World Top Donor
ద్వాపర యుగం లో పుట్టిన కర్ణుడు తనను అడిగిన వారికి లేదనకుండా ధర్మాలు చేసి చరిత్రకి ఎక్కాడు. తను మరణ దశలో ఉన్నపుడు కూడా తనకున్న హజమైన కవచ కుండలాలను, తన నోటిలో ఉన్న బంగారపు పన్నును దానం చేశాడు. కొన్ని వందల, వేల సంవత్సరాలు గడిచినా ఇప్పటికి కర్ణుడి పేరుని దాన కర్ణుడు అనే పిలుస్తారు.
ఈ కలియుగం లో ఎవరికైనా 10 రూ. దానం చేయాలంటే 100 సార్లు ఆలోచిస్తాము. కానీ అతను అలా ఏ మాత్రము ఆలోచించలేదు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోన వైరస్ తో అతలాకుతలం అవుతుంది. ఇలాంటి సమయం లో కూడా పేదలకు దానం చేసిన వాళ్ళను కేవలం వెళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. కొందరు బిసినెస్ మెన్లు, మరి కొందరు సినిమా ఏక్టర్స్ తప్ప ఏ రాజకీయ నాయకుడు ఒక్క రూ. కూడా దానం చేయలేదు.
కాని ఒక కలియుగ కర్ణుడు తన ఆస్తి లోంచి కేవలం 15% డబ్బు తన వద్ద ఉంచుకుని మిగితా 85% డబ్బుని దానం చేశాడు. 85% అంటే ఎంత అనుకుంటున్నారు...? అక్షరాల 58 వేల కోట్లు. ఎస్ మీరు విన్నది నిజమే - 58 వేల కోట్ల రూపాయలను దానం చేశాడు.
ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచిన ఈ దాన కర్ణుడు ఎవరో కాదు. అమెరికలో ఒక శ్రీమంతుడు. ఆయన ఎవరికీ తెలియదు. అందరికి తెలిసేలా ఫోటోలు దిగుతూ, వీడియోలు తియించుకుంటూ దానాలు చేయడు. ఆయనే Charles Chuck Feeney. ఫీని 1931 April 23 న జన్మించారు. ప్రస్తుతం అయన వయసు 89 స. అయన బిజినెస్ చేస్తూ, Duty Free Shoppers Group కి సహా వ్యవస్థాపకుడిగా ఉంటూ, ప్రపంచంలోకెల్లా అతి గొప్పదైన ప్రైవేటు ఛారిటబుల్ ట్రస్ట్ ని స్థాపించాడు. దాని పేరు The Atlantic Philanthropies.
ఆయనకి స్వంత ఇల్లు లేదు, స్వంత కారు లేదు. చాటర్ ప్లేన్ కొనుక్కునే స్థాయి డబ్బు ఉన్న మాములు వ్యక్తిగా ఎకనామి క్లాసు లోనే ప్రయాణం చేస్తారు. అయన సంపాదించిన ఆస్తి మాత్రం లక్షల్లో కోట్లల్లో ఉంది. అయన నమ్మే సిద్ధాంతం ఒకటే. సంపాదించడం లో ఆనందం కన్నా దానం చేయడం లో ఉన్న ఆనందంలో కిక్క్ ఎక్కువగా ఉంటుందని. అందుకే అయన సంపాదించిన ఆస్తి లోంచి తనకు ఎంత అవసరమో అంతే ఉంచుకుని మిగితాది అంతా దానం చేసేశాడు. కిక్క్ ఎక్కువగా ఉంటుందని. అందుకే అయన సంపాదించిన ఆస్తి లోంచి తనకు ఎంత అవసరమో అంతే ఉంచుకుని మిగితాది అంతా దానం చేసేశాడు.
ఇది ఇప్పుడు చేసిన దానం కాని ఆయనకి 40 ఏళ్ళ వయసు ఉన్నపుడే The Atlantic Philanthropies అనే స్వచ్చంద సంస్థను స్థాపించి సేవలు చేయడం ప్రారంభించారు. గుప్త దానాలు చేయడమే కాని ప్రచారాన్ని ఆశించని ఫిని ఇంతవరకు వార్తల్లోకి రాలేదు. కాని ఇప్పుడు విరాళాలు స్వీకరించిన సంస్థలు అయన పేరు బయట పెట్టడంతో ప్రపంచం ఒక్కసారిగా ఆశ్చర్య పోయింది.
ప్రస్తుతం మన దేశం లో 102 మంది బిల్లియనేర్లు ఉన్నారు. కరోన కరువు కాలంలో మరో 15 మంది బిల్లినేర్లుగా అత్యంత సంపన్నుల జాబితాలో చేరిపోయారు. ఇది మన దేశం యొక్క దుస్థితి. మన దేశం లో సంపదిస్తూ, మన దేశ వనరులను వాడుకుంటూ, మన దేశ ప్రజల కష్టాన్ని దోచుకునే ఈ బిలియనర్లు ఎపుడు మారుతారో ఏమో..????
ఈ వీడియొ మీకు నచ్చినట్లు అయితే మీ ఫ్రెండ్స్ కి, బందువులకి షేర్ చేయండి. అలాగే మన చానెల్ నీ సుబసక్రయిబ్ చేయడం మరవ్వద్దూ. బై ఫ్రెండ్స్.. మరొక వీడియొతో త్వరలో మీ ముందుకు వస్తాను.
2 comments:
Wovv super.
Good Information
Super �� sir
Post a Comment