Chatur Mukham Movie Explained in Telugu
చతుర్ ముఖం
Title Chatur MukhamDirected
by Ranjeet Kamala Sankar Salil VWritten
by Abhayakumar K Anil KurianProduced
by Jiss Toms, Justin Thomas, Manju
WarrierStarring Manju Warrier, Sunny Wayne, Alencier, Ley
LopezCinematography Abinandhan RamanujamEdited
Manoj
Music
Dawn VincentRelease
date April 8, 2021 in MalayalamRelease
date August, 13 2021 in #Aha in TeluguRunning
time 138 minutesCountry IndiaBudget ₹5.5 crore
చతుర్ముఖ ఆనే మూవీని ఒరిజినల్ గా మలయాళం లాంగ్వేజ్ లో "ఫోర్త్ పేస్" అనే పేరుతో వచ్చింది. ఈ మూవీ ఏప్రిల్ ఎనిమిది రెండు వెయిల ఇరవై ఒకటిలో ధియేటర్ లో రిలీజ్ అయి, జూలై నెలలో Zee5 ఒటిటిలో కూడా స్ట్రీమింగ్ అయింది. చత్తుర్ ముఖం మూవీని తెలుగులో డబ్ చేసి Aha ఒటిటి లో రిలీజ్ చేయడం జరిగింది. చతుర్ముఖ యొక్క కథ కథనం ప్లస్పాయింట్స్ మైనస్పాయింట్స్ ఏమిటో ఇపుడు మనం తెలుసుకుందాము.


ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే Techno Horror అనే కాన్సెప్ట్ తో థ్రిల్లింగ్ గా ప్రతి సన్నివేశాన్ని చిత్రీకరించారు. హారర్ సినిమాలని మన తెలుగు రాష్ట్రాల పెక్ష్కులలో మంచి ఆదరణ ఉంది. ఈ జోనర్ మూవీస్ ఎపుడు చుసిన బోర్ కొట్టదు. ఈ సినిమాలో కొత్త టెక్నాలజీ వాడుతూ, స్పిరిట్ని చూపించడం హైలైట్ అని చెప్పొచ్చు.
ఈ సినిమా ఫస్ట్ హాఫ్ సస్పెన్స్ గా, సెకండ్ హాఫ్ హారర్ గా చూపించడం వల్ల ప్రేక్షకులు ఎక్కడ బోర్ ఫీల్ కారు అని చెప్పొచ్చు. ప్రతి సీన్ లో డైరెక్టర్ పనితనం కనిపిస్తుంది. ఇంటర్వెల్ కంటే ముందు చూపించిన ప్రతి సీన్ లోని ఎదో ఒక సిన్ ని తరువాత సీన్స్ కి కనెక్ట్ చేయడం వల్ల ఇంటరెస్టింగ్గా, కోత్తగా అనిపించింది. హీరొయిన్ మంజు వారియర్ పెర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది. మిగితా కరెక్టర్స్ నటన విషయానికి వస్తే కథకి తగ్గట్లు గానే ఉందని చెప్పొచ్చు.

సినిమా రివ్యూ లోకి వెళ్లబోయే ముందు మీకో చిన్న రిక్వెస్ట్. మన
Website కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్లు అయితే ప్లీజ్ మన సైట్ ని సబ్స్క్రయిబ్
చేసుకోగలరు.
చతుర్ ముఖం సినిమా హీరొయిన్ పేరు తేజస్విని. ఆమె సోషల్ మీడియాలో ఎపుడు
ఆక్టివ్ గా ఉంటుంది. తన ప్రతి చర్యని సోషల్ మీడియాలో ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. మన
హీరో ఆంటోనీతో కలిసి, ఆమె
తిరువనంత పురంలో "సిసి టివి సొల్యూషన్స్" అనే సంస్థని నిర్వహిస్తోంది. తేజస్విని ఒక మధ్యతరగతి
కుటుంబానికి చెందిన మహిళ. తన పెళ్లికి ముందు ఆర్థికంగా తను స్థిరత్వాన్ని పొందాలని అనుకుంటుంది. తన అన్నయ్య బిజేష్ ఆమెతో మాట్లాడటం మానేస్తాడు. తన తల్లిదండ్రులను ఆమెనే పోషిస్తు ఉంటుంది.
మన హీరోయిన్ కొనాలనుకునే మొబైల్ లో ఆకర్షణీయమైన ఫీచర్లు, తక్కువ ధర మరియు దానితో పాటు ఉచిత బహుమతి కూడా ఉంటుంది. ఆమె ఫోన్ కొంటుంది. ఆ మొబైల్ వెంటనే కొరియర్ ద్వారా వచ్చేస్తుంది. ఆ మొబైల్ వచ్చిన ప్పుటినుంచి ఆమె చుట్టూ అసహజమైన సంఘటనలు జరగడం ప్రారంభిస్తాయి. ఆసాధారణం కనిపించే ఈ చిన్న చిన్న సంఘటనలు తేజస్విని యొక్క దినచర్యని డిస్తుర్బ్ చేస్తాయి. ఆమె శరీరాన్ని కుడా ప్రభావితం చేయడం మొదలు పెడుతాయి, తద్వారా ఆమె ఎనలేని ఒత్తిడికి గురి అవుతుంది.
ఈ ఫోన్ లో ఎదో ఉందని తేజస్వినికి అనుమానిస్తోంది. ఆ ఫోన్ వెనుక ఉన్న మిస్టరీ ఛేదించడానికి ఆమె ఆంటోనీతో కలిసి ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి, ఆ ఫోన్ లో ఉన్నది టెక్నాలజీ య, దయ్యమా లేక ఏదైనా అతింద్రియ శక్త అనే మిస్టరి తెలుసుకోవాలంటే Aha OTT లో స్ట్రీమింగ్ అవుతున్న "చతుర్ ముఖం" సినిమా తప్చూపకుండా చుడాల్సిందే.
ఇకపోతే ఈ సినిమా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే. సినిమా చాలా మెల్లిగా మూవ్ అవుతూన్నట్లు అనిపిస్తుంది. సినిమా లెంత్ కూడా 2.18 నిషాలు ఉంది. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు అవసరం లేకున్నా పెట్టి నట్లు గా ఆనిపిస్తాయి .
మొత్తం మిద ఈ సినిమా మాత్రం థ్రిల్లర్ మరియు హారర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా బాగా
నచ్చుతుందనే చెప్పాలి.
సో ఫ్రెండ్స్ ఈ సినిమా రివ్యూ మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని తెలుపగలరు. ఈ రివ్యూ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, మీ బంధువులకి షేర్ చేయండి. మరొక్క వీడియో తో మరోసారి మీ ముందుకు వస్తాను. అంత వరకు సెలవ్.
No comments:
Post a Comment