Luckey Entertainments - Telugu Short Stories - Movie Reviews - Short Films - Beauty Tips - Health Tips - Cooking Tips in Telugu. Totally You find here complete Entertainment.

Friday, February 5, 2021

Zombie Reddy | Telugu Movie Review | Luckey Mudiraj | Luckey Reviews

Zombie Reddy | Telugu Movie Review

Movie Name : Zombie Reddy
Release date : February 05, 2021
Star Cast : Teja Sajja, Anandhi,  Raghu Babu, Daksha Nagarkar, Prudhvi Raj, Getup Srinu, Harshavardhan, Getup Srinu, Hemanth, Kireeti, Hari Teja.
Music Director : Mark K Robin
Cinematography : Anith
Editor : Sai Babu
Producer : Raj Shekar Varma
Director : Prasanth Varma

                                    

     హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కి ముదిరాజ్.  ఈ రోజు మనము జాంబి రెడ్డి అనే మూవీని రివ్యూ  చేసి చూద్దాం

తెలుగులో జాంబీల పైన వచ్చిన సినిమాలు చాలా తక్కువ అని చెప్పవచ్చు. అయితే హాలీవుడ్‌లో మాత్రం ఇలాంటీ సినిమాలు చాలా వచ్చాయి. జాంబి రెడ్డి  సినిమాని ప్రశాంత్ వర్మ ఇదే కాన్సెప్ట్ తో డైరెక్ట్ చేసారు. అయన  మొదటి సినిమా 'అ...!'.  ఈ సినిమాకి  జాతీయ అవార్డు కూడా దక్కింది. అ మూవీ తర్వాత ప్రశాంత్ వర్మ రాజశేఖర్ హీరోగా వచ్చిన కల్కి సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఆ సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేక పోయింది. 

ఇక తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తన ౩వ  సినిమాను కొత్త కాన్సెప్ట్‌తో జమ్బీస్ రూపోందించాడు. కరోనా కాలాన్ని బ్యాగ్ గ్రౌండ్‌లో తీసుకుని ఈ మూవీని తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. ఇక దీనికి ఫ్యాక్షన్ నేపథ్యం కూడా జోడించడం వల్ల కథ  థ్రిల్లర్ గా మారిందనే చెప్పాలి. అందులోనే కొద్దిగా  కామెడీ కూడా వర్కవుట్ అయింది. ఈ జాంబి రెడ్డి సినిమా ఎలా ఉంది. అసలు కథ ఏమిటి...? జాంబి లు మన తెలుగు  ప్రేక్షకులను  ఆకట్టుకున్నాయా లేదా అని  సమీక్షించి చుస్దాము.


     జాంబి రెడ్డి సినిమాలో మన తెలుగు ప్రేక్షకులకు  సుపరిచుతుడు అయిన బాల నటుడు తేజ సజ్జా హీరోగా నటించాడు. ఆనంది, దక్ష నగర్కర్ హీరోయిన్స్‌గా చేసారు. మన హీరో ఒక  గేమింగ్ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్ గా వర్క్ చేస్తుంటాడు.

 కట్ చేస్తే మన దేశం లో కరోనా విజ్రుoబించడం తో లాక్ డౌన్ విదించడం జరుగుతుంది. అదే సమయంలో మన హీరో ఫ్రెండ్ పెళ్లి కి రమ్మని ఆఫీస్ లో జాబ చేసే అందరిని ఆహ్వానిస్తాడు. మన హీరో తన స్నేహితులతో కలిసి కర్నూలులోని రుద్రవరం కి బయలు దేరుతాడు. మార్గ౦ మధ్యలో ఒక ఊహించని సంఘటన జరుగుతుంది. మన హీరో స్నేహితుల్లో ఒక స్నేహితుడు మనుషులను కొరుక్కు తినే జంబిగా  మారిపోతాడు. అతను ఎంతమందిని అలా కొరికితే అంతమంది జంబిలుగా మారిపోయి ఇంకా వేరే వాళ్ళును కోరికేస్తూ ఉంటారు. మన హీరో బృందం పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్కడ ఎం జరిగింది...?  ఈ సమస్యకి కరోనా కి ఏమిటి సంబంధం...? అసలు అంత మంది జాంబిలుగా మారాక  వాళ్ళ నుంచి మన హీరో ఫ్రెండ్స్ ఎలా తప్పించుకున్నారు...? తెలుసుకోవాలంటే ఈ సినిమా తప్పకుండా థియేటర్ లో సౌండ్ ఎఫెక్ట్స్ మద్య లో చూడాల్సిందే.


    


ఒక వైపు కరోనా, మరో వైపు మనుషులను కొరికేసి రక్తం తాగే జంబిలు, ఇంకోవైపు తలలను నారికే ఫ్యాక్షనిజం. ఈ మూడు రకాలుగా  ప్రేక్షకులకు ఉత్కంట బరితమైన సినిమాని అందించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.

 


జాంబి రెడ్డి సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏమిటో తెలుసుకుందాము. జంబిలు మన సినిమాలో రానంత వరకు కథ సాఫీగా సాగుతుంది. ఆ తరువాత అసలు త్రిల్ మొదలవుతుంది. క్షణం క్షణం ఉత్కంత కలగడం వల్ల ఎక్కడ బోర్ ఫీల్ అవ్వము. జంబిలతో పాటు కథలో ఫ్యాక్షనిజం కథ కి ఎంతో బలాన్ని ఇచ్చిందనే చెప్పవచ్చు. సెట్టింగ్స్ సూపర్బ్ గానే ఉన్నాయి. జంబిస్ మేకప్ అందరిని ఆకట్టుకుందనే చెప్పాలి. ఒకవైపు హారర్ రెండో వైపు థ్రిల్లర్ తో ప్రేక్షకులను కట్టిపడేయడం లో దర్శకుడు సపలిక్రుతం అయ్యాడనే అనుకోవచ్చు.



జాంబి రెడ్డి సినిమా చూసి మీ అభిప్రాయాలని మన కామెంట్ సెక్షన్ లో తెలుపడం మర్చిపోవద్దు.

 ఫ్రెండ్స్. మరో సినిమా రివ్యూ తో మరోసారి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవ్....

మీ లక్కి ముదిరాజ్.


No comments: