Bangaru Bullodu
Banner: AK
Entertainments
Release Date: Jan
23, 2020
Movie: Bangaru Bullodu
Cast: Allari
Naresh, Pooja Jhaveri, Tanikella, Posani, Prithvi, Praveen, Vennela Kishore, and others
Music: Sai
Kartheek
Cinematography: Sateesh
Mutyala
Editor: MR
Varma
Action: Real
Satish
Art: N
Gandhi
Producer: Sunkara
Rambrahmam
Written and Direction: Giri
Palika
Music: Sai
Kartheek
Cinematography: Sateesh
Mutyala
Editor: MR
Varma
Action: Real
Satish
Art: N
Gandhi
Producer: Sunkara
Rambrahmam
Written and Direction: Giri
PalikaMusic: Sai
Kartheek
Cinematography: Sateesh
Mutyala
Editor: MR
Varma
Action: Real
Satish
Art: N
Gandhi
Producer: Sunkara
Rambrahmam
Written and Direction: Giri
Palika
పొట్ట చెక్కలైయే కామెడి అసలే లేదు.
అయితే అమ్మవారి అసలు నగల్ని ఎలాగైనా చేసి పెట్టేయాలని
పాతికేళ్లుగా విఫలం ప్రయత్నలు చేస్తూ ఉంటాడు ప్రసాద్ తాత అయిన తనికెళ్ల భరణి.

చాలా కాలం తరువాత అల్లరి నరేష్ ని బంగారు బుల్లోడు గా తెరపై
చూడడం వల్ల హాస్యాన్ని ఇష్టపడే ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. గత
సం. 2020 అంతా కరోనాతో సీరియస్ మారీన ప్రేక్షకులకు ఈ సినిమా మంచి రిలీఫ్ ని ఇచ్చింది
. అల్లరి నరేష్ అంటేనే కామెడి కింగ్ అని మన అందరికి తెలుసు. అయన నటించిన
చిత్రాల్లో మక్షిమమ్ కామెడి సన్నివేశాలు ఉంటాయి.
సో ఈ బంగారు బుల్లోడులో కామెడి ఎంత ఉందొ, కథ ఎలా ఉందొ, కధనం ప్రేక్షకులను ఎంత వరకు ఆకర్శించిందో మనం తెలుసుకుందాము.
ఇక కథ విషయానికి వస్తే.... మన హీరో అల్లరి నరేష్ పేరు భవానీ ప్రసాద్. ఇతను స్వర్ణకారుడు. అంతేకాదు సీతా నగరం అనే ఊరి గ్రామీణ బ్యాంక్‌లో బంగారు నగలుపై వడ్డీకి డబ్బులు ఇచ్చే ఉద్యోగి. ప్రసాద్ తాత చారి అంటే తనికెళ్ల భరణి. సీతా నగరంలో మంచి పేరు ఉన్న స్వర్ణ కారుడు. ఆ ఊరిలో ఎవరికి నగలు చేయాలన్నా ఈ కుటుంబం వాళ్లే చేస్తుంటారు. ఆ ఊరి అమ్మవారు మాఊళ్లమ్మ తల్లికి నగలు చేసే ఆర్డర్ వీళ్ళకి దొరుకుతుంది.

