Bridegroom Review
మీ భర్త ఎలా ఉండాలని అనుకుంటున్నారు...???
పెళ్లి అంటే నూరేళ్ళపంట అంటారు పెద్దలు. నిజమే, వందేళ్ళు ఒక అబ్బయితో కలిసి మెలిసి ఉంటూ, సంసారం అనే పంటను పండిస్తూ, పులు పూయిస్తూ దాని
ఫలాలను రుచి చూడడమే జీవితం. ఇలాంటి జీవితం కోసం జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో కాస్త జాగ్రత్త పడడం మంచిదే.
అమ్మాయిలు మీరు ప్రతి రోజు కూరగాయలు కొంటారు. కొనే ప్రతి
కురను, కాయలను పరిశీలించి అది మంచిదా పుచ్చుదా అని ఆచి తూచి కొంటారు. ఒక రోజు తినే కూరలను మంచిగా ఎంచుకుని
కొంటారే మరీ జీవితాంతం తోడుగా జీవించే జివిత భాగస్వామినీ ఎందుకు పరిశీలించరు. మీ
పరిశీలన కోసం ఇక్కడ కొన్ని టిప్స్ ఇస్తున్నాను,
మీకు నచ్చితే ఫాలో అవ్వండి లేకపోతే ఒక చిరునవ్వు నవ్వి వదిలేయండి.
టిప్ నంబర్ వాన్.
సంపాదన లేని అబ్బాయిని అసలు పెళ్లి చేసుకోవద్దు.
తల్లిదండ్రులు అంటే గౌరవం లేని అబ్బాయి, అన్నదమ్ములను,
అక్క చెళ్ళల్లను ప్రేమించ లేని అబ్బాయిని
పెళ్లి చేసుకోవద్దు. ఎందుకంటే పెద్దలని, తన తోటి వారిని ప్రేమించ లేని అబ్బాయిలు అసలు భార్యని
ప్రేమించలేరు. సొ అలాంటి అబ్బాయికి దూరంగా
ఉండడమే మంచిది.
అమ్మాయి కన్నా అబ్బాయి వయసు దాదాపు 10 సం కంటే ఎక్కువ
ఉంటే అసలు పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే ఇలాంటి అబ్బాయిలు భార్యాలను ఎక్కువగా టార్చర్ పెడుతూ, ప్రతి విషయం లో డామినేట్
చేస్తుంటారు.
మీ తల్లిదండ్రులు
నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే పెళ్లి అయ్యాక ఏదైనా ప్రాబ్లమ్స్
వస్తే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పట్టించుకోరు, పెగా మీరు ఏదో తప్పు చేసినట్లుగా భావిస్తారు.
బరువు భాద్యతల నుంచి దూరంగా ఉండే వ్యక్తిని అసలు పెళ్లి
చేసుకోకూడదు.
40 సం దాటిన అబ్బాయిని పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే
అంతవరకు ఎందుకు పెళ్లి కాలేదో విచారించి మీకు సబబుగా అనిపిస్తేనే పెళ్లి
చేసుకోండి. లేదంటే రిజక్ట్ చేయవచ్చు.
ప్రేమలో మోసపోయిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే పరువ లేదు
కానీ ప్రేమలో ఓడిపోయిన వారిని మాత్రం అసలు పెళ్లి చేసుకోకూడదు.
ఎందుకంటే
ప్రేమలో మోసపోయిన అబ్బాయి భాధలో ఉంటాడు. తాను ప్రేమించిన అమ్మాయి తనని మోసం
చేసిందని డిప్ప్రేషన్ కి గురై ఉంటాడు. ఇలాంటి అబ్బాయికి మీరు ప్రేమని పంచితే మిమ్మల్నే తన
దేవతగా భావిస్తాడు.
ఇకపోతే ప్రేమలో ఓడిపోయిన అబ్బాయి ప్రేమ చాలా స్వచమైనది. ఆ అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయిని
తొందరగా మర్చి పోలేక పోతాడు.. పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అది మీకు పెళ్లి
అయిన తరువాత టార్చర్ ల అనిపించ వచ్చు.
కట్న కానుకల విషయం లో అత్యాశ ఉన్న అబ్బాయినీ అసలు పెళ్లి
చేసుకోకూడదు. పెళ్లి తరువాత కూడా వారి డిమండ్స్ కొనసాగుతూనే ఉంటాయనే విషయం
మరచిపోవద్దు.
కొందరు అబ్బాయిలు చూడడానికి ఫిజికల్ గా చాలా ఎట్రాక్శన్
ఉంటారు. కాని మెంటల్ గా డిస్ఆర్డర్ గా ఉంటారు. ఒకటికి నాలుగు సార్లు అలాంటి
అబ్బాయిలతో సన్నిహితంగా ఉండి అన్ని
తెలుసుకుని పెళ్లి చేసుకుంటే మంచిది.
నేను చెప్పిన ఈ విషయాలే కాక మీ విజ్ఞ్యత తో ఆచి తూచి
సంసారమనే ప్రేమసాగరం లోకి దిగండి. మీ మీ
జీవితాలను ఆనందమయం చేసుకోండి.
అల్ ది బెస్ట్ టు
అల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు.
ఈ విడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కి షేర్
చేయండి. అలాగే మన ఛానల్ ని సుబ్స్ క్రైబ్ చేసుకోవడం మరిచిపోవద్దు. ఘంట సింబల్ కూడా
క్లిక్ చేయండి...
మీ లక్కి ముదిరాజ్.
No comments:
Post a Comment