Bizarre Marriages
అయిదు విచిత్ర వివాహాలు
వివాహం అంటేనే విచిత్రం. రెండు వీబీన్నమైన మనుషులను ఒకటిగా చేస్తుంది.ఒకటిగా కలిసిన వాళ్ళిద్దరూ ఇంకో ప్రాణికి ప్రాణం పోస్తారు. అలా అలాజీవనంసాగిపోతుంది. అయిన మనం వివాహం గూర్చి ఎందుకు మాట్లాడుతున్నాము.వివహాలలో విచిత్రమైన వాటీ గూర్చి చెప్పుకుందాము. ప్రపంచంలో అక్కడక్కడా ఒక్కోసారి విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. అలా విచిత్రమైన వివాహాల గూర్చి ఈ రోజు మనం చెప్పుకుందాము.
1. శునకం తో పెళ్లి.
ఈవిడ పేరు రోమిన పీటన. అర్జెంటేన నివాసి. తన బాయ్ ఫ్రెండ్ కి బుద్ది చెప్పాలనే ఉద్దేశంతో తన పెంపుడు కుక్కనే పెళ్లి చేసుకుంది ఈవిడ. ఎందుకని ఆరా తీయగా తన బాయ్ ఫ్రెండ్ తో చక్కగా పెళ్లి నిశ్చయం అయిందట. కానీ హటాత్తుగా అతను పెళ్ళిని నిరాకరించి వెళ్లిపోయాడట. దాంతో ఆవిడ అదే రోజు అదే ముహూర్తానికి తన పెంపుడు శునకాన్ని పెళ్లి చేసుకుని విచిత్ర వివాహాల లిస్ట్ లో చెరిపోయింది.
2. మొబైల్ నే పెళ్లి చేసుకున్న ఘనుడు.
లాస్ యాంజిల్ నివాసి అయిన ఆరోన్ తన 37 వ ఏట పెళ్లి చేసుకున్నాడు. ఎవరినో తెలుసా..? తను వాడుతున్న స్మార్ట్ మొబైల్ని. 24 గం మొబైలు తో గడిపే ఆరోన్ దాన్ని వదులుకో లేక ఎప్పటికీ తనతోనే ఉండాలనే ఉద్దేశం తో పెళ్లి చేసుకున్నాడట. ఇతని వివాహం 2016 లో I phone తో జరిగిందీ.

3. పిల్లులతో పెళ్లి
ఒకటి కాదు ఒకేసారి రెండు పిల్లులతో పెళ్లి చేసుకున్న ఘనత దక్కించుకుంది బ్రిటన్ నివాసి అయిన బర్ బ్రేలా. ఈవిడ తన బాయ్ ఫ్రెండ్ తో ఏడు సం. రిలేషన్ షిప్ లో ఉందట. ఆ తరువాత ఇద్దరి మద్యన ఎందుకనో బ్రేక్ అప్ జరిగిందీ. దాంతో ఈవిడ డిప్రెశన్ కి గురైంది. తాను ఒంటరిగా ఉన్న సమయంలో ఆ పిల్లులు ఈవిడని ఎంతగానో ఇంప్రెస్ చేశాయట. దాంతో బర్ బ్రేలా ఆ రెండు పిల్లులని పెళ్లి చేసుకుంది.

4. పాము నీ తన ప్రియురాలిగా పెళ్లి చేసుకున్నాడు.
థాయిలాండ్ నివాసి అయిన వరానంద్ సరాశ లిన్ ఏకంగా 10 అడుగుల నాగుపామునే పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు ఏమిటి అని అడుగగా తన గర్ల్ ఫ్రెండ్ చనిపోయిందట. ఎపుడు తన గర్ల్ ఫ్రెండ్ సమాది దగ్గరికి వెళ్ళిన అక్కడ అతనికి ఆ 10 అడుగుల పాము కనబడేదట. అయితే తన గర్ల్ ఫ్రెండ్ పాము రూపంలో పునర్జన్మ పొందిందని భావించిన వరానంద్ ఆ పామునే పెళ్లి చేసుకున్నాడట. ఇపుడు వరానంద్ ఎక్కడికి వెళ్ళిన ఆ పాముతోనే వెళతాడట. Tv చూసిన, బయటికి వెళ్ళిన, జిమ్ కి వెళ్ళిన, తనకి బోర్ కొట్టినపుడు క్యారమ్ బోర్డ్ కూడా ఆ పాము తోనే అడుతాదాట.

5. శవం తో పెళ్లి.
యస్ మీరు విన్నది నిజమే. థాయిలాండ్
నివాసి అయిన చార్లెస్ డెపి ఒక డెడ్ బాడిని
పెళ్లి చేసుకుని విచిత్ర వివాహాల లిస్ట్ లో చెరిపోయాడు. ఆ డెడ్ బాడి ఎవరిదో
కాదు తనని ప్రాణంగా ప్రేమించిన ఒక అమ్మాయిది. ఆ అమ్మాయి ప్రేమని డెపి
నిరాకరించాడు. తరువాత ఆ అమ్మాయి ఒక రోజు
కార్ ఆక్సిడెంట్లో చనిపోయింది.
తన వల్లే ఆ అమ్మాయి చనిపోయిందని తనని తాను నిందించుకున్నాడు డెపి. ఎలాగైనా
ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఆమె మృత శరీరాన్నే పెళ్లి చేసుకున్నాడు.
ఫ్రెండ్స్ ఈ అయిదు విచిత్ర వివహాలలో ఏది మీకు ఎక్కువ విచిత్రం అనిపించిందో కామెంట్ లో తెలుపండి. మీకు ఈ వీడియొ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి share కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా చానెల్ నీ subscribe చేసుకోండి. మరొక్క interesting video తో మీ ముందుకు త్వరలోనే వస్తాను.


No comments:
Post a Comment