మన హీరో ప్రసాద్
తల్లిదండ్రులకు యాక్సిడెంట్ అవ్వడం తో చాలా డబ్బులు అవసరం అవుతుంది. కొడుకు, కోడల్ని కాపాడుకునే ప్రయత్నంలో తనికెళ్ల భరణి అమ్మవారి
నగల్ని అమ్మేస్తాడు. ఆ నగల స్థానంలో డూప్లికేట్ నగలు చేసి ఇస్తాడు.
అంత డబ్బు ఖర్చు పెట్టిన ప్రసాద్ తల్లిదండ్రులు బ్రతకరు. ప్రసాద్‌తో పాటు అతని సోదరులను పెంచి పెద్ద చేసే భాద్యత తాత అయిన తనికెళ్ల భరణి పైన పడుతుంది.
ఇంతలో గుడిలో
అమ్మవారి నగల దోపిడీ జరుగుతుంది. ఆ దొంగతనం చేసింది ఎవరని పోలీసుల దర్యాప్తు
చేస్తుండగా. కథలో కీలక ట్విస్ట్ వస్తుంది. దొంగిలించబడిన నగలు నకిలీవని
తెలుస్తుంది.
దొంగలించబడిన నగల్ని పట్టుకోవాలనే
ప్రయత్నంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు మన హీరో ప్రసాద్. ఇంతకీ ఆ నగలు
దొంగిలించింది ఎవరు...? ప్రసాద్
ఎలాంటి వ్యూహంతో అమ్మవారికి నగలు చేయిస్తాడు...? మన హీరో కి హిరాయిన్ మహాలక్ష్మి అంటే పూజా జావేరి
ఎలా తోడుగా నిలిచింది,,,? అమ్మవారి నగలికి పోసానికి లింక్ ఏంటి...? ఈ విషయాలు తెలియాలి అంటే తప్పకుండా సినిమా
చూడాల్సిందే.
ప్లస్ పాయింట్లు:
చాలా
సం. తర్వాత అల్లారి నరేష్‌ను తెరపై చూడటం చాలా బాగుంది. కామెడీ సహజంగానే అతనికి
వస్తుంది కాబట్టి ఎక్కడ బోర్ ఫీలవ్వదు. మిగితా కామెడియన్స్ విషయానికి వస్తే... ప్రవీణ్ సత్యం రాజేష్, ప్రభాస్
శ్రీను హాస్యాన్ని చక్కగా పండించారనే
చెప్పొచ్చు. తనీకెల్లా భరణికి మంచి పాత్ర లలబించింది. తన ఎమోషనల్ అవతారంలో ప్రేక్షకులను
ఆకట్టుకున్నారు. పోసాని ఈ చిత్రానికి
మరో స్తంభంలా నిలిచారు. తన సహజమైన పంచ్ డైలాగులు మరియు వ్యంగ్య కామెడీతో చాలా బాగా
చేశారు. సీతా నగరం అనే
గ్రామం సెట్టింగ్ సూపర్ అనే చెప్పాలి. ఈ చిత్రం మొదటి భాగంలో
చక్కని స్క్రీన్ ప్లే మరియు ఆసక్తికరమైన కథాంశం ఉన్నాయి. చక్కని
భావోద్వేగాలతో ఫస్ట్ హాఫ్ సీన్లు బాగా కనిపించాయి. హీరోయిన్ పూజా జావేరి
అందంగా కనిపించింది. ఆమె పాత్రను కుర్రకారుని చక్కగా ఆకట్టుకుందనే అనొచ్చు. దర్శకుడు
గిరి విషయానికి వస్తే అతను సినిమాను బాగా
ప్రారంబించాడు. ముఖ్య
పాత్రలను మరియు కథాంశాలను చక్కగా పరిచయం చేసాడు. సంభాషణలు చాలా ఫన్నీ మరియు
నేటివిటీకి దగ్గరగా కనిపించాయి.
మైనస్ పాయింట్లు:
సెకండ్
హాఫ్ విషయానికి వస్తే సినిమా టెంపో పక్కదారి పట్టింది. మొదటి భాగంలో కథను
చక్కగా అమర్చిన దర్శకుడు రెండవ భాగంలో
పట్టు కోల్పోయడు. గెట్ అప్ శ్రీను లేడీ
పాత్ర ప్రవేశం పూర్తిగా డిస్ట్ ర్బ్
చేసిందనే చెప్పాలి. గెట్ అప్ శ్రీను బాగా
నటించినప్పటికీ, ఈ
చిత్రంలో చాలా కీలకమైన సమయం వృదా అయింది. ఇకపోతే రొమాంటిక్ ట్రాక్ ఎటువంటి కారణం లేకుండా కథనంలో బలవంతంగా
పెట్టినట్లు కనిపిస్తుంది. అక్కడక్కడ బలవంతపు కామెడీని పరిచయం చేయడం వల్ల ప్రేక్షకులు చికాకు పద్దరనే చెప్పవచ్చు. సిన్స్ లో ఎలాంటి కొత్తదనం లేకపోవడం ఈ సినిమాలో పెద్ద లోపం. ఇంకొక లోపం ఏమిటంటే, క్లైమాక్స్
క్షణంలో ముగిసింది. కేవలం ఒకటి లేదా
రెండు సన్నివేశాలతో ట్విస్ట్ ప్రేక్షకులకు
తెలిసిపోతుంది.
సాంకేతికత :
హై
బడ్జెట్ మూవీ కాదు కాబట్టి ఎక్కడ భారి సెట్టింగ్లు కనబడలేదు. సంగీతం బావుంది. BGM కూడా సూపర్బ్. స్వాతిలో ముత్యమంత రీమిక్స్ పాటలోని డ్యాన్స్ బాగుంది.
మొత్తం
మీద, బంగారు
బుల్లోడు సినిమా కామెడి ని ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చుతుందనే చెప్పొచ్చు కాని
కడుపు చెక్కలైయే లా కామెడి మాత్రం ఎక్కడ కనిపించ లేదు.
ఈ
సినిమా కి లక్కి రివ్యూస్ ఛానల్ తరపున మూడు అవుటాప్ ఐదు రేటింగ్ ఇస్తున్నాము.
ఈ
విడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరో మూవీ
రివ్యూ తో మరో సారి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవ్.

No comments:
Post a Comment