Luckey Entertainments - Telugu Short Stories - Movie Reviews - Short Films - Beauty Tips - Health Tips - Cooking Tips in Telugu. Totally You find here complete Entertainment.

Monday, June 14, 2021

Pachchis Telugu Movie Review || పచ్చీస్ సినిమా సమీక్ష || లక్కి రివ్యూస్

Pachchise Telugu Movie Review

పచ్చీస్ సినిమా సమీక్ష

Banners: Avasa Chitram & Raasta Films.
Movie: Pachchis /Pachis

Cast: Raamz, Swetaa Varma, Ravi Varma, Jay Chandra,  Dayanand Reddy, Subhalekha Sudhakar, Keshav Deepak,  Vishvendar Reddy

Director: Sri Krishna & Rama Sai.
Producers: Kaushik Kumar Kathuri & Rama Sai.
Written by: Sri Krishna.
Co-Producer: Pushpak Jain.
Executive Producer: Dinesh Yadav Bolleboina.
DOP: Kartik Parmar.
Music Director: Smaran Sai.
Editor: Rana Prathap.
OTT : Amazon

  ఈ రోజు మనం పచ్చిస్ సినిమాని రివ్యూ చేస్దాము. ఈ సినిమా ఈ రోజే అమెజాన్ ఓటిటి లో రిలీజ్ అయింది. ఆవాస చిత్రం మరియు రాస్తా ఫిలిమ్స్ ప‌తాకాల‌పై కౌశిక్ కుమార్, రామ‌సాయి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'ప‌చ్చీస్'‌ ఆద్యంతం ఉత్కంఠ‌త‌ను రేకెత్తించే క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ చిత్రానికి శ్రీ‌కృష్ణ‌, రామ‌సాయి సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వహించారు.

 కథే విషయానికి వస్తే : కోటిశ్వరుడికి కొడుకైనా ఈజీ మనీకి అలవాటు పడి, గ్యాంబ్లింగ్‌ చేస్తూ తిరిగుతుంటాడు మన హిరో అభిరామ్‌ (రామ్స్‌). డబ్బు సంపాదించాలనే ఆకాంక్షతో అనేక అబద్ధాలు ఆడుతూ, అడ్డదోవలు తొక్కుతుంటాడు. మన హీరో. జీవితాన్ని జూదంగా నడిపేస్తుంటాడు. రాజకీయ నాయకులైన గంగాధర్‌ ('శుభలేఖ' సుధాకర్‌), బసవరాజు (విశ్వేందర్‌ రెడ్డి) మధ్య ఆధిపత్యం కోసం పోరాటం జరుగుతుంది. బెట్టింగ్‌లో ఓడిపోయిన లక్షల కొద్దీ డబ్బు కోసం బసవరాజును ఆశ్రయిస్తాడు అభిరామ్‌. ఇద్దరు రాజకీయ నేతలు  గొడవలు పాడుతారు, ఆ ఇద్దరి మద్యలో  డబ్బు కొట్టేసి, దాంతో పబ్బం గడుపుకోవాలని అనుకుంటాడు. కనిపించ కుండా పోయిన తన అన్న కోసం వెతికే చెల్లెలు అవంతి (శ్వేతావర్మ) ఎదురవుతుంది మన హీరోకి. అక్కడ నుంచి సవాలక్ష మలుపులు, మరిన్ని పాత్రల మధ్య ఈ జూదం ఏమై, ఎవరి పచ్చీస్‌ (పాచికలు) పారి, చివరికి ఏమైందన్నది ఈ సినిమా కధాంశం.

     తెలుగు సినీ తారలెందరికో ఫ్యాషన్‌ డిజైనరైన భీమవరం కుర్రాడు రామ్స్‌ ఈ సినిమాలో అభిరామ్‌ గా నటించాడు. మన హీరో ఈ చిత్రంలో జులాయి కుర్రాడిగా, మరో ఇద్దరు స్నేహితుల్ని వెంటేసుకొని అల్లరి చిల్లరిగా తిరుగుతూ కనిపిస్తాడు. నటనలో క్రేజ్  ఉన్నా, రాసిన పాత్రలో దమ్ము దైర్యం లేకపోవడం లోపమైంది. కొద్ది వారాలుగా కనిపించని అన్నయ్య కోసం వెతికే చెల్లెలి పాత్రలో, తానే ఓ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ లా ప్రవర్తిస్తుంటారు శ్వేతావర్మ. ఆ పాత్రకూ తీరూతెన్నూ కష్టపడి వెతుక్కోవాల్సి ఉంటుంది. సొంత పవర్‌ ప్రాజెక్ట్‌ కోసం శ్రమించే పొలిటీషియన్‌గా 'శుభలేఖ' సుధాకర్‌ ఉన్నంతలో బాగా చేశారు. జయ్‌చంద్ర ఒక క్యాసినోకి ఓనర్‌. రవివర్మ సహా మిగితా నటినటులు చాలామంది ఉన్నారు. అయితే, చిన్ని చిన్ని  డైలాగులతో లేనిపోని ఉద్విగ్నత రేపాలనే రచనా లోపం చక్కగా కనిపిస్తుంది.

