Luckey Entertainments - Telugu Short Stories - Movie Reviews - Short Films - Beauty Tips - Health Tips - Cooking Tips in Telugu. Totally You find here complete Entertainment.

Sunday, August 16, 2020

METRO KATHALU | మెట్రో కథలు | Movie Review | Luckey Reviews

METRO KATHALU  

Movie Review

Starring

 Rajiv Kanakala, Ram Madukuri, Gayathri Bargavi,  Jayasri
Rachakonda, Nakshathra, Nandini Rai, Ali Reza
Producers : Ram Maddukuri, Kiran Reddy Mandadi
Cinematography : Venkata Prasad
Director : Karuna Kumar
OTT   Platform: Aha

        కరోన ఖర్మ వళ్ళ థియేటర్స్ ముతబడ్డాయి. ఒటిటిలు, ఎటిటిల హావ నడవడం మొదలైంది. కొత్త కథలు లేవు, పాత కథలకి గిరాకి శురు  అయింది. మ‌హ‌మ్మ‌ద్ ఖ‌దీర్‌బాబు  రాసిన `మెట్రో క‌థ‌లు` తెర‌పైకి వచాయి. మన మెట్రో న‌గ‌ర జీవితాల్ని, అందులో ఉన్న ఆటు పోట్ల‌నీ, మ‌న‌స్త‌త్వాల్నీ, మనుషులు కోల్పోతున్న విలువైన జ్ఞాప‌కాల్నీ అద్దం ప‌ట్టెల ఉన్న  ఈ మెట్రో క‌థ‌లు  ప్రేక్షకుల ప్ర‌శంస‌లు పొందుతాయని చేప్ప వచ్చు.  వాటిలో నాలుగు క‌థ‌ల్ని ఏరి మెట్రో క‌థ‌లు అనే  సినిమాని రూపొందించారు  మన `ప‌లాస‌`మూవీ   ద‌ర్శ‌కుడు  క‌రుణ కుమార్.  మన తెలుగు ఒటిటి ఛానల్ అయిన  ఆహా లో ఈరోజున `మెట్రో క‌థ‌లు` మూవి రిలీజ్ అయింది.  మ‌రి ఆ నాలుగు క‌థ‌ల మూవీ మాటేంటి? పాఠ‌క లోకాన్ని ప్రేరేపించిన మెట్రో క‌థ‌లు తెర‌పైన  ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందామా...?


        మెట్రో కథలు నాలుగు.  ప్ర‌పోజ‌ల్‌, ఘ‌ట‌న‌, సెల్ఫీ, తేగ‌లు. ఈ నలుగు కథలు నాలుగు రకాల మనుషుల మనస్తత్వాలకు అద్దం పాడుతాయని చెప్పవచ్చు.


        మొదటి కథ విషయానికి వస్తే.... ప్రపోజల్ . ఇది ఒక మద్య తరగతి అమ్మాయి కథ. ఒక సాఫ్ట్ వేరే ఉద్ద్యోగి ఆయన చందు తన కొలీగ్ అయిన నక్షత్ర కి ఈమెయిలు ద్వారా లవ్ ప్రపోజల్ పంపిస్తాడు. వాళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్ లో కలుసుకుంటారు. నక్షత్ర తన గూర్చి, తన పేరెంట్స్ గూర్చి, తన ఎక్స్ లవ్ గూర్చి క్లుప్తంగా చెబుతుంది. తన సాలరి లోంచి కొంత భాగం తన పేరెంట్స్ కి ఇస్తా అని, కొంత అమౌంట్ తో పేద పిల్లలని చదివించాలని ఉందని చెబుతుంది. తనతో సెక్స్ లైఫ్ బావుంటుందని, మీరు బావున్నారు కాబట్టి మన ఇద్దరి జర్నీ ఇంకా బావుంటుందని చెబుతుంది. ఇంకా కొన్ని విషయాలు చెప్పి, నిర్ణయం మాత్రం అతన్నే తిసుకోమంటుంది. ఆ తరువాత ఏమైందో మిరే చుడండి.
                                                      

రెండో కథ ఘటన. కథ విషయానికి వస్తే ... మిడిల్ ఏజ్ భార్యాభర్తలు. భార్యకి కోపం, ఆవేశం, ఫ్రస్త్రేషన్ అసహనం ఉంటాయి. ఎందుకు అనే విషయం పక్కన పెడితే. ఒక రోజు భర్తకి ఆక్సిడెంట్ అవుతుంది. భార్య హాస్పిటల్ కి వస్తుంది కాని భర్తని  చూడదు. అతని పైన కోపంతో ఉగిపోతుంది. కాలుచేతులు విరగడం కన్నా ఏకంగా చచ్చిపోతే బావుంటుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.  ఆవేశం కోపం లో ఉన్న ఆమె కారు డోర్ ఓపెన్ అవ్వదు. ఆ ఆక్సిడెంట్ చేసిన కుర్రాడు అక్కడే ఉంటాడు. ఇలా కోపం, ఆవేశం లో ఉన్న మీరు కారు నడపడం మంచిది కాదు మేడం, కావాలంటే నేను మిమ్మలి డ్రాప్ చేస్తా అని ఆమెని ఇంటికి తీసుకెళతాడు. అక్కడో ఘటన జరుగుతుంది. నెక్స్ట్ డే ఆవిడా హాస్పిటల్ కి వెళ్లి భర్తని ప్రేమగా చూస్తుంది. అ ఘటన ఏమిటో తెలుసుకోవాలంటే మీరు మెట్రో కథలు చూడాల్సిందే.

