Luckey Entertainments - Telugu Short Stories - Movie Reviews - Short Films - Beauty Tips - Health Tips - Cooking Tips in Telugu. Totally You find here complete Entertainment.

Sunday, September 6, 2020

V Movie Review | వి సినిమా l Full Movie Explained | Luckey Reviews

V Movie 

Full Movie Explained Luckey Reviews

Movie Title : వి సినిమా

Release date :  05th Sep, 2020
Prime Video Link : https://www.primevideo.com/
Stars : Nani, 
Nivetha Thomas, Sudhir Babu,  Aditi Rao Hydari.

Music : S. Thaman, Amit Trivedi
Cinematography : P. G. Vinda
Editor : Marthand K. Venkatesh
Producers : Dilraju, Sirisha, Laxman, Harshith Reddy
Director : Mohana Krishna Indraganti

            కరోన పుణ్యమా అని దాదాపు 6 నెలలుగా  సినిమా ధియేటర్స్ మూతబడి ఉన్నాయి. ఒకవేళ ఓపెన్ ఉన్నా, మనం బయటికి వెళ్లి క్యూలో నిలబడి టికెట్ తీసుకుని, అందరితో కలిసి ఈలలు వేస్తూ సినిమా చూసే ఛాన్స్ ఏమాత్రం లేదు. ఎందుకంటే ఎపుడు ఎక్కడ నుంచి ఈ కరోన మహమ్మమారి వచ్చి మన  మీద దాడి చేస్తుందో మనకే తెలియదు. అందుకని చక్కగా ఇంట్లో కూర్చొని ఒక OTT platform ని subscribe చేసుకుంటే చాలు, హాయిగా మన ఇంట్లోనే సినిమా చుసేయ వచ్చు.

            ఈ రోజు మనం V Movie Review ని చేస్దము. హీరో నాని కెరియర్లో ఇది 25వ చిత్రం. విలక్షణ కథాంశాలకు కేరప్ అడ్రెస్ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ . ఈయన దర్శకత్వం వహించిన గ్రహణం, అష్టా చమ్మ, సమ్మోహనం విభిన్నమైన కథాంశంతో, విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. అయితే ఇక తాజా సినిమా V మూవీ విషయానికి వస్తే తన రూట్ మార్చి పిల్లి ఎలుక గేమ్స్ లగా  కొత్తగా ట్రై చేశారనే ఫీలింగ్ ఏర్పడుతుంది. అందుకు అనుగుణంగానే నానిని విలన్‌గా, సుధీర్ బాబును సూపర్ కాప్‌గా చూపించారు.


 


                "Expectationsకి Match అవ్వలేదు" అని అనుకోవద్దు - అని హీరో నాని ముందుగానే చెప్పినట్లు ఈ సినిమా మన Expectations కి ఎ మాత్రం అవ్వదు అనే  చెప్ప వచ్చు. చుస్తునంత సేపు బోర్ ఫీల్ కాకున్నా, చూసాక మాత్రం తప్పకుండ తల పట్టుకోవాల్సిందే. సో ఫ్రెండ్స్ ఈ సినిమా మీరు చూసాక ఎలా  ఫీల్ అయ్యారో  comment లో తప్పకుండా తెలియజేయండి


            కథ విషయానికి వస్తే - హైదరాబాద్ పాతబస్తీలో అల్లర్లు జరుగుతు unటాయి. విచక్షణ రహితంగా ప్రజలని చంపుతుంటారు. పెట్రోల్ బాంబులతో కనబడిన వాటిని తగులబెడుతుంటారు. పోలీస్ ఫార్చ్ నియంత్రించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అదే సమయంలో మన స్టైలిష్ సూపర్ కాప్ అయిన సుదీర్ బాబు ఎంటర్ అవుతాడు. అల్లర్లు చేస్తున్న ముఠా మద్యలోకి వెళ్లి వాళ్ళను పట్టుకుంటాడు. న్యూస్ పేపర్స్ లో అతని గూర్చి వార్తలు వస్తాయి. దాంతో పాటు మన సినిమా టైటిల్స్ పడుతాయి.

            DCP ఆదిత్య అంటే మన సుదీర్ బాబు సాదించిన విజయానికి క్లబ్ లో చిన్న పార్టీ జరుగుతుంది. పోలీస్ డిపార్టమెంట్ కి చెందిన వాళ్ళు చాల మంది వస్తారు. హీరొయిన్ నివేదా థామ‌స్ తో సాంగ్ ఉంటుంది. అ తరువాత ఇంటికెళ్ళి పడుకుంటాడు ఆదిత్య. ఉదయం లేవగానే తన డిపార్టుమెంటుకి చెందినా ఒక ఇన్స్పెక్టర్ హత్యా చేయబడ్డాడు అని వార్త వస్తుంది. వెళ్లి చూస్తాడు ఆదిత్య. అక్కడ అతను షాక్ అవ్వుతాడు. హత్యకి గురైన ఇన్స్పెక్టర్ నుదిటి మిద ఒక స్లిప్ అంటించి ఉంటుంది. దాని మిద "D.C.P ఆదిత్య గారు నువ్వే నాకు  కావలి" అని రాసి ఉంటుంది. ఇక్కడి నుంచి ట్విస్ట్ ల పైన ట్విస్ట్ లతో ఉత్కంట బరితంగా సాగుతుంది మన కథ.

            ఈ హత్యలు మన హీరో నాని ఎందుకు చేస్తున్నాడు....? హత్యలు చేసాక క్లూ ఎందుకు వదులు తున్నాడు....? మన హీరోకి, సెకండ్ హీరో సుదీర్ బాబుకి ఏమిటి రిలేషన్ ...? డీసీపీ ఆదిత్య త‌న ప్రేయ‌సి అపూర్వ‌ (నివేదా థామ‌స్) సాయం ఎందుకు కోర‌తాడు...? ఆదిత్య కిల్ల‌ర్‌ను ప‌ట్టుకున్నాడా? లేదా? తన జబ కి ఎందుకు రాజీనామా చేసాడు ...?  అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే సినిమా తప్పకుండా చూడాల్సిందే.


            క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్రం కాబ‌ట్టి కామెడీ ఎక్కడ కనబడదు. అక్కడ అక్కడా హీరో నాని చేసే చిలిపి పనులకు నవ్వు కుండా ఉండలేము. హత్యలు చేసేప్పుడు నాని చెప్పే భారి డైలాగులు ప్రేక్షకులను ఆకట్టు కుంటాయి. క్లైమాక్స్ కి ముందు రెండు హత్యలు భయంకరంగా చూపించారు. పాతబస్తీ నుంచి కాశ్మీర్ కి కథ వెళ్ళడం బావుంది. అదితి రావు హైదరీ సినిమాలో కొద్ది సేపు కనిపించినప్పటికీ, గుర్తుండి పోయేలా పాత్రనుపోషించిందనే చెప్పాలి. చివర్లలో అదితి తన ఫెర్ఫార్మెన్స్‌తో భావోద్వేగానికి గురిచేస్తుంది. ఇద్దరు హీరోల మీద స్టోరీ రన్ కావడం వల్ల వీరిద్దరి పాత్రలు వెనుకపడ్డాయనే ఫీలింగ్ కలుగుతుంది. జీవితంలో విలువలు పాటించే మనిషి రాక్షసుడు గా మారడం. విలువల తో కలిసి ఉన్న మనిషిని టార్గెట్ చేస్యడం కొద్దిగా గందరగోళంగా ఉందని చెప్పవచ్చు. ఎది ఎమైన ఒక్కసారి ఈ సినిమా చూడొచ్చు అని చెప్పవచు.

            సో ఫ్రెండ్స్  ఈ సినిమా సమీక్షా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మన ఛానల్ ని subscribe చేయడం మరువకండి. మరొక్క వీడియో తో మరోసారి మీ ముందుకి వస్తాను. అంతవరకు బాయ్ బాయ్...
 మీ లక్కి ముదిరాజ్.

*****************************************************************************
Our Top Reviews :-- 1. NAKED నగ్నంగా Movie Review : https://youtu.be/t-E4XKDFNdU 2. 302 Full Movie Review : https://youtu.be/2zJRIZAbyxU 3. Power Star Full Movie Review : https://youtu.be/2KvasiGCa08 4. Thriller Movie Apsara Rani H0t Pics : https://youtu.be/bRWOdDXSLi0 5. FORENSIC MOVIE Movie Review : https://youtu.be/m42uf5WtiK8 6. Rular Movie Review: https://youtu.be/kPH8rjJlg24 7. Thriller Movie Review : https://youtu.be/JiLiMPhdz7Y 8. METRO KATHALU మెట్రో కథలు Review: https://youtu.be/wX9OztuWzPY 9. EDAINA JARAGOCHU : https://youtu.be/uTcka2IV0ns
           

1 comment:

Unknown said...

It is a Nice Movie. I liked Nani movies.