     ఈ చిత్రం ఓటీటీ ట్రెండ్‌కు తగ్గట్టే ఉందని చెప్పారు ర్దర్శకుడు.  ఇదో క్రైమ్, సస్పెన్స్‌, యాక్షన్‌ చిత్రం అని ప్రకటించారు. కానీ, సస్పెన్స్‌ మాటెలా ఉన్నా. బోలెడంత గందరగోళం కథలో, కథనంలో మూట గట్టుకున్న చిత్రం ఇది. ఈ చిత్రం క్రైమ్‌, థ్రిల్లర్‌ కధాంశంతో నడుస్తూ కొత్త  కొత్త పాత్రలను ఇంట్రడుస్ చేస్తూ ఉంటాడు దర్శకుడు. దేనికీ ప్రాధాన్యం ఉండదు. ప్రతి పాత్రా ఏదో ఫిలాసఫీనో, గంభీరమైన విషయమో చెబుతున్నట్టు బిల్డప్ ఇస్తూ మాట్లాడుతుంది. ఎక్కడో జరిగే ఏవో విషయాలూ ఇంకేక్కేదో  జైలులో ఉన్నవాళ్ళతో సహా అన్ని పాత్రలకూ తెలిసిపోతుంటాయి. పాత్రలు, వాటి మధ్య సంబంధాలు మాత్రం ప్రేక్షకులు ఎంత తలలు బద్దలు కొట్టుకున్న  అర్థమయ్యేలా చేయడానికే దాదాపు సగం సినిమా గడిచిపోతుంది.

    ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి ఒక చోట ఓ పోలీస్ ఆఫీసర్‌తో  "ఏం జరుగుతోందో తెలియడం లేదు..." అంటాడు. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు కూడా అదే ఫీలింగూ కలుగుతుంది. అభిరామ్‌ పాత్రను జులాయిలా చూపించారు. కాసేపేమో జర్నలిస్టు అని డైలాగుల్లో అనిపిస్తారు. ఇకపోతే క్లైమాక్స్ వచ్చే పోలీసాఫీసర్‌ శంకర్‌ (దయానంద్‌ రెడ్డి) పాత్ర అయితే పోలీసు పని కాకుండా, నిందితుల వైపు నిలబడినట్టు అనిపిస్తుంది. చాలా సందర్భాల్లో ఏం జరుగుతున్నా నోరెళ్ళబెట్టుకొని పోలీసులు చూస్తున్నట్టనిపిస్తుంది. సినిమా అంతా మన హీరో అభిరామ్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో నడిచినట్టు మనకి అనిపిస్తుంది, క్లైమాక్స్ వచ్చేసరికి హీరో అంత ఇన్వెస్టిగేషన్చేసిన  వేరెవరికో క్రెడిట్‌ ఇవ్వడం కూడా వీక్షకులు జీర్ణించుకోలేరు.

     ఎక్కువగా నైట్‌ ఎఫెక్ట్‌లో కనిపించే ఈ చిత్రం లో కెమేరా వర్క్, ప్రొడక్షన్‌ వర్క్ బాగుంటాయి. పాటలేమీ లేవు/ కానీ, ఆ లోటేమీ పెద్దగా ఫీల్‌ కారు ప్రేక్షకులు. ఎడిటర్‌ తన కత్తెర పదును చూపితే ఇంకా బావుండేది. రచన దర్శకత్వ లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. కథా కథనాన్ని సరిగ్గా మొదలు పెట్టలేక పోవడంతో పాటు క్లైమాక్స్ సరిగా చేయలేదనిపిస్తుంది. కంటెంట్‌ లేని సీన్లు చాలానే ఉన్నాయి.  పాత్రలతో పాటు ప్రేక్షకులు  కన్‌ఫ్యూజ్‌ అవ్వడం ఖాయం.

       కనుక ఈ సినిమా చూడాలా వద్దా అనేది ప్రేక్షకులు మిరే నిర్ణయించుకోండి. మరొక్క రివ్యూ మరోసారి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. 


No comments: