Luckey Entertainments - Telugu Short Stories - Movie Reviews - Short Films - Beauty Tips - Health Tips - Cooking Tips in Telugu. Totally You find here complete Entertainment.

Monday, February 1, 2021

30 Rojullo Preminchadam Ela Movie | Pradeep Machiraju | Telugu Movie Rev...

30 Rojullo Preminchadam Ela Movie

Telugu Movie Review

కథచాలా చాలా పాతది. మేకింగ్ పర్వాలేదు.

Movie  30 Rojullo Preminchadam Ela

Run Time  143 mins
Release  date     29th  jan 2021
Star Cast  Pradeep Machiraju, Amritha Aiyer, Viva Harsha , subhalekha Sudhakar,
 Posani Murali Krishna, Hyper Aadi, Hema,  Bhadram, Siva Narayana,Sruthi.

Music   Anup Rubens
DoP  Dasaradhi Sivendra
Producer  Babu S.V
Director   Munna Dhulipudi

ఈ రోజు మనం " 30రోజుల్లో ప్రేమించడం ఎలా " అనే మూవీ ని రివ్యూ చేస్దాము.


        ఈ సినిమా హీరో మన అందరికి తెలిసిన వాడే. ప్రదీప్ మాచిరాజు. మన స్టేట్  తరపున బెస్ట్ అంకర్ గా 2014లో నంది అవార్డ్ దక్కించుకున్న అంకర్ ప్రదీప్. గడసరి అత్త సొగసరి కోడలు అనే టీవీ షో కి ఈ అవార్డ్ లభించింది ప్రదీప్ కి.  టీవీ రంగంలో అంకర్ గా మంచి గుర్తింపుని తెచ్చుకున్న ప్రదీప్ ఇపుడు సినిమా రంగంలో హీరోగా అడుగుపెట్టాడు. గతంలో కొన్ని మోవిస్లో సైడ్ కారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ప్రదీప్ కి అంతగా గుర్తింపు రాలేదు. కాని ఈ సినిమా తో అతడికి మంచి గుర్తింపు రావాలని, మంచి మంచి అవకాశాలు రావాలని మన లక్కి రివ్యూస్ టీం తరపున కోరుకుందాము. మీరు మీ విషేస్ ని మన కామెంట్ బాక్స్ లో తెలుపండి.

 ఈ సినిమా లైన్  విషయానికి వస్తే .... పునర్జన్మల నేపద్యంలో సాగే ప్రేమ కథ ఇది. ఒకరిని ఒకరు ద్వేషించుకునే  ఇద్దరు 30 రోజుల్లో ప్రేమలో ఎలా పడ్డారు అనే కధాంశం లో కథ సాగుతుంది. తమిళ అమ్మాయి  అయిన అమృత ఐయర్ ప్రదీప్ సరసన నటించింది. వైవ హర్ష, సుభలేఖ సుధాకర్, పోసాని గారు, హేమ హైపర్ ఆది ఇతర ముఖ్య పత్రాలు పోషించారు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని నేర్చుకున్న మున్న దులిపుడి మన ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా కథ ఏమిటంటే - అది 1947 సం. ఒక చిన్న గ్రామం. అక్కడ మన అబ్బాయి గారు ప్రదీప్ మరియు అమ్మాయి గారు అమృత  ప్రేమించుకుంటారు. చెట్టపట్టాలేసుకుని చక్కగా పాటలు పడుతూ ఉంటారు.  వారు వివాహం చేసుకోవాలని అనుకుంటారు. ఒక చిన్న సంఘటన వల్ల అబ్బాయిగారు  చనిపోతాడు. అది జీర్ణించుకోలేని  అమృతా ఆత్మహత్య చేసుకుంటుంది. అర్జున్ మరియు అక్షరగా జన్మించారు.

          కట్ చేస్తే .... ఆ ఇద్దరూ అర్జున్ మరియు అక్షరగా మల్లి పుడుతారు.  వైజాగ్‌లోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో ఇద్దరు ప్రవేశం పొందుతారు. తొలి చూపులోనే ఒకరంటే ఒకరికి ద్వేషం కలుగుతుంది. ప్రతి చిన్న విషయానికి పోట్లాడుకుంటూ ఉంటారు.



కట్ చేసే .... అర్జున్ మరియు అక్షర 1947 లో తాము ఉన్న విల్లెజ్ కి వెళుతారు. అక్కడ అమ్మాయి గారు అబ్బాయి గారు చనిపోయిన స్థలానికి వెళుతారు. అక్కడ ఒక ట్విస్ట్ జరుగుతుంది. అ ట్విస్ట్ ఏమిటి...? ఒకరిని ఒకరు అంతగా ద్వేషించుకునే ఆ ఇద్దరు 30 రోజుల్లో ఎలా ప్రేమించు కున్నారు...? వాళ్ళ శరీరాల్లో జరిగిన మార్పు ఏమిటి...? ఇక్కడి నుంచి కథ ఎలా సాగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ సినిమా చూడాల్సిందే.



30రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ... ప్రదీప్ పెర్ఫార్మెన్స్ అద్భుతం అనే చెప్పాలి. తమిళ భామ అయిన అమృత అటు విల్లెజ్ అమ్మాయిగా ఇటు కాలేజ్ గర్ల్ గా  సూపర్ గా నటించింది. విల్లెజ్ నేటివిటి ప్రేక్షకులని చక్కగా ఆకట్టుకుంది. నీలి నీలి ఆకాశం పాట ఈ చిత్రానికే హై లైట్ అని చెప్పొచ్చు.  ప్రదీప్ అమృత ల జోడి ఈ  సినిమా చూసే వాళ్ళని ఒక ట్రాన్స్ లోకి తిసుకేళ్ళుతుందంటే అది అతిశోయోక్తి కాదనే చెప్పవచ్చు.  పోసాని కృష్ణమురళి భావోద్వేగ సన్నివేశాల్లో రాణించారు. హాస్యనటులు భద్రామ్, హర్ష వృధాగా కనిపించరు. తల్లిగా హేమ యాక్టింగ్ బావుంది. ఒక సిన్ లో అమృత  పురుషునిగా నటిస్తుంది. ఆ సీన్ కొంచం ఎబ్బెట్టుగా ఉంది. అంత అందమైన భామ పురుషుడిగా నటిస్తుంటే చిరాకుగా అనిపించింది. ఈ చిత్రానికి  అనుప్ రూబెన్స్ మూజిక్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. మున్న దర్శకత్వం హిట్ అనే చెప్పాలి. ఇతరం కుర్రకారుని  ఈ సినిమా చక్కగా ఆకట్టుకుంటుందనే చెప్పొచ్చు.


ఈ సినిమాకి మన లక్కి రివ్యూస్ టీం ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 4 out of 5 .

మరొక్క వీడియో తో మొరోసారి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవ్.

మీ లక్క ముదిరాజ్.

No comments: