Luckey Entertainments - Telugu Short Stories - Movie Reviews - Short Films - Beauty Tips - Health Tips - Cooking Tips in Telugu. Totally You find here complete Entertainment.

Wednesday, July 21, 2021

Narappa full Movie Review || నారప్ప సినిమా సమీక్ష|| Telugu Movie Reviews...

Narappa full Movie Review

 నారప్ప సినిమా సమీక్ష

Release date : July 20, 2021

Starring : Venkatesh, Priyamani, Karthik Rathnam

Produced by : Kalaippuli S. Thanu; D. Suresh Babu

Music Director : Mani Sharma

Genre : Telugu, Action

duration : 2 Hrs 35 Min

Director : Srikanth Addala


ధనుష్ కి జాతీయ అవార్డు అందించిన చిత్రం అసురన్. అదే చిత్రాన్ని తెలుగులో నారప్ప గా రీమేక్ చేశారు దర్శకులు శ్రీకాంత్ అద్దాల. 

విక్టరి వెంకటేష్ హీరోగా, ప్రియమణి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ott ఈ రొజు విడుదల అయింది. అయితే వెంకటేశ్ నారప్పగా ప్రేక్షకులను ఎంత  మేరకు మెప్పించారో ఓ సారి చూద్దాం. ఈ సినిమా  ని మనం రివ్యూ చేసి చుస్దాము.

 మన హీరో వెంకటేష్ నారప్పగా చాలా సాదా సీదా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అనంతపూర్ లోని రామసాగరం అనే ఒక చిన్న గ్రామం లో తన భార్య ప్రియమణి, ఒక కూతురు, ఇద్దరు కొడుకులతో ప్రశాంతమైన వతరణంలో జీవిస్తూ ఉంటాడు. అదే గ్రామానికి చెందిన పెద్దమనిషి పాండుస్వామి ఆ గ్రామంలోని భూములన్నీ ఆక్రమిస్తు ఉంటాడు. 
    నారప్పకు చెందిన మూడు ఎకరాలు భూమి  తప్ప ఊర్లోని అన్ని పొలాలను ఆక్రమిస్తాడు పాండుసామి. నారప్ప పెద్ద కొడుకు ముని ఖన్నా ఆవేశ పరుడు. అతను మాత్రం తన భూమి పాండుసామికి ఇవ్వను అని ఎదురు తిరుగుతాడు. ఈ నేపద్యంలో ముని ఖన్నాను పాండుసామి చంపేస్తాడు. అయినా కూడా నారప్పలో ఎలాంటి చలనం రాదు. 
    
    పెళ్లి వయసుకు వచ్చిన కొడుకు చనిపోవడాన్ని నారప్ప భార్య జీర్ణించుకో లేక పోతుంది. ప్రతి రోజు  కొడుకుని తలుచుకుంటూ బాధ పడుతుంది. తన తల్లి పడుతున్న బాధని చూడలేక నారప్ప రెండో కుమారుడు సిన్నప్ప పండుస్వామిని చంపేస్తాడు. తన రెండో కొడుకును నారప్ప ఎలా కాపాడుకుంటాడు, నారప్ప చేసే ప్రయత్నాలు ఏంటి? అసలు నారప్ప ఎందుకు తాగుబోతుగామారుతాడు, ఏమీ చేతగాని వాడిలా కొడుకు ముందు నిల్చుంటాడు? నారప్ప గతం ఏంటి? చివరకు నారప్ప తన కొడుకును కాపాడుకున్నాడా? లేదా? అన్నదే ఈ చిత్రం యొక్క ముక్యమైన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఇకపోతే ఈ చిత్రం యొక్క ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే... నారప్పగా వెంకటేష్ అద్భుతంగా నటించారు. ఎమోషనల్ గా సాగే రెండు డిఫరెంట్ వేరియేషన్స్ లో ఉన్న పాత్రల్లో వెంకటేష్ ఎంతో అద్బుతంగా నటించారు. ఇంటర్వెల్ సీక్వెన్స్ లో అలాగే కొన్ని ఎమోషనల్‌ సన్నివేశాల్లో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారుమన వెంకి. 

   అలాగే వెంకటేష్ ప్రతి సిన్లో చెప్పే డైలాగ్స్  ఎంతో భావోద్వేగానికి లోనై చెప్పినట్లు ఫీలింగ్ కలుగుతుంది. మెయిన్ గా తన కొడుకు చనిపోయిన తర్వాత వచ్చే ఎమోషనల్ సీన్ లో వెంకటేష్ ఎంతో అద్బుతంగా నటించారు. ఇంటర్వెల్ తరువాత వచ్లోచే సీన్లో చేత కాని తండ్రి కాస్త, నారప్పగా మారి తన చిన్న కుమారుడుని కాపాడే సిన్స్ లో, మరియు క్లైమాక్స్ లో వెంకటేష్ నారప్ప పాత్రలో అద్బుతంగా జీవించారు అని చెప్పవచ్చు. నారప్ప భార్యగా ప్రియమణి కూడా చాల బాగా నటించి మెప్పించారని చెప్పొచ్చు. నారప్ప కొడుకుగా కార్తీక్ రత్నం, మిగిలిన కీలక పాత్రల్లో నటించిన నాజర్, రావురి రమేష్, రాజీవ్ కనకాల కూడా తమ పాత్రలకు తగ్గట్టు బాగా నటించారు.

