Luckey Entertainments - Telugu Short Stories - Movie Reviews - Short Films - Beauty Tips - Health Tips - Cooking Tips in Telugu. Totally You find here complete Entertainment.

Saturday, March 27, 2021

సముద్రంలో ట్రాఫిక్ జామ్ || Ship stuck in Suez Canal || Ever Green || Luc...

Ship sunk in Suez Canal 

సముద్రంలో షిప్ జామ్ 

ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే జలమార్గాలలో సూయజ్ కెనాల్ ఒకటి. అక్కడి అధికారులు నిన్న అంటే 25 మార్చ్ 2021 న ఒక ప్రకటనలో తెలిపారు. 

సుజ్ కెనాల్ ద్వారా వెళ్ళే ఒక భారి నౌక కాస్త అడ్డంగా తిరిగి ఇసుకలో కురుకు పోయింది. అందువల్ల ఆ కలువ ద్వారా వెళ్ళే రవాణాను నిలిపివేసినట్లు ప్రకటించారు కెనాల్ అధికారులు. 

ఇదేమి అంత పెద్ద విషయం కాదు అని అనుకుంటున్నరా ...? ఒకసారి ఈ స్టొరీ ని రివ్యూ చేసి చుస్తే మీ మతి పోవడం ఖాయం.

సో ఫ్రెండ్స్ లెట్స్ గో ....

దాదాపు  1,300 అడుగుల పొడువు  మరియు 224.000 టన్నుల బరువు గల పనామా కి చెందిన ఎవర్ గివెన్ షిప్ వెళుతూ వెళుతూ మార్గ మద్యలో అధిక గాలులు మరియు దుమ్ము తుఫానుల మధ్య చిక్కుకుని సుయజ్ కలువ మద్యలో అడ్డంగా తిరిగి ఇసుకలో కురుకుపోయింది. 

ఈ షిప్ ని అడ్డు తొలగిస్తే గాని ఇంకో షిప్ వెళ్ళడానికి  దారి ఉండదు. అక్కడి సిబ్బంది ఇసుకను, ఇసుక బురదను తొలగించడానికి శత ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద కంటైనర్ షిప్ అయిన Ever Given లో దాదాపు 25 మంది సిబ్బంది మన భారతీయులే. అందరు సురక్షితంగా ఉన్నారని చెబుతున్నారు.

ప్రపంచ దేశాలకు ఇక్కడి నుంచే క్రూడ్ ఆయిల్ కంటేనర్ లు వేలుతాయి. ఈ రవాణా మార్గం మూసుకుపోవడం వల్ల ఆ ఆ దేశాల ఆర్దిక వ్యవస్థపై ప్రబావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. 

అరబ్ దేశాల నుంచి చమరు ఐరోపా దేశాలతో పాటు అమెరిక వరకు వెళ్ళాలంటే ఈ సుయజ్ కెనాల్ దారే శరణ్యం. అంతే కాదు అమెరిక నుంచి ఆసియా దేశాలకు చమరు చేరాలన్న ఈ మార్గంలోనే ప్రయనిoచాలి ఉంటుంది. 

సుయజ్ కాలువ వెడల్పు 650 మీటర్లు. 120 మైళ్ళ పొడువు ఉంటుంది. ప్రపంచ దేశాల వాణిజ్యంలో దాదాపు 12 శాతం సరుకులు ఇక్కడి నుంచే ప్రయనించి గమ్యాన్ని చేరుతాయి. ప్రతి రోజు సగటున 51 అతి పెద్ద షిప్ లు ఈ కలువ గుండా ప్రయాణిస్తాయి. ఈ కలువ మూసుకుపోవడం వల్ల ప్రతి రోజు 72  వేల కోట్ల నష్టం వస్తుందని అధికారులు చెబుతున్నారు. 

ఈ నష్టం మన దేశం మిద కూడా పడి  మన దేశ చమరు దరలు  ఆకాశాన్ని తకోచ్చు. రాబోయే 24 నుండి 48 గంటల్లో కాలువను క్లియర్ చేయలేకపోతే, యూరప్ మరియు ఆసియా మధ్య మార్గాల నడుపుతున్న షిప్ లు ఆఫ్రికా చుట్టూ మళ్లించవలసి వస్తుంది  ఈ  ప్రయాణానికి దాదాపు 12 రోజుల పడుతుంది. ఖర్చు కూడా అధికం అవుతుంది. ఆ ఖర్చు కూడా మన దేశాల పైనే  పడే ప్రమాదం ఉంది.

 అంటే మొత్తం మీదా చెపాల్సి వచ్చేది ఏమిటంటే భారీగా చమురు, సరుకుల కంటేనర్ లు నిలిచి పోవడం వల్ల మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలల్లో పెట్రోల్ మరియి డిజిల్ ధరలు  అమాంతం పెరిగే అవకాశం లేకపోలేదు.


No comments: