Luckey Entertainments - Telugu Short Stories - Movie Reviews - Short Films - Beauty Tips - Health Tips - Cooking Tips in Telugu. Totally You find here complete Entertainment.

Friday, February 26, 2021

Royal Gold Biryani | బంగారం బిర్యానీ | Dubai - Bombay Borough | Luckey R...

Royal Gold Biryani Review

Dubai - Bombay Borough


This Royal Gold Biryani with 23 carat edible Gold Wraper
Pre-book yours now!
Order will serve will take up to 45 to 55 mts.
We will make sure you have the Full Meal of a lifetime
For Bookings:
 +971 043271555
📧 difc@bombayborough.ae

 

ఇప్పుడే ఆర్డర్ బుక్ చేసుకోండి! మాకు సిద్ధం చేయడానికి 45 నిమిషాలు, కానీ మీకు జీవితకాలం భోజనం రుచి ఉండేలా మేము చూస్తాము "అని రెస్టారెంట్ యొక్క ట్యాగ్ లైన్.


నాన్ వెజ్ ప్రియులకు సాదారణంగా బిర్యానీ అంటేనే చాలు నోట్లో నిల్లురి పోతాయి. కాని ఈ బిర్యానికి బిల్లు కట్టాలంటే మాత్రం తప్పకుండా నోట్లో తడి ఆరిపోవలసిందే . ఒక బిర్యానీ ఖరీదు ఎంతో తెలుసా...??  1000 Dirhamలు అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ.19,700 అన్నమాట.

అసలు ఈ బిర్యానికి ఇంత రేటు ఎందుకు చార్జ్ చేస్తున్నారు, దీని ప్రాముక్యత ఏమిటో మనం రివ్యూ చేస్దాము.


ముఖ్యంగా ఈ Royal Gold Biryani ని 23 క్యారెట్ల బంగారంతో తయారు చేస్థారు. మీకు కూడా ఆ బిర్యానీ రుచి చూడాలని ఉందా? అయితే, దుబాయ్‌కు వెళ్లాల్సిందే. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC)లోగల లగర్జీ హోటల్‌ అయినా  ‘బొంబాయి బోరో’ (Bombay Borough) తాజాగా ఈ ఖరీదైన రాయల్ గోల్డ్ బిర్యానీ తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షింది. 


అయితే, అది బంగారంతో తయారు చేసిన బిర్యానీ కదా. ఎలా తినగలం అనే సందేహం మీకు రావచ్చు. ఈ విషయంలో మీరు అస్సలు పరేషాన్ పడాల్సిన పని లేదనే చెప్పాలి. ఆ 23 క్యారెట్ల బంగారాన్ని మీరు నమిలి తినేయొచ్చు. పైగా అది టేస్టీగా కూడా ఉంటుంది.


DIFC స్పెషల్ యానివర్శరీ సెలబ్రేషన్లలో భాగంగా ఈ బిర్యానీ తయారు చేశారు. ఈ బిర్యానీని పెద్ద బంగారు పళ్లంలో పెట్టి వడ్డిస్తారు. బంగారు అప్రాన్, మెరిసే బంగారు చేతి గ్లవ్స్ తొడుకున్న ఇద్దరు వేటర్స్ దీన్ని వడ్డిస్తారు. బంగారపు పుతని బిర్యానీ లోని మటన్ ముక్కల పైనా, రైస్ మీద పూస్తారు. 


ఇండియాలోని నాలుగు వేర్వేరు ప్రాంతాలను ప్రతిబించేలా నాలుగు రకాల బిర్యానీలను తయారు చేయడం గమనార్హం. ఇందులో హైదరాబాద్‌ బిర్యానీ కూడా ఉంది. ఈ బంగారు  బిర్యానీని మీరు కూడా తినలను కుంటే దుబాయ్ కి వెళ్ళాల్సిందే పందొమ్మిది వేల ఏడు వందలు ఖర్చు చేయాల్సిందే. 


ఈ విషయానికి సంబందించిన వీడియో లింక్ పైన ఇవ్వడం జరిగింది. మా ఛానల్ లో చూడాలనుకుంటే ఇపుడే సుబ్స్క్రిబ్ చేసుకోండి. 


మీ లక్కి ముదిరాజ్.

 


No comments: