 ఒక విధంగా చెప్పాలంటే పాతికేళ్ళ వయసులో అ మాత్రం అబ్బాయిల పైన అట్రాక్షన్ ఉంటుంది అని అనుకున్న. ప్రతి రోజు ఆఫీస్ తర్వాత అలా అలా బయట తిరుగుతూ, హోటల్ కి వెళ్లి  ఇంటికి వెళ్ళే వాళ్ళము. వీక్ ఆఫ్ లో కూడా లాంగ్ డ్రైవ్ కి సినిమాలకి, షికారుకి  వెళ్ళే వాళ్ళము.


ఒకరోజు ఆ అబ్బాయి పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. అంత వరకు నేనెప్పుడు పెళ్లి గూర్చి అసలు అలోచించనే లేదు. సడన్ గా ఎం చెప్పాలో తెలియక "నాకు కాస్త సమయం కావాలి" అన్నాను. అతను కూడా సరే అన్నాడు. 

బాగా ఆలోచించుకుని, ఇంట్లో వాళ్ళని సంప్రదించి చెప్పమన్నాడు. అతను మాత్రం తన ఇంట్లో వాళ్ళకి చెప్పేసాను, వాళ్ళు కూడా మన పెళ్లి కి ఒప్పుకున్నారు అన్నాడు.

ఇపుడు నా సమస్య ఏమిటంటే....? ఆ అబ్బాయితో ఇన్ని రోజులు తిరిగిన నాకు ఎపుడు ఎలాంటి ఎక్సైట్మెంట్ అన్పించ లేదు. అసలు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, అతని తో జీవితాంతం కలిసి ఉండాలి అని ఎపుడు ఉహించుకో లేదు నేను. అతని పక్కన కుర్చున్న, అతనితో కలిసి తిరిగిన నాకు ఎపుడు ఎలాంటి ఏ  ఫీలింగ్ కలగలేదు. ఇపుడు నేనేఁ  చేయాలో, అతనికి ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు. ఈ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో మిరే చెప్పండి.

 ఈ సమస్యకి మీకు తోచిన ఒక చక్కకటి సరిష్కారం కామెంట్ బాక్స్ లో చెప్పగలరు.   చాలా మందికి మీరు మార్గ దర్శకులు అవుతారు. ఇలాంటి సమస్యతో మీరు  సతమతం అవుతున్న మాకు తెలుపండి. మీ సమస్యని మన website లో ఉంచుదాము.

ఇలాంటి సమస్యలు మీకు ఉంటె మీ వాయిస్ తో రికార్డ్ చేసి లేదా కాగితం పై  చక్కగా రాసి మా ఛానల్ మెయిల్ కి పంపించండి.  ఎవరో ఒకరు మీ సమస్యకి మంచి సలహా చెప్పకపోరు. ఆ సలహా పాటించి మీరు మీ జీవితాన్ని సంతోషంగా జీవిస్తారని ఆశిస్తున్నా.

మరొక్క సమస్యతో మరోసారి మీ ముందుకు ఒక పరిష్కారం కోసం వస్తాను అంతవరకు సేలవ్.

మీలక్కి ముదిరాజ్.


No comments: