She Loved Him - Marry Me
అతన్ని ప్రేమించి నన్ను పెళ్లి చేసుకుంది
She Loved Him but marry me. నా సమస్య కి పరిష్కారం చెప్పండి అంటూ నెల్లూర్ నుంచి విజయ్ కుమార్ గారు అడుగుతున్నారు. అతని సమస్యని విని మీకు తోచిన పరిష్కారం చెబుతారని ఆశిస్తున్న.
విజయ్ కి పెళ్లయి మూడు నెలలు అయింది. అందం, అణుకువ, అమాయకత్వం, కలిగిన తన భార్యతో కలిసి విజయవాడ లో కాపురం పెట్టాడు విజయ్.
అలా కళ్ళు మూసుకుని తెరిచినట్లే మూడు నెలలు గడిచిపోయాయి. ఒక రోజు అతని భార్య తన పాత ప్రేమ గురించి చెప్పిందట. ఆమె తన క్లాస్‌మేట్ రవితో కొన్ని రోజులు ప్రేమలో ఉందని. అతనితో సినిమాలకి, షికార్లకి తిరిగిందని. అతనితోనే తన జీవితం అని కలలు కన్నాను అని చెప్పింది.
తనని పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేవాడని కూడా తెలిపింది. అతడు తనతో బలవంతంగా ఒకటి రెండు సార్లు శరీరక సంబంధం కూడా పెట్టుకున్నాడని పేర్కొంది. కాలేజ్‌లో తన గురించి పుకార్లు వ్యాపించాడంతో కాలేజి వదిలేసి అతను వెళ్ళిపోయాడట.
తను కూడా కాలేజి మానేసి తన తల్లిదండ్రుల కోరిక మేరకు వివాహం చేసుకుందట. ఇవన్నీ పెళ్ళికి ముందే చెప్పనందుకు తనని ఆమె క్షమాపణలు కూడా కోరిందట. కానీ ఇపుడు మాత్రం ఆమె తననే మనస్పూర్తిగా ప్రేమిస్తున్నానని చెప్పిందని మేయిల్ లో పేర్కొన్నాడు విజయ్.
ఆమె తన గతాన్ని నిజాయితిగా
పంచుకున్నందుకు సంతోష పాడాలా... లేక తను ఒకడ్ని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి
చేసుకుని అడ్జెస్ట్ అవుతుందని భాధ పాడాలా అని అర్ధం అవ్వడం లేదు అని అడుగుతున్నాడు.
ఆమె గతాన్ని విన్న తరువాత, అతనికి మతిపోయి పిచ్చివాడిలా తాయారు అయియదట. పదే పదే తన
భార్య చెప్పిన విషయాలే గుర్తు చేసుకుంటూ తనలో థానే కుమిలిపోతున్నాడట విజయ్.
ఇలాంటి
సమస్యలు మీకు ఉంటె మీ విజయ్ వాయిస్ తో రికార్డ్ చేసి లేదా కాగితం పై చక్కగా రాసి మా ఛానల్ మెయిల్ కి పంపించండి. మీ
సమస్యని మా సమస్యగా భావించి ప్రేక్షకుల ముందు పెడదాము. ఎవరో ఒకరు మీ సమస్యకి మంచి
సలహా చెప్పకపోరు. ఆ సలహా పాటించి మీరు మీ జీవితాన్ని సంతోషంగా కొనసాగిస్తారని
ఆశిస్తున్నా.
మరొక్క
సమస్యతో మరోసారి మీ ముందుకు వస్తాను అంతవరకు సేలవ్.
మీ
లక్కి ముదిరాజ్.
No comments:
Post a Comment