మైనస్ పాయింట్స్ :

మరియు ఈ చిత్రం యొక్క మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే నారప్ప పక్కా యాక్షన్ తో సాగే పర్ఫెక్ట్ ఎమోషనల్ డ్రామా అయినప్పటికీ కథనం స్లోగా ఉండటం ఈ సినిమాకి పెద్ద డ్రా బ్యాక్. పైగా కొన్ని సీన్స్ రెగ్యులర్ గా ఉన్న ఫీలింగ్స్ అసలు కలుగవు. ఫస్టాఫ్ లో కొన్ని చోట్ల అయితే రంగస్థలం సినిమాలోని గ్రామంలో ఉన్న కొన్ని సీన్స్ కాపి కొట్టినట్లుగా ఉన్నాయి.


    ఇక ఫ్లాష్ బ్యాక్ బాగున్నా… ప్లాష్ బ్యాక్ లో నాజర్ పక్కన ఉండే విలన్ రోల్ ను ఇంకొంచెం బెటర్ గా చేస్తే బావుండేది. మొత్తం మీదా అసలు ఆ పాత్ర సినిమాటిక్ గా లేదని చెప్పొచ్చు. అలాగే కథనం తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా లేదని చెప్పాల్సి వస్తోంది. ఓవరాల్ గా సినిమాలో కొన్ని చోట్ల సిన్సు  బెటర్ గా ఉండి ఉంటే బాగుండు అని ఫీలింగ్ కలిగినా.. నారప్ప మాత్రం చక్కగా ఆకట్టుకున్నాడు.

విశ్లేషణ

వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ‘అసురన్’ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మన అందరికి తెలిసిందే. చాలా తక్కువ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమాలో హీరోగా నటించిన ధనుష్ కెరీర్‌లో  జాతీయ అవార్డు అందించింది. ఈ మూవీ తెలుగు రీమేకే ‘నారప్ప’. ఒక భాషలో హిట్‌ అయిన చిత్రం. ఇతర భాషలో  రీమేక్ చేయడం సర్వసాధారణం. మూల కథని తీసుకొని మన తెలుగు నేటివిటి  తగ్గట్లు గా మార్చి రీమేక్ చేస్తారు ఈ సినిమాని. 

నారప్ప విషయంలో అలాంటి ప్రయోగాల వైపు వెళ్లలేదు. కాస్టింగ్ మినహా యాక్షన్ ఎపిసోడ్స్, డైలాగ్స్‌తో సహా అసురన్ సినిమా నుంచి అంతా కాపీ పేస్ట్ చేసినట్లే ఉంది. కథలోని పాత్రలను ఏమాత్రం మార్చకుండా ఎమోషన్స్‌ పండించడంలో దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల ఫెయిల్ అయ్యాడు. ఒకప్పుడు నిమ్న మరియు  అగ్ర వర్ణాల మధ్య ఉన్న భేదాలను కళ్లకు కట్టినట్టు ఈ చిత్రంలో  చూపించాడు దర్శకుడు. 

"వాళ్లను ఎదిరించడానికి అది ఒక్కటే దారి కాదు. మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ చదువును ( తెలివిని ) మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు చిన్నప్ప..." అని ఒక సందర్భం లో వెంకటేష్ చెప్పే  డైలాగ్‌ మన  సమాజానికి మంచి సందేశాన్ని కూడా ఇస్తుంది

ఇక సంగీతం విషయానికి వస్తే మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం సూపర్బ్ అని చెప్పవచ్చు, శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.  అసలు అసురన్‌తో పోల్చకుండా ఒక కొత్త కథగా చూస్తే మాత్రం నారప్ప సినిమా  తప్పకుండా తెలుగు ప్రేక్షకులను మెప్పించే సినిమా అని అనొచ్నేచు. అయితే ఓటీటీల పుణ్యమాని అసురన్ మూవీని ప్రేక్షకులు  చాలా ముందే చూడడం వల్ల కాస్త నిరాశ చెందుతారు. సో నారప్పని అసురన్‌తో తప్పకుండా పోల్చి చూస్తారు. అలా కాకుండా మొదటిసారి చూసే ప్రేక్షకులకు  మాత్రం ఈ ‘నారప్ప’ సినిమా పక్కగా  థ్రిల్‌  ఫీల్ ఇస్తుంది అని చెప్పవచ్చు.  


ఫ్రెండ్స్ ఈ రివ్యూ మీకు నచ్చినట్లు అయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మా ఛానల్ సుబ్స్క్రిబ్ చేసి బెల్ సింబోల్ క్లిక్ చేయడం మరిచిపోకండి.

మరొక రివ్యూ తో మరోసారి మీ ముందుకు వస్తాను. అంత వరకు సెలవ్. 


No comments: