Manmadhudu – 2
Full Movie Review
“రెండు నిమిషాల సుఖం కోసం పెళ్లి చేసుకోను…”
అయ్యో ఈ డైలాగ్ నాది కాదండీ సినిమాలో ఇలా లేదు.
“భోజనం కోసం వ్యవసాయం చేయను…”
మన హీరో మన్మధుడు మాత్రం ఇలా అంటాడు.
“ఐ యామ్ నాట్ ఫాల్ ఇన్ లవ్. బట్ ఓన్లీ
మేక్ లవ్.”
అంటే “ప్రేమలో పడను, పెళ్లి చేసుకోను, పిల్లల్ని కనను కానీ ప్రేమిస్తాను.”
అంటే అర్థం అయిందా...? అయ్యో అర్ధం అవ్వలేదా...?
నాకు అర్ధం అవ్వలేదు. సినిమా చూస్తే అంత
అర్ధం అవుతుంది. నేను చెప్పిన మాటల అర్ధం ఏమిటో.
మన్మధుడు 2 సినిమా కి ఇన్స్పిరేషన్ “ i Do “ అనే ఫ్రెంచ్ మూవీ. ఈ సినిమాలో 50 ఏళ్ల మన్మధుడు అంటే మన హీరో నాగార్జున
పాతికేళ్ల అమ్మాయిలతో సరసాలు ఆడటం కుర్రకారుని ఆకట్టుకుంటుంది. ఇంకో విషయం ఏమిటంటే
ఈ సినిమాలో లిప్ లాక్ కూడా ఉన్నాయి. ఒక సందర్భంలో రకుల్ ప్రీత్ సింగ్ కి ఝాన్సీ కి
మధ్య కూడా లిప్ లాక్ సీన్ ఉంటుంది.
ఇకపోతే డబుల్ మీనింగ్ డైలాగులు కుర్రాళ్ళకి
కిక్కు ఇస్తాయి. అక్కడ అక్కడ బుతు డైలాగులను దాచే ప్రయత్నం చేశారు దర్శకుడు రాహుల్
రవీంద్రన్.
ఫస్టాఫ్ లో సినిమా మొత్తం సరదాగా సరదాగా
సాగిపోతుంది. సెకండాఫ్ లో కాస్త బోర్ కొడుతుంది. క్లైమాక్స్ మాత్రం ఉత్కంటగా ఉంటుంది.
నాగార్జున రకుల్ ప్రీత్ సింగ్ యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు.
హీరో ఫ్రెండ్ గా సినిమా మొత్తం లో వెన్నెల కిషోర్ యాక్టింగ్ సూపర్. సో యాక్టర్స్
నాజర్, రావురి రమేష్, లక్ష్మి, ఝాన్సీ, దేవదర్శిని మరియు నిశాంతి ప్రేక్షకులను
నిరాశపరిచ లేదనే అనుకోవచ్చు.
మన హీరో నాగార్జున పేరు సాంబశివరావు షార్ట్ కట్ లో శ్యామ్ అని పిలుస్తారు. వ్యాపారం చేస్తుంటాడు. ఇతనికి ఒక తల్లి ఇద్దరు అక్కలు ఒక చెల్లి ఉంటారు. హీరో కి ఒక మంచి ఫ్రెండ్ కూడా ఉంటాడు. హీరో ఇంట్లో అందరికీ పెళ్లిలు అయిపోతాయి.
కాని మన హీరోకి మాత్రం 50 ఏళ్ల వయసు వచ్చిన పెళ్లి అవ్వదు. కారణం
ఒక చిన్న లవ్ ఫెయిలువర్. మన హీరో లవ్ ఫెయిల్ అవడంతో పెళ్లి అంటే అసహ్యించు కుంటాడు.
అమ్మాయిలు అంటే ఇష్టపడతాడు కాని పెళ్లి మాత్రం వద్దు అంటదు. అమ్మాయిలతో లైఫ్ ఎంజాయ్
చేస్తూ ఉంటాడు.
అయితే సినిమ ఎండింగ్ లో వీరిద్దరికీ
పెళ్లి అవుతుందా...? మన హీరోకి ప్రేమ మీద నమ్మకం కలుగుతుంది...? అనేది సస్పెన్స్ ఈ
సినిమా క్లైమాక్స్ 20 నిమిషాలు మాత్రం ప్రేక్షకులను ఉత్కంఠ భరితంగా
చేస్తుంది.







1 comment:
Nice Review
Post a Comment