        మూడో కథ విషయానికి వస్తే.... సెల్ఫీ. ఈ మద్య మనకి ఎం జరిగినా ఒక సెల్ఫీ తీసి మనవాళ్ళకి పంపిస్తూ ఉంటాము. ఈ కథ కూడా ఇలాంటిదే. సుప్రియ ఒక అందమైన భార్య. కాని భర్త మాత్రం ఆమెని అసలు పట్టించుకోడు. కరియర్, జాబ్ అంటూ వేరే వేరే ఊర్లల్లో తిరుగుతూ ఉంటాడు. పెళ్లి అయిన కొత్తలో వారానికి ఒకసారి వచ్చి కలిసే వాడు. తరువాత తరువాతా నెలకి, రెండు నెలలకి, మూడు నెలలకి ఒకసారి భార్యని కలిసేవాడు. తరువాత భార్యని అసలు పట్టించుకోవడం మానేసాడు. సుప్రియ తన పాత బాయ్ ఫ్రెండని కలవడానికి లాడ్జి కి  వెళుతుంది. అక్కడ అతన్ని హత్తుకోగానే ఆమెకి ఎదో జరుగుతుంది. అది సెల్ఫీ తీసి భర్తకి పంపిస్తుంది. అదేమిటో, ఆ తరువాత ఎం జరిగిందో తెలుసుకోవాలంటే మెట్రో కథల్లో మూడో కథ సెల్ఫీ తప్పకుండా చూడాల్సిందే. ఈ కథని ఒక స్త్రీ మాత్రమే అర్ధం చేసుకోగలదు అని నా అభిప్రాయం.

        నాలుగో కథ విషయానికి వస్తే... తేగలు. ఈ కథ కూడా మిడిల్ ఏజ్ లో ఉన్న ఫ్యామిలి కథ. భార్య భర్తని తన ఫ్రెండ్ ఇంట్లో జరిగే పార్టీకి రమ్మంటుంది. కాని భర్త ఆ పార్టీకి రాను అంటాడు. భార్యకి కోపం వచ్చి రుసరుస లాడుతుంది. భర్త తెగలు కోసుకోస్తాడు. పిల్లలని భార్యని తినుమంటాడు. వాళ్ళు కోపంతో ఉండడం వాళ్ళ తినము అంటారు. అపుడు ఆ భర్త తన చిన్ననాటి జ్ఞ్యపకాలు గుర్తు చేసుకుంటూ పిల్లలతో చెబుతాడు. ఆ విషయాలు మన కంట తడి పెట్టిస్తాయి అనడం లో ఎ మాత్రం సందేహం లేదు. తను పార్టీ కి ఎందుకు రాను అన్నాడో, ఆ తేగల కథ ఏమిటో చుస్తే కాని తెలియదు.


    మన హృదయాల్ని పిండేసే ఈ మెట్రో కథలు చెప్పడం కన్నా చూడడంలో ఒక ఫీల్ ఉంటుంది. తప్పకుండ చుడండి. చాలా రోజుల తరువాత రాజీవ్ కనకాల గారి ఆక్టింగ్ చూసే   భాగ్యం మనకి కల్పించినందుకు ద‌ర్శ‌కుడు  క‌రుణ కుమార్ గారికి థాంక్స్ అని చెప్పవచు.  అన్ని పత్రాలు అందరు చక్కగా పోషించారు. రెండు కథల్లో అడల్ట్ కంటెంట్ సీన్స్ ఉన్న ఎబ్బెట్టుగా కనిపించలేదు. ప్రతి కథ మన ఆలోచన దృక్పదాన్ని మార్చేస్తుంది అని చెప్పవచ్చు.  

మైనస్ పాయింట్స్ వెతికినా దొరకవు. అందుకే మన లక్కి రివ్యూస్ టీం తరపున ఈ సినిమాకి ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ ఇస్తున్నాము.


ఆహా OTT లింక్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నాము. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఫుల్ మూవీ చూడొచ్చు. మీ అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా తెలుపండి. ఈ విడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ కూడా చేయండి.


మొరొక్క రివ్యూ తో తొందరలో మీ ముందుకు వస్తాను. 
బాయ్ ,,, మీ లక్కి ముదిరాజ్.

No comments: