Red Movie Review
Full Movie Explained by Luckey Mudiraj
- Movie Red
- Star Cast Ram Pothineni, Malavika Sharma, Nivetha Pethuraj, Amrutha aiyar, Sampath Raj, Vennela Kishore, Satya Akkala, Posani Krishna Murali, Hebba Patel and Sonia Agarwal.
- Director Kishore Tirumala
- Producer Sravanthi Ravi Kishore
- Music Mani Sharma
- Cinematography Sameer Reddy
- Editor Junaid Siddiqui
- Run Time 2 Hr 26 Min
- Release date 14 Jan 2021

గతం లో రామ్ నటించన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ ఐన విషయం మన అందరికి తెలిసిందే. ఆ సినిమా తర్వాత మన హీరో రామ్ నుండి ఈ సినిమా రావడంతో రామ్ అభిమానుల అంచనాలు బాగా పెరిగాయి. వాటిని ఏమాత్రం తగ్గించకుండా చిత్రబృందం మాంచి థ్రిల్లర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారనే చెప్పవచ్చు. దానికి తగ్గట్లు మణిశర్మ మ్యూజిక్ ఉందంటే ఆ త్రిల్ గూర్చి వేరే చెప్పనవసరమే ఉండదు. ఈ సినిమాలో రామ్ యాక్టింగ్ ఎలా ఉంది.. ఇస్మార్ట్ శంకర్ లాంటీ మరో బ్లాక్ బస్టర్‌ను రామ్ అందుకుంటాడా లేదా ...? హీరోయిన్స్ ఎలా ఆకట్టుకున్నారు. అసలు కథేంటీ.. కిషోర్ తిరుమల దర్శకత్వం ఎలా ఉంది. ఈ విషయాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాము.
Red మూవీ లో రామ్ డ్యూల్ రోల్ లో నటించారు. ఆదిత్య మరియు సిద్దార్థ. ఆదిత్య రోల్ ఫుల్ మాస్ గా ఉంటె సిద్దార్థ కారెక్టర్ క్లాసు గా ఉంటుంది. మన క్లాస్ హీరో సిద్దార్థ సివిల్ ఇంజనీర్ గా హ్యాపీ గా జీవితం గడుపుతూ ఉంటాడు. ఆదిత్య ఈజీ గా మనీ సంపాదిస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఈ క్లాసు అండ్ మాస్ హీరోల ఎంట్రీ సూపర్బ్ గా ఉంటుంది. ఈలా సాఫీగా సాగిపోతున్న వీరి జీవితాల్లో ఆకాష్ అనే వ్యక్తి మర్డర్ అల్లకల్లోం సృష్టిస్తుంది. ఒకే కేసు మీదా ఇద్దరు జైలుకి వెళ్తారు. అక్కడ వీరిద్దరూ కలుసుకోవడం వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవడం. అసలు ఆకాశను మర్డర్ చేసింది ఎవరు... దర్యాప్తు లో దొరికిన ఫోటో ఎవరిదీ... ఆ ఫోటోకి మన హీరోలకి సంబంధం ఏమిటి... వాళ్ళకి తెలిసిన నిజం ఏమిటి... ఇద్దరు హీరోల కధలో ట్విస్ట్ ఏమిటి... ఆకాష్ మర్డర్ మిస్టరీ ఏమిటి... ఈ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా రెడ్ సినిమా చూడాల్సిందే.
ఇపుడు
రెడ్ మూవీ ప్లస్ పాయింట్స్ ఏమిటో తెలుసుకుందాము. రామ్ తన కారియర్ లో మొదటిసారి డబల్ రోల్ చేయడం వల్ల అనుకుంట
తన పాత్రలకి చాల కేర్ తీసుకున్నాడు. ఎనేర్జిటిక్ ఆక్షన్ సూపర్ గా అనిపించింది..
పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసే సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
సస్పెన్స్ కొద్ది కొద్దిగా విడుతుంటే త్రిల్లంగ్
గా అనిపిసుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది రామ్ వన్ మాన్ షో అని చెప్పవచ్చు.
మాళవిక శర్మ తన అందం తో, నివేత తన అభినయం తో ప్రేక్షకులను అలరించారనే అనొచ్చు.
వెన్నల కిశోరే కామెడీ, సంపత్ రాజ్ సీరియస్ నెస్
పాత్రాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. నాజర్ పోసాని పాత్రలు పరువలేదు అనేలా
ఉన్నాయి. మిగితా పాత్రాల విషయానికి వస్తే ఒకే అనే చెప్పొచ్చు.
మైనస్
పాయింట్స్ విషయానికి వస్తే... స్క్రీన్ ప్లే సరిగా లేదనే చెప్పవచ్చు. అక్కడక్కడ
కొన్ని సీన్స్ స్లో గా కనిపించాయి. ఎడిటింగ్ చాల పూర్ గా ఉంది. కొన్ని సన్నివేశాలు
రొటీన్ గా ఉండడం వల్ల బోర్ ఫీల్ అవ్వడం తప్పదు. కథను సాగదీస్తూ వెళ్లడం సినిమాకు మైనస్ పాయింట్ అయింది.
ఈ రెడ్ మూవీ కేవలం రామ్ అభిమానుల కోసమే చేసినట్లు అనిపిస్తుంది.
మిగితా ప్రేక్షకులు తప్పకుండా బోర్ అవుతారు.
ఈ మూవీ రేటింగ్ విషయానికి వస్తే మన లక్కి రివ్యూస్ ఛానల్ తరుపున
3 అవుట్ ఆఫ్ 5 అని చెప్పవచ్చు.
మరో మూవీ రివ్యూ తో మరోసారి మీ ముందుకు వస్తాను అంత వరకు సెలవ్.



No comments:
Post